Suryaa.co.in

Andhra Pradesh

ఆదివాసీల సంప్రదాయాలను కాపాడేందుకు కృషి చేస్తాం

రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్య శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు 

ఆదివాసీల సంస్కృతికి నిదర్శనమైన “ఆదివాసీల భాష’ను సంరక్షించి సవర భాషకు లిపిని నిక్షిప్తం చేసిన గిడుగు రామ్మూర్తి పంతులు స్ఫూర్తితో ఆదివాసీల సంప్రదాయాలను కాపాడేందుకు కృషి చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరి పుత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచ సంస్కృతి, సమిష్టి జీవన విధానానికి ప్రాథమిక సాక్ష్యం ఆదివాసీలు.. పరస్పర సహకారం, నిష్కల్మష జీవితాలకు నిలువుటద్దం గిరి పుత్రులు అని కొనియాడారు.

సహజ వాతావరణంలో స్వచ్ఛమైన జీవన విధానంలో జీవనం సాగిస్తున్న గిరిపుత్రుల సమగ్ర అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు ఎన్డీయే ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని పేర్కొన్నారు.

LEAVE A RESPONSE