జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సంక్షేమం ప్రకటనలకే పరిమితం

Spread the love

– ముఖ్యమంత్రి సంక్షేమజపం రైతులు, యువత, మహిళలు, ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు మోసాన్ని, వెతలనే మిగిల్చింది.
– మాజీ మంత్రి పరసా వెంకటరత్నం

సంక్షేమజపం చేస్తున్న వైసీపీ ప్రభుత్వం, ఆ ముసుగులో పచ్చి అబద్ధాలుచెబుతూ, ప్రజలను మోసగిస్తోందని, అమ్మఒడి కింద తల్లులకు ఏటారూ.14వేలు ఇస్తున్నట్లు చెబుతున్నవారే, నాన్నబుడ్డి రూపంలో ప్రతి కుటుంబం నుంచి ఏటా రూ.50వేలకు పైగా గుంజుకుంటున్నారని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి పరసా వెంకటరత్నం స్పష్టంచేశారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

అమ్మఒడి పథకంలానే రైతుభరోసా పథకంలోనూ జగన్మోహన్ రెడ్డి అన్నదాతలను నిలువునా మోసగిస్తున్నాడు. రైతులకు ఏటా రూ.13,500లు ఇస్తామని చెప్పిన జగన్మోహ న్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేరూ.6వేలతో కలిపేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇస్తున్నది కేవలం రూ.7,500లు మాత్రమే. పచ్చి దగా చేస్తూ రైతుఉద్ధారకుడినని ప్రచారం చేసుకుంటున్నాడు. దానికి తోడు పంటలబీమా సొమ్ముగానీ, ఇన్ పుట్ సబ్సిడీ నిధులుగానీ రైతులకు అందకుండా చేస్తున్నాడు.

వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రైతులకు కేవలం రూ.37,500 మాత్రమే ఇస్తోంది. టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబునాయుడు గారు రుణమాఫీ కింద ప్రతిరైతుకి రూ.లక్షా5వేల వరకు అందించారు. రూ.లక్షా5వేలకు తోడు డ్రిప్ పరికరాలు, ఇతర యంత్ర పరికరాలు, రైతురథం ట్రాక్టర్లను సబ్సిడీపై

అన్నదాతలకు అందించడం జరిగింది. చివరికి రైతులకు సరైన మద్దతుధరలు కూడా కల్పించకుండా.. దేశంలోనే రైతు ఆత్మహత్యల్లో రాష్టాన్నిరెండోస్థానానికి చేర్చింది ఈ ముఖ్యమంత్రి కాదా?

యువతను, విద్యార్థులను కూడా నిట్టనిలువునా వంచిస్తున్నాడు. స్కాలర్ షిప్ లు, ఫీజు రీయింబర్స్ మెంట్లో కూడా జగన్ ప్రభుత్వం కోత పెట్టింది. టీడీపీ ప్రభుత్వ హాయాంలో 16 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లిస్తే, జగన్మోహన్ రెడ్డి ఆ సంఖ్యను 11లక్షలకే పరిమితంచేశాడు. ప్రైవేటు కాలేజీల్లో చదివే పీజీ విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్ మెంట్ దూరం చేస్తూ జీవో నెం.77 ఇచ్చారు. ఫీజు రీయింబర్స్ మెంట్ సొమ్మును కూడా ఓటుబ్యాంకు కోసం తల్లులఖాతాల్లోవేస్తూ.. పిల్లలచదువుల్ని ఓట్లతో ముడిపెట్టి అమ్ముకున్నారు.

మరోవైపు అమ్మఒడి వస్తే, ఫీజు రీయింబర్స్ మెంట్ రాదంటూ మెలికపెట్టి, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాడు. టీడీపీ ప్రభుత్వంలో రెండు సార్లు డీఎస్సీ నిర్వహించి 17వేలఉద్యోగాలు ఇస్తే, ఈ ముఖ్యమంత్రి వచ్చాక ఉన్న ఉద్యోగాలు పీకేస్తున్నాడు. రెండున్నరేళ్ల తన పాలనలో రెండు ప్రభుత్వఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీని జగన్మోహన్ రెడ్డి పూర్తిగా అటకెక్కించాడు.
డ్వాక్రా మహిళలను జగన్మోహన్ రెడ్డి దారుణంగా వంచిస్తున్నాడు. డ్వాక్రామహిళలు రూపాయిరూపాయి దాచుకున్న పొదుపునిధి సొమ్ము రూ.8,700 కోట్లను ప్రభుత్వ బ్యాంకుల నుండి సహకార బ్యాంకుల్లోకి మళ్లించాడు. రూ.2,100కోట్ల అభయ హస్తం సొమ్మును ఎల్ఐసీ నుండి ప్రభుత్వానికి బదలాయించుకున్నాడు. టీడీపీప్రభుత్వంలో చంద్రబాబునాయుడు గారు ప్రతి డ్వాక్రా మహిళకు డ్వాక్రా రుణమాఫీ, వడ్డీరాయితీ, పసుపు-కుంకుమ కింద రూ.20వేల వరకు అందించారు. కానీ నేడు.. ఆసరా పేరుతో డ్వాక్రా మహిళలకు జగన్ రెడ్డి టోకరా వేస్తున్నాడు.

