119 నియోజక వర్గంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం

– స్వాతంత్య్ర ఉద్యమంలో బీజేపీ పాత్ర లేదు
– తెలంగాణ కు స్వాతంత్య్రం వచ్చింది అంటే నెహ్రూ,పటేల్ వల్లనే
– టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్

తెలంగాణ కి 1948 సెప్టెంబర్ 17 న స్వాతంత్య్రం వచ్చిన రోజు.తెలంగాణ స్వాతంత్య్ర వజ్రోత్సవలు సంవత్సరం పాటు జరపాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.మేమే సాధించుకున్నాం అని చెప్పుకుంటున్న బీజేపీ,తెరాసా కు ఆ చరిత్ర లేదు.స్వాతంత్య్ర ఉద్యమంలో బీజేపీ పాత్ర లేదు.

తెలంగాణ కు స్వాతంత్య్రం వచ్చింది అంటే నెహ్రూ,పటేల్ వల్లనే.కాంగ్రెస్ నుంచి పటేల్ పాత్ర దూరం చేసే ప్రయత్నం జరుగుతోంది.రేపు గాంధీ భవన్ లో జాతీయ పథకాన్ని ఎగురవేసి అందే శ్రీ రాసిన జయజయహే గీతం పాడి నిర్వహిస్తాం.బండ్ల రిజిస్ట్రేషన్ లో TG గా అధికారం లోకి రాగానే తీసుకువస్తాం. తెలంగాణ తల్లి విగ్రహ రూపు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాన్ని రేపు విడుదల చేస్తాం. 119 నియోజక వర్గంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం.. తెలంగాణ జెండా రూపకల్పనలో అన్ని వర్గాల మేధావుల నుంచి అభిప్రాయం సేకరిస్తాం. తెలంగాణ ఏ ఆశయాల కోసం తెచ్చుకున్నమొ అవన్నీ సాధించుకుంటాం.

సెక్రటేరియట్ కు అంబేద్కర్ పేరు పెట్టడం సంతోషకరం.125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తాం అని చెప్పి 6 ఏళ్లు గడుస్తున్నాయి.దళితుడిని సీఎం చేస్తా అని చెయ్యలేదు ప్రాణహిత చేవెళ్ల కు అంబేద్కర్ పేరు తొలగించారు.అంబేద్కర్ ఆశయాల కోసం పని చేసే విధంగా కాంగ్రెస్ కృషి చేస్తుంది.

Leave a Reply