– కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ
నర్సాపురం: తెలుగుదేశంపార్టీలో క్రమశిక్ష కలిగిన నాయకుడు పెరబత్తుల రాజశేఖరంను ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా ప్రకటించిననాటి నుండి ఎన్డీఏ కూటమిపక్షాల నాయకులు వారి గెలుపుకోసం విశేషకృషి చేశారని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు.
పశ్చిమగోదావరి జిల్లా టిడిపి కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పెరాభత్తుల రాజశేఖరం సామాన్య కార్యకర్తగా టిడిపిపార్టీకి అంకితభావంతో పనిచేస్తూ నేడు జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కుటమి అభ్యర్థిగా పోట చేసి అత్యధిక మెజార్టీతో గెలవనున్నారని తెలిపారు.
పట్టభద్రులు ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాభత్తుల రాజశేఖరం మాట్లాడుతూ కుటమి అభ్యర్థిగా ఎన్డీఏ ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్లమెంట్ సభ్యురాలు పురందేశ్వరి మద్దతుతో ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీచేసిన నాకు అత్యంత ఆదరణతో ఈరోజు జరిగిన ఎన్నికలలో పూర్తి సహకారం అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
పశ్చిమగోదావరి జిల్లా టిడిపి అధ్యక్షుడు ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు మాట్లాడుతూ గత నాలుగు నెలలుగా ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థి పేరాభత్తుల రాజశేఖరం విజయానికి కృషి చేసిన ఎన్డీఏ కూటమి నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతూ అభ్యర్థి పెరభత్తుల రాజశేఖరంకి ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు.ఈసమావేశంలో జిల్లా బిజెపి అధ్యక్షురాలు శ్రీదేవి ఉండి నియోజవర్గ పరిశీలకుడు నాగేంద్ర తదితర నాయకులు పాల్గొన్నారు.