పేదలు, రైతులు, యువతను, మహిళలను మోసగించిన జగన్మోహన్ రెడ్డి, ఆఖరికి ఉద్యోగులకు కూడా పంగనామాలు పెట్టడానికి సిద్ధమయ్యాడు. పీఆర్సీలు, డీఏల చెల్లింపు ఊసెత్తకుండా ఉద్యోగులను వంచిస్తున్నాడు. ఉద్యోగసంఘ నేతలుగా తనవాళ్లను నియమిం చి ఉద్యోగుల్లో చీలికలు తీసుకొచ్చి తన పంతం నెగ్గించుకోవడానికి ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగులు అడిగిందే తడవుగా నాడు చంద్రబాబు నాయుడు ఆర్థికలోటునికూడా లెక్కచేయకుండా 43శాతం ఫిట్ మెంట్ ఇచ్చారు. ఈ ముఖ్యమంత్రి తలకిందులుగా తపస్సుచేసినా.. ఆ స్థాయిలో ఫిట్ మెంట్ ఇవ్వగలడా.? ఇచ్చేంత దమ్ము, ధైర్యం ముఖ్యమంత్రికి ఉన్నాయా? ఉద్యోగులకు సకాలంలో జీతాలురావాలన్నా, డీఏలు, పీఆర్సీలు,ఇతర ఎరియర్స్ క్లియర్ కావాలన్నా, ప్రభుత్వ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం జరగాలన్నా మళ్లీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాల్సిందే.

ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, బీసీలను ఉద్ధరిస్తాననిచెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు వారికి పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏర్పాటుచేసిన కార్పొరేషన్లు అనామకంగా తయారైతే, వాటి ఛైర్మన్లు ఉత్సవవిగ్రహాలుగా మిగిలిపోయి ఈసురోమని విలపిస్తున్నారు. ఎస్సీ కార్పొరేషన్ కు, బీసీ కార్పొరేషన్, మైనారిటీలకు ఈ ముఖ్యమంత్రి బడ్జెట్ లో ఎన్నినిధులు కేటాయించారో, ఎంత ఖర్చు చేశారో, ఆయావర్గాల్లో ఎందరికి లబ్ధిచేకూర్చారో సమాధానంచెప్పాలని డిమాండ్ చేస్తున్నాము.

బీసీ సబ్ ప్లాన్ నుండి రూ.18,226 కోట్లు, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నుండి రూ.4వేల కోట్లు, మైనార్టీల సంక్షేమానికి వినియోగించాల్సిన సొమ్ము నుండి రూ.3వేల కోట్లను దారిమళ్లించిన ముఖ్యమంత్రి, ఆయావర్గాలకు తీరని ద్రోహంచేశాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లో ఎందరు యువకులకు ఎంతటిలబ్ధి చేకూరిందో సదరు వర్గాల్లోని యువత ఆలోచనచేయాలి. ఎస్సీ యువతకు స్వయంఉపాధి కల్పించడం కోసం టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబునాయుడు గారు రూ.25 లక్షల విలువచేసే ఇన్నోవా కార్లనుఅందించారు.

వాటితో పాటు జేసీబీలు, సరుకురవాణా వాహనాలు, ఇతరత్రా వాహనాలను అందించి డ్రైవర్లు, క్లీనర్లుగా ఉన్న ఎస్సీ యువతను యజమానులను చేశారు. ఆదరణ పథకంకింద బీసీయువతకు వేలాదిరూపాయల విలువచేసే పరికరాలు అందించారు. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఎందరు బీసీ, ఎస్సీ యువతకు ఎలాంటి ఉపాధి కల్పించారో బహిర్గతం చేయగలరా అని ప్రశ్నిస్తున్నాం. ముఖ్యమంత్రి ఏర్పాటుచేసిన కార్పొరేషన్లు ఎందుకు కొరగాకుండాపోతే, వాటికిఛైర్మన్లుగా ఉన్నవారు ఎందుకు తాము ఈ పదవుల్లోఉన్నామా అని వాపోతున్న పరిస్థితి.

రెండున్నరేళ్లలో రూ.3లక్షల60వేలకోట్ల అప్పులు చేసిన జగన్మోహన్ రెడ్డి, ఆసొమ్మంతా తన అవినీతికి , లూఠీకే వినియోగించుకున్నాడు తప్ప, ప్రజలకు ఒరిగిందేమీ లేదు. తాను చేసిన అప్పుల మూలంగా రాష్ట్రంలోని ప్రతికుటుంబంపై రూ.2.50లక్షలకు పైగా భారం మోపాడు. జగన్మోహన్ రెడ్డి అమలుచేస్తున్న సంక్షేమంమొత్తం పత్రికల్లో, టీవీల్లో ప్రకటనలకే పరిమిత మైంది తప్ప, వాస్తవంలో ఎక్కడా కనిపించడంలేదు. చంద్రబాబునాయుడి హయాంలో రాష్ట్రానికి ఎన్నిపెట్టుబడులు వచ్చాయో, ఎన్ని పరిశ్రమలు ఏర్పాటయ్యాయో, ఎన్ని లక్షల ఉద్యోగాలు వచ్చాయో అంకెలు, ఆధారాలతోసహా చెప్పడానికి మేం సిద్ధంగా ఉన్నాం.

తన పాలనలో ఎన్ని కంపెనీలు ఏపీకివచ్చాయో, ఎంత మందికి ఉద్యోగాలిచ్చారో చెప్పే ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా అనిప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా యువత జగన్మోహన్ రెడ్డి మోసకారీ సంక్షేమం, నయవంచనపాలనపై ఆలోచించాలని కోరుతున్నాం. రాష్ట్రభవిష్యత్ బాగుండా లన్నా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారటీ వర్గాలసంక్షేమం మెరుగ్గా అందాలన్నా మళ్లీ చంద్రబాబు గారే ముఖ్యమంత్రి కావాలి.

Leave a Reply