గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ జెండాను ఎగురవేస్తాం

Spread the love

– ఆ విజయాన్ని చంద్రబాబుకు బహుమతిగా అందిస్తాం
– రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం
– టీడీపీ సీనియర్ నేత, ఎన్నారై వెనిగండ్ల రాము

గుడివాడ, మార్చి 27: 2024 ఎన్నికల్లో కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ జెండాను ఎగురవేస్తామని, ఆ విజయాన్ని చంద్రబాబుకు బహుమతిగా అందిస్తామని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎన్నారై వెనిగండ్ల రాము చెప్పారు. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా గుడివాడ పట్టణంలోని గుడ్ మెన్ పేటలో విస్తృతంగా పర్యటించిన వెనిగండ్ల రాము మీడియాతో మాట్లాడారు. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమానికి అన్నివర్గాల ప్రజల నుండి అనూహ్య స్పందన వస్తోందన్నారు.

ప్రజలు వేలాదిగా తరలివచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారని చెప్పారు. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కన్పిస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అని, దీన్ని ఎవరూ అపరలేరన్నారు. అన్నివర్గాల ప్రజలు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారని చెప్పారు. ఎన్నికల కోసం గుడివాడ నియోజకవర్గ ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. సంఘ విద్రోహ శక్తులు, నమ్మక ద్రోహులకు గుడివాడ ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్పనున్నారని తెలిపారు. చంద్రబాబు పిలుపు మేరకు జీవోనెం. 1, ఎమ్మెల్యే దోలా బాలవీరాంజనేయ స్వామిపై జరిగిన దాడిపై ప్రజల్లోకి వెళ్తున్నామన్నారు. జీవోనెం.1 ను రద్దు చేయాలని అడిగిన టీడీపీ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ సాక్షిగా దాడికి పాల్పడ్డారన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా అసెంబ్లీలో ఎన్నడూ ఇటువంటి ఘటనలు చోటు చేసుకోలేదన్నారు. ప్రజల కోసం ఎన్నో అవమానాలను చంద్రబాబు భరిస్తూ వస్తున్నారని గుర్తుచేశారు.

రాష్ట్రాన్ని కాపాడుకోవడం తెలుగుదేశం పార్టీ బాధ్యత అని చంద్రబాబు పదేపదే చెబుతూ వస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ప్రజలు స్పందించారని తెలిపారు. 2024 ఎన్నికల్లో టీడీపీని గద్దెనెక్కించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రజలంతా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలవాలని వెనిగండ్ల రాము పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తులసి, గుత్తా చంటి, అంగలూరు చిట్టిబాబు, రాధాకృష్ణ, ఏసుపాదం, జాన్స్ దయానంద్, కంచనపల్లి సుబ్రహ్మణ్యం, సిరిపురపు తులసీరాణి, వేమూరి సుజాత, గూడూరు సురేంద్ర, సాగర్, భాను, పాపారావు, వేశపోగు బ్రదర్స్, ఐజాక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply