– మంత్రి దామోదర్ రాజనర్సింహ
సంగారెడ్డి : అందోల్ లోని జోగినాథ్ గంజిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రులు దామోదర్ రాజనర్సింహ స్థానిక పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్ గారితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ… మహిళా సంఘాల ద్వారా వరి ధాన్యం కొనుగోలు సెంటర్లు నడుపుతున్నాం. రాబోయే కాలంలో ప్రతి కుటుంబానికి , ప్రతి వ్యక్తికి సన్న బియ్యం అందజేస్తాం. ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయానికి ప్రోత్సాహం అందిస్తుంది.
వరి చివరి గింజ వరకు కొంటాం. సన్నలకు 500 బోనస్ ఇచ్చిన ప్రభుత్వం మనదే. ఉచితంగా రేషన్ కార్డు లబ్ధిదారులకు 6కిలోల సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాము.