రాజ్యాంగాన్ని తిరగరాయాలన్న కేసీఆర్ ను గద్దె దించుతాం

– అంబేద్కర్ రాజ్యాంగమే ఈ దేశానికి రక్ష
-టీఆర్ఎస్ పాలనకు చరమ గీతం పాడేందుకే ప్రజా సంగ్రామ యాత్ర
-అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే
-అంబేద్కర్ ను అడుగుడుగునా వంచిన పార్టీలు కాంగ్రెస్, టీఆర్ఎస్
-బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్య
-పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు

‘‘ప్రపంచమే గర్వించదగ్గ రాజ్యాంగాన్ని ప్రసాదించిన మహనీయుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్. రాజ్యాంగం ద్వారా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ ను నిలబెట్టిన గొప్ప వ్యక్తి. ఈ దేశానికి అంబేద్కర్ రాజ్యాంగమే రక్ష. అంబేద్కర్ ఆశయాలకు అమలు చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే. అంబేద్కర్ ను అడుగడుగునా అవమానిస్తున్న పార్టీలు కాంగ్రెస్, టీఆర్ఎస్. అంబేద్కర్ రాజ్యాంగాన్ని తిరగరాయలన్న కేసీఆర్ అవినీతి-కుటుంబ-అరాచక-నియంత పాలనకు చరమ గీతం పాడేందుకే ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించాం’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చెప్పారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆ మహనీయుడి చిత్రపటానికి పూలమాల వేస ఘనంగా నివాళులు అర్పించారు.

అంబేద్కర్ కు నివాళి అర్పించిన వారిలో బండి సంజయ్ తోపాటు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్, ఎమ్మెల్యే పార్టీ తమిళనాడు సహ ఇంచార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు జి.వివేక్ వెంకటస్వామి రఘు నందన్ రావు, మాజీమంత్రి సుద్దాల దేవయ్య,, మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శుల గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, జాతీయ ఎస్సీ కమిషన్ మాజీ సభ్యులు రాములు, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాష, ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్ నాయక్, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గీతామూర్తి, రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్.సంగప్ప, అశోక్, అందెల శ్రీరాములు యాదవ్ తదితరులున్నారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు…
రాజ్యాంగ నిర్మాత, మనందరి స్పూర్తి ప్రదాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, బీజేపీ కార్యకర్తలకు నా శుభాకాంక్షలు. అంబేద్కర్ ను స్పూర్తిగా తీసుకుని వారి చరిత్రను, వారి గొప్పతనాన్ని దేశ ప్రజలకు అందజేయాలని బీజేపీ ఎంతగానో కృషి చేస్తోంది.

ప్రపంచమే మెచ్చుకునేంతటి అతి పెద్ద ప్రజాస్వామ్య భారత్ కు పునాదలు వేస్తూ రాజ్యాంగాన్ని తీసుకొచ్చిన మహనీయుడు అంబేద్కర్. అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా అంత్యోదయ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళుతున్న పార్టీ బీజేపీ.

నేను ప్రధాని అయ్యానంటే… అది అంబేద్కర్ ప్రసాదించిన రాజ్యాంగం పెట్టిన భిక్ష అని పార్లమెంట్ లో ప్రకటించిన వ్యక్తి నరేంద్రమోదీ.అంబేద్కర్ చరిత్రను భావితరాలకు తెలియజేయాలనే ఉధ్దేశంతోనే పంచతీర్థాలను అభివ్రుధ్ధి చేసిన పార్టీ బీజేపీ.అంబేద్కర్ స్పూర్తితో పాలిస్తున్న పార్టీ బీజేపీ…ఎంతో మంది దళితులకు ఉన్నత పదవులు కట్టబెట్టిన పార్టీ బీజేపీ.బీజేపీ అంబేద్కర్ స్పూర్తితో పనిచేస్తుంటే… ఆయన ఆలోచనలకు భిన్నంగా వ్యవహరిస్తున్న పార్టీ కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు.అంబేద్కర్ ను అడుగడుగునా అవమానించడంతోపాటు ఎంపీ గా పోటీ చేస్తే ఓడించిన పార్టీ కాంగ్రెస్.

అంబేద్కర్ జయంతి, వర్దంతులకు హాజరుకాని ఏకైక సీఎం కేసీఆరే. కనీసం ఈరోజైనా అంబేద్కర్ ను తలుచుకుంటే మంచి బుద్ది వస్తుందని కేసీఆర్ కు సూచిస్తున్నా. అంబేద్కర్ ను కొలిస్తే దళితులకు ఇచ్చిన హామీలన్నీ గుర్తుకొస్తాయని ఆశిస్తున్నా.

