జగన్ కు రోశయ్య భౌతికకాయాన్ని సందర్శించే తీరిక లేదా?

– ఆర్యవైశ్యులను చిన్నచూపు చూస్తున్న జగన్‌కి మా సత్తా ఏంటో చూపిస్తాం
– డూండి రాకేష్
ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య చనిపోతే కనీసం ఆయన పార్ఠివదేహాన్ని సందర్శించకుండా ముఖ్యమంత్రి జగన్ ఆర్య వైశ్యుల మనోభాలు దెబ్బతీశారని టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డూండి రాకేష్ అన్నారు. టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. రోశయ్య మరణించారని తెలిసి రెండు తెలుగు రాష్ట్రాల వారే కాకుండా దేశంలోని పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు రోశయ్య భౌతిక కాయాన్ని సందర్శించారని కానీ రాష్ట్ర ముఖ్యమంత్రికి రోశయ్య భౌతికకాయాన్ని సందర్శించే సమయం లేదా? అని ప్రశ్నించారు.
రోశయ్య ఆర్య వైశ్య సామాజికవర్గానికి చెందిన వారన్న కారణంతోనే జగన్ వెళ్లలేదని, అదే ఆయన సామాజికవర్గానికి చెందిన వ్యక్తి చనిపోతే వెళ్లేవారని అన్నారు. చంద్రబాబు నాయుుడు కి ఎన్ని కార్యక్రమాలున్నా..వాటిని పక్కన పెట్టి హైదారాబాద్ వెళ్లి రోశయ్య భౌతిక కాయాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కానీ వైయస్ కు 3 దశాబ్దాల పాటు సన్నిహితునిగా ఉన్న రోశయ్య చనిపోతే జగన్ వెళ్లకపోవటం బాధాకరం. కనీసం జగన్ తాడేపల్లిలో రోశయ్య చిత్రపటానికి పూలదండ వేసి నివాళి అర్పించలేదని ఉన్నారు. రాజకీయాల్లో నైతిక విలువలు నాశనం చేసిన వ్యక్తి జగన్ .
వైయస్ చనిపోయినపుడు జగన్ కు ముఖ్యమంత్రి పదవి రాకుండా రోశయ్య అడ్డుకున్నారనే కారణంతో రోశయ్యపై ఆయన కక్ష్యసాధిస్తున్నారు. జగన్ నాడు రోశయ్యపై మీడియాలో తప్పుడు కధనాలు ప్రచారం చేయింటచమే కాకుండా వేరే ప్రాంతాలనుంచి మనుషుల్ని తీసుకువచ్చి గొడవలు సృష్టించారు.

ఆర్వవైశ్యులను జగన్ అవమానిస్తుంటే మంత్రి ఎందుకు స్పందించటం లేదు? ఆర్వ వైశ్యులు జగన్ కి పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేయాలన్నది ఇందుకేనా? ఎప్పటి నుంచో ఆర్యవైశ్యుల ఆద్వర్యంలో నడుస్తున్న పలు సత్రాలు, గుళ్లకు పేక్ జీవో ఇచ్చి ప్రభుత్వం ఏదో కొత్తగా చేస్తుంటే వాటిని మీరే నడుపుకోండి అనటం విడ్డూరంగా ఉంది?
జగన్ ప్రతిపక్షంలో ఉన్నపుడు ఆర్యవైశ్య కార్పోరేషన్ రూ. 1000 కోట్లు కేటాయిస్తాన్న హామీ అమలు చేయకపోగా టీడీపీ హయాంలో ఇచ్చిన రూ. 30 కోట్లు ఇప్పుడు జీతాలకు వాడుకోవటం నిజం కాదా? దీనిపై వైసీపీ నేతలు గానీ, మంత్రి గానీ బహిరంగ చర్చకు రాగలరా? పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగంతో నవంబర్ 1 న రాష్ట్రం ఏర్పడితే ఆరోజును కూడా జగన్ తన తండ్రి వైయస్ పేరుతో అవార్డులు ఇవ్వటం ఏంటి? జగన్ చేస్తున్న మోసాన్ని ఇప్పటికైనా ఆర్యవైశ్యులు అర్ధం చేసుకోవాలి.
రోశయ్య చనిపోయి 3 రోజులైనా కనీసం తాడేపల్లిలో కూడా చిత్రపటానికి నివాళి అర్పించలేదంటే దీన్ని ప్రతి ఒక్క ఆర్య వైశ్యులు గమనించాలి. కేసీఆర్ తో మాట్లాడి హైదాబాద్ లోని ఎన్టీఆర్ మార్గ్ లో ఎకరాం స్థలం ఇప్పిస్తే మా సొంత నిధులతో రోశయ్య దహన సంస్కారాలు నిర్వహించుకుంటామని వైశ్య సంఘాలు ప్రతినిధులు మంత్రి వెల్లంపల్లిని అడిగితే కనీసం స్పందించలేదు. తన సామాజికవర్గానికి ఏదైనా జరిగితే క్షణాల్లో వాలిపోయే ముఖ్యమంత్రి ఆర్వవైశ్యుల విషయంలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తు సజ్జల ద్వారా ఎవరో తన బంట్రోతులను పంపిస్తారు.
ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి, గవర్నర్లతో మాట్లాడి దహన సంస్కారాలకు తానే దగ్గరుండి ఏర్పాట్లు చూసేవారని అన్నారు. రోశయ్య పేరు చెప్పుకుని మంత్రి పదవి పోందిన వెల్లంపల్లి శ్రీనివాస్ కు, ఆర్యవైశ్యులన్ని అడుగడునా అవమానిస్తున్న జగన్ కి బుద్ది చెప్పేందుకు ఆర్యవైశ్యులంతా సిద్దంగా ఉన్నారని డూండి రాకేష్ అన్నారు.

Leave a Reply