జగన్ ప్రభుత్వంలో సంక్షేమం అంతా ప్రకటనలు,హోర్డింగ్ లకే పరిమితమైంది

Spread the love

సంక్షేమం పేరుతో జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు రూ.500 కోట్ల పైచిలుకు సొమ్ముని ప్రచార ఆర్భాటానికి తగలేశాడు
– జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సంక్షేమం అంతా ప్రకటనలు, హోర్డింగ్ లకే పరిమితమైంది.
– సాక్షి మీడియా కోసం ఈ ముఖ్యమంత్రి ఇప్పటివరకు రూ.200కోట్లకు పైగా ప్రభుత్వసొమ్ముని దోచిపెట్టాడు.
– ముఖ్యమంత్రి చెబుతున్న సంక్షేమం, లబ్ధిదారుల వివరాలపై పూర్తివాస్తవాలతో శ్వేతపత్రం విడుదలచేయగల గట్స్ ఆయనకు ఉన్నాయా?
– మాజీఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు

వైసీపీప్రభుత్వ ప్రకటనలు, ప్రభుత్వప్రకటనలా…లేక పార్టీ ప్రకటనలా అన్న సందేహం ప్రతి ఒక్కరికీ కలుగుతోందని, ప్రభుత్వంచేస్తున్న కార్యక్రమాలకు సంబంధించి ప్రకటనలు ఇవ్వా ల్సినవారు, పార్టీ కార్యక్రమాలునిర్వహిస్తున్నట్లుగా పత్రికాప్రకటనలు ఇస్తున్నారని, పార్టీ ప్రచారానికి ప్రభుత్వనిధులను వినియోగిస్తున్నారని, టీడీపీ సీనియర్ నేత, మాజీఎమ్మెల్సీ బత్యాలచెంగల్రాయుడు తెలిపారు. మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

జగన్మోహన్ రెడ్డి అమలుచేస్తున్న సంక్షేమం అంతా పత్రికల్లోప్రకటనలు, హోర్డింగ్ లకే పరిమితమవుతోంది. 2019 మే నుంచి 2020 జనవరివరకు 20నెలలకాలంలో ప్రభుత్వంద్వారా ప్రకటనలకోసం రూ.323కోట్లువెచ్చిస్తే, వాటిలో రూ.130కోట్లను సాక్షి మీడియాకే ఇచ్చారు. సమాచారహక్కు చట్టం కింద తాముఅడిగినసమాచారానికి ప్రభుత్వం ఇచ్చిన సమాధానంలోనే ఈ వివరాలు ఉన్నాయి.
కేవలం 20నెలల్లోనే రూ.323కోట్లు ప్రకటనలకు తగలేసిన జగన్మోహన్ రెడ్డి సర్కారు, 2020 జనవరి నుంచి

ఇప్పటివరకు మరో రూ.180కోట్లవరకు అదేవిధంగా వృథాచేసింది. ఆ మొత్తంలోకూడా దాదాపు రూ.75కోట్లవరకు సాక్షి పత్రికకు, సాక్షిఛానల్ కే తగలేశారు. ఈ విధంగా ప్రభుత్వసొమ్ముతో సంక్షేమప్రచారం పేరుతో జగన్మోహన్ రెడ్డి తనసొంతమీడియా ను పెంచిపోషిస్తున్నారు. 12పథకాల కింద లబ్ధికలగని వారికోసం నేడు మరో రూ.703కోట్ల ను ప్రజలఖాతాల్లో వేసేలా నేడు ముఖ్యమంత్రి మీటనొక్కాడని డబ్బాలు కొట్టుకుంటున్నారు.

12 పథకాల్లో 12వపథకమైన ఇళ్లనిర్మాణపథకంలో ఎన్నిఇళ్లను ఈముఖ్యమంత్రి పేదలకో సం నిర్మించాడో సమాధానంచెప్పాలి. పేదలకోసం ఈ ప్రభుత్వం ఒక్కఇల్లుకూడా కట్టలేదని ప్రభుత్వంఇచ్చిన సమాచారహక్కుచట్టం సమాచారంలోనేఉంది. రాష్ట్రంలో పేదలకోసం ఒక్క ఇల్లుకూడా కట్టని జగన్మోహన్ రెడ్డి, కొత్తగా ఓటీఎస్ పేరుతో ఎప్పుడో కట్టినఇళ్లకు ఇప్పుడు డబ్బులుకట్టమంటూ ప్రజలను వేధిస్తున్నాడు. టీడీపీప్రభుత్వంలో అమలైన పథకాల్లో 47 పథకాలకు ఈ ముఖ్యమంత్రి పూర్తిగా మంగళంపాడేశాడు.
చంద్రబాబునాయుడు అమలుచేసిన 47పథకాలను రద్దుచేశానని చెప్పగల గట్స్ ఈ ముఖ్యమంత్రికి ఉన్నాయా?

రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక, సంక్రాంతి కానుకసహా, దుల్హన్ , పెండ్లికానుక, ఎస్సీఎస్టీలకు సబ్ ప్లాన్ నిధులు, వారికి వాహనాల పంపిణీ వంటి అనేక పథ కాలను జగన్మోహన్ రెడ్డి పూర్తిగా పక్కనపెట్టేశాడు. టీడీపీప్రభుత్వం ఎస్సీ,ఎస్టీ యువతను వాహనాలకు యజమానులను చేసి, వారికి ఇన్నోవాకార్లు, ఆటోలు, జేసీబీలు, టిప్పర్ల వంటి వాటిని అందిస్తే, ఈముఖ్యమంత్రి వాహనమిత్ర పేరుతో అరకొరగా ఏదోకొద్దిమందికి రూ.10వే లు ఇచ్చి, తానేదో వాహనదారులను ఉద్ధరిస్తున్నట్లు ప్రచారంచేసుకుంటున్నాడు.

ముఖ్య మంత్రి ఇస్తున్నది రూ.10వేలయితే, ఆర్టీఐ అధికారులు, పోలీసుల వాహదారులు, డ్రైవర్ల నుంచి వసూలుచేస్తున్నది అంతకు మూడింతలు ఎక్కువగా ఉంది. సంక్షేమపథకాలు, సంక్షే మఫలాలు ఏప్రభుత్వంలోఎస్సీ, ఎస్టీలకు ఎక్కువగా అందాయో శ్వేతపత్రం విడుదలచేయగ ల ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ఉందా అని ప్రశ్నిస్తున్నాం. బీసీల స్వయం ఉపాధికి టీడీపీ హాయాంలో అనేకసంక్షేమపథకాలు అమలుచేస్తే, నవరత్నాల పేరుచెప్పి, వాటన్నింటినీ జగన్మోహన్ రెడ్డి పక్కనపెట్టేశాడు.

ముస్లిం మైనారిటీలకు జగన్మోహన్ రెడ్డిచేస్తున్న అన్యా యం మాటల్లో వర్ణించలేనిది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బడ్జెట్లో ఉన్నలెక్కలకు చేసిన అప్పులకు ఎక్కడా పొంతనే ఉండటంలేదు. రెండున్నరేళ్లకే రూ.3లక్షల50వేలకోట్ల అప్పులు తెచ్చిన జగన్మోహన్ రెడ్డి, మరోరెండున్నరేళ్లలో ఆ మొత్తాన్ని రూ.6లక్షలకోట్లకుచేర్చడం ఖాయం. 6లక్షలకోట్లకు ఏటా కట్టేవడ్డీనే రూ.లక్షకోట్లవరకు ఉంది. రాష్ట్రబడ్జెట్ మొత్తం రూ.లక్షా50వేలకోట్లు అయితే, దానిలో లక్షకోట్లు అప్పులతాలూకా వడ్డీకిందే చెల్లిస్తే, మిగిలి న రూ.50వేలకోట్లతో ప్రజలను ఉద్ధరిస్తున్నామని ఈముఖ్యమంత్రి చెప్పడం వారిని నిలువు నా మోసగించడమే.

రూ.50వేలకోట్లలోనే ఈ ప్రభుత్వం అన్నివర్గాలకు సంక్షేమం, ఉద్యోగు లకు జీతాలు ఇస్తుందా? అభివృద్ధి అంటే టీడీపీహాయాంలో చంద్రబాబునాయుడు చేసింది. జాతీయరహదారులు సహా, అనేకగ్రామాలకు రోడ్డురవాణా సౌకర్యం కల్పించడంవల్ల, మారు మూల గ్రామాల్లోని భూములధరలు పెరిగాయి. దానివల్ల రాష్ట్రానికి వచ్చే పన్నులరాబడి, ఇతరత్రా ఆదాయం పెరిగింది.

కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో ఎక్కడై నా ఒక్క అంగుళం రోడ్డువేసిందిలేదు. ఆఖరికి చిన్నాచితకపరిశ్రమలుకూడా కుదేలయ్యేలా పన్నులు, ఛార్జీల రూపంలో వాటిని పట్టిపీడిస్తున్నారు. నేడుపత్రికల్లో ఇచ్చిన ప్రకటనల్లో 9లక్షలమంది లబ్ధిదారులకు రూ.703కోట్లు ఇస్తున్నట్లు పెద్దపెద్దప్రకటనలు ఇచ్చారు.

గతంలో టీడీపీహాయాంలో55లక్షలమందికి సామాజిక పింఛన్లు ఇవ్వడంజరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఏటేటా సామాజిక పింఛన్ల సంఖ్యలోకోతపడుతోంది. పింఛన్లు తీసుకునేవారిలో పదిశాతంవరకు ఏటాచనిపోతున్నా, కొత్తవారికి పింఛన్లు అందడంలేదు.

వాలంటీర్లకు జగన్ ప్రభుత్వం ప్రభుత్వఖజానానుంచి జీతాలుఇస్తోంది. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టిన జన్మభూమి కమిటీలకు టీడీపీహయాంలో రూపాయి లబ్ధికలగలేదు. ప్రభుత్వంనుంచి రూపాయి వారికి అందలేదు. సదరుకమిటీల్లో ఎక్కడో ఒకరిద్దరు తప్పుచేశారని, దాన్ని భూతద్దంలోచూపించి, ప్రజలకు మేలుచేసిన జన్మభూమి కమిటీ వ్వవస్థనే తప్పుపట్టారు. మరిప్పుడు జగన్ తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ ఎంతలా ప్రజలను బాధిస్తోందో, వేధిస్తోందో పాలకులకు కనిపించడంలేదా? 5ఎకరాల పొలముందని, కారుఉందని, ఉద్యోగముందని పింఛన్లు, రేషన్ కార్డులు తొలగిస్తున్నారు. మాగ్రామంలో ఒక రజకకుటుంబం రేషన్ కార్డు తొలగించారు.

రజకులు గ్రామాల్లోచేసే ఉద్యోగం ఏమిటో ఈ ప్రభుత్వానికి తెలియదా? వాలంటీర్ వ్వవస్థను అడ్డుపెట్టుకొని ప్రభుత్వంచేస్తున్న దుర్మార్గాల తో ప్రజలంతా లబోదిబోమంటున్నారు. జగన్ఇచ్చిన సెంటుస్థలాలకు సంబంధించిన భూముల్లో పాతే రాళ్లకోసమే ఈప్రభుత్వం వందలకోట్ల ప్రజలసొమ్ముని దుర్వినియోగం చేసిం ది. వృథాఖర్చులతో ప్రభుత్వఖజానా కొల్లగొడుతున్న జగన్మోహన్ రెడ్డికి నిజంగా గట్స్ ఉంటే, గతప్రభుత్వంలో అమలైన సంక్షేమపథకాలు ఎన్ని, వాటితో లబ్ధిపొందినవారు ఎందరు… అలానే ఈప్రభుత్వంలో ఇప్పటివరకు అమలైన సంక్షేమపథకాలుఎన్ని..ఎందరు లబ్ధిపొందారనే వివరాలతో శ్వేతపత్రం విడుదలచేయాలి. లేదా పూర్తివివరాలతో బహిరంగ చర్చ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాం.

అదేవిధంగా చంద్రబాబునాయుడు దిగిపోయే నాటికి రాష్ట్ర రెవెన్యూలోటు ఎంత.. ఇప్పుడు ఎంతఉందో స్పష్టంచేయాలి. పత్రికా ప్రకటనలు, సాక్షిమీడియాకు దోచిపెట్టినసొమ్ముతో రాష్ట్రంలో రెండు, మూడుప్రాజెక్టులుపూర్తిచేయవచ్చు. ప్రభుత్వం అనేది శాశ్వతం, ముఖ్యమంత్రులు వస్తూఉంటారు..పోతూ ఉంటారు. కానీ జగన్మో హన్ రెడ్డి రెండింటినీ కలిపేసి, ప్రజల్ని మోసగిస్తున్నాడు. తనచర్యలతో ఇప్పటికే 150సార్లకు పైగా ముఖ్మమంత్రి కోర్టులచేతిలో మొట్టికాయలు తిన్నాడు. మరిన్ని మొట్టికాయలు పడక ముందే, తన అసంబద్ధనిర్ణయాలకు జగన్మోహన్ రెడ్డి స్వస్తిపలికితే మంచిది.

Leave a Reply