అంబేద్కర్ రాజ్యాంగం ప్రపంచానికే స్పూర్తి… కానీ కేసీఆర్ మాత్రం ఆ రాజ్యాంగాన్ని తిరిగి రాస్తానంటూ.. కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తెస్తానంటూ ఆహంకారంతో మాట్లాడుతున్నరు. బీజేపీ ఎన్నటికీ కల్వకుంట్ల రాజ్యాంగాన్ని ఒప్పుకోరు. ఆ ఆలోచననే చంపేస్తాం.అంబేద్కర్ రాజ్యాంగమే ఈ దేశానికి రక్ష. ఆ స్పూర్తితోనే కేసీఆర్ అవినీతి-నియంత-కుటుంబ పాలనకు చరమ గీతం పాడేందుకు ప్రజా సంగ్రామ యాత్రను చేపట్టాం.అంబేద్కర్ ఆశయాలను కొనసాగించేందుకు బీజేపీ కంకణం కట్టుకుంది.

డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ….
అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని బండి సంజయ్ చేపట్టిన రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చి వేయడం ఖాయం.కేసీఆర్ పాలనపట్ల అన్ని వర్గాల ప్రజలు కట్టలు తెంచుకునేంతటి ఆక్రోశంతో ఉన్నారు.టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్న తరుణంలో ప్రజలకు బీజేపీ ఆశాదీపంలా కన్పించింది. రాజ్యాంగాన్ని మార్చివేయాలంటూ అంబేద్కర్ ను అవమానించిన కేసీఆర్ ను మార్చేందుకు ప్రజలు సిద్థమయ్యారు.

కేసీఆర్ కు కనీస సామాజిక స్ర్పహ లేదు. తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.ఇప్పటికైనా చేసిన తప్పులకు, వక్రభాష్యాలను ఒప్పుకుని క్షమాపణ చెప్పాలి. ఎన్టీఆర్ ఆనాడు కేంద్రంతో సంబంధం లేకుండా ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు జీవో ద్వారా రిజర్వేషన్లు ఎన్టీఆర్ కల్పించారు.ఆ స్పూర్తితో పనిచేయాల్సిన కేసీఆర్… అందుకు భిన్నంగా బీసీల రిజర్వేషన్లను కుదించి కుట్ర చేశారు.కల్వకుంట్ల సర్కార్ ను గద్దె దించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీలకు 34, ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తాం.

రఘునందన్ రావు మాట్లాడుతూ….
భారతీయులు గర్వించదగ్గ రోజు. ఇంటర్నేషనల్ నాలెడ్జ్ గా ప్రకటించాలని ప్రపంచం చెబుతున్నా… కేసీఆర్ మాత్రం గుర్తించకపోవడం దురదృష్టకరం.ఫాంహౌజ్ లు, ప్రగతి భవన్ లు కట్టడానికి ప్రాముఖ్యతనిస్తున్న కేసీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పేందుకు మాత్రం ముందుకు రావడం లేదు.
అంబేద్కర్ ఆలోచనకు భిన్నంగా పాలన చేస్తున్న కేసీఆర్ ఫ్రభుత్వాన్ని గద్దె దించేందుకు బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టారు.ఈ యాత్రను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రజలందరినీ కోరుతున్నా.

జి.వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ…
అంబేద్కర్ ను ఎంతగా అవమానించినా తట్టుకుని ఉన్నత చదవులు చదివి రాజ్యాంగం రచించి దేశ భవితకు బాటలు వేసిన మహనీయుడు.దళితులకు సమాన హక్కులు కల్పించాలని కోరిన మహనీయుడు అంబేద్కర్.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను స్థాపించింది, ఈ దేశంలో కనీస వేతనాల చట్టాన్ని తెచ్చింది అంబేద్కర్.

కేసీఆర్ రాజ్యాంగం ద్వారా ఏర్పడ్డ తెలంగాణకు సీఎం అయ్యారు. దళితుడిని సీఎం చేస్తానని మాట తప్పారు.దళితులకు మూడెకరాలిస్తానని మాట తప్పారు. అంబేద్కర్ జయంతి రోజు వచ్చినప్పుడే ఆయన పేరు తీసుకొస్తారే తప్ప ఏనాడూ అంబేద్కర్ ఆలోచనలను అమలు చేయని దళిత ద్రోహి కేసీఆర్.

దళిత బంధు పథకం హుజూరాబాద్ ఎన్నికల కోసం తెచ్చిన పథకం మాత్రమే.దళితుడిని రాష్ట్రపతి చేసిన ఘనత బీజేపీదే…బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర… టీఆర్ఎస్ కు గట్టి హెచ్చరిక. కల్వకుంట్ల కుటుంబ, అవినీతి పాలనకు చరమ గీతం పాడబోతోంది. బండి సంజయ్ పాదయాత్రను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రజలను కోరుతున్నా…

Leave a Reply