– కేంద్రంలో రాష్ట్రంలో, ఎన్డీయే100 రోజులు పాలన పూర్తయ్యాయి.
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ.దగ్గుబాటి పురందేశ్వరి
రాజమండ్రి: సంక్షేమానికి , దేశ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని, మౌలిక సదుపాయాలు కోసం 3 లక్ష కోట్ల రూపాయిలు కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.
గురువారం స్థానిక ఎంపీ క్యాంపు కార్యాలయంలో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. సందర్భంగా ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి మీడియాతో మాట్లాడుతూ సంక్షేమానికి , దేశ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని, మౌలిక సదుపాయాలు కోసం 3 లక్ష కోట్ల రూపాయిలు కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగిందన్నారు. 11 వ ఆర్థిక శక్తిగా ఉన్న భారత్ దేశం 5 వ స్థానానికి వచ్చిందని, రాబోయే 5 ఏళ్లలో 3 వ స్థానానికి చేరుకుంటుందన్నారు.
మౌలిక సదుపాయాలు కోసం 3 లక్ష కోట్ల రూపాయిలు కేటాయించారన్నారు. గ్రామ సడక్ యోజన 4 వ దశ లోభాగంగా 25 వేల గ్రామాల అనుసందానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. రు. 50,600 కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణం, 8 కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులు మంజూరు చెయ్యడం జరిగిందన్నారు.
రైతులకి కిసాన్ సమ్మన్ యోజన ద్వారా రు. 6వేలు రూపాయిలు మూడు విడతలుగా కేంద్రం అందిస్తుందని, 17 వ ఇన్స్టాల్మెంట్ రైతులకి అందించడం జరిగిందన్నారు. దీంతో 3 లక్షల కోట్ల రూపాయలతో 12 కోట్ల రైతులకి లబ్ధి చేకూరిందని స్పష్టం చేశారు. సహకార రంగం పునర్జీవించడం చేసే ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. ఉల్లి ఎగుమతి పన్ను శాతం 40 నుండి 20 శాతం తగ్గించడం జరిగిందని, క్రుడ్ పామాయిల్, సోయా నూనె 32 శాతానికి పెంచారన్నారు. హార్టి కల్చర్ కి ప్రత్యేక నిధి ఏర్పాటు చేశారని, టాక్స్ ఎక్సింప్షన్ రు. 7 లక్షలు వరకు పెంచడం వలన, మధ్యతరగతి ప్రజలకు ఎంతో లాభం అన్నారు.
యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కేంద్రం అందుబాటులోకి తీసుకువచ్చిందని, ప్రధానమంత్రి ఆవాస్ యోజాన ద్వారా రు.4.70 లక్షల కోట్లు మంజూరు చేశారన్నారు..ఇళ్లపై సోలార్ ప్యానెల్ కి కేంద్రం సహకారం అందిస్తుందని, n35 సంవత్సరాల వారు 60 శాతం భారత్ లో ఉన్నారని పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కోసం ఏ ఏ రంగాల్లో ఏ స్కిల్ కావాలో స్కిల్ ట్రైనింగ్ అందించడం, ఎంప్లాయిమెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 4 కోట్ల యువతకి ట్రైనింగ్ అందించే ప్రక్రియను ప్రారంభించడం జరిగిందన్నారు. అంతర్జాతీయ ఆర్థిక మందవ్యం చూస్తున్నాము, దేశంలో 7 శాతం అభివృద్ది ఉందని, పెట్టుబడిదారులకు భారత్ అనుకూలం అన్నారు.
దేశంలో మహిళలు దాదాపు 50 శాతం ఉన్నారని, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారా మహిళలను చిన్న చిన్న పరిశ్రామికవేత్తలగా తీర్చిదిద్దుతున్నారని, అలాగే డ్రోన్ వాడకం పై అవగాహన కల్పిస్తున్నామని ఎంపీ పేర్కొన్నారు .
రూ.2500 కోట్ల రూపాయలతో కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, గత ప్రభుత్వం నిర్లక్షం చేసింది పోలవరానికి 12, 500 రూపాయిలు మంజూరు, దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి 990 కోట్లు కేంద్రం భరించడానికి సిద్ధం అయ్యిందన్నారు. అమరావతి కి రు. 15 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించిందన్నారు .
మూడు ముక్కలాట లాగా 3 రాజధానులు అంశం గత ప్రభుత్వం తెరపైకి తీసుకువచ్చారని తెలిపారు. స్టీల్ ప్లాంట్ అంశంపై లాభాల్లోకి కచ్చితంగా తీసుకువస్తాము అని కేంద్ర మంత్రి ముఖ్యమంత్రి తెలిపారని స్పష్టం చేశారు.రైల్వే జోన్ మార్చమని చెప్పినప్పుడు గత ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని అన్నారు.
త్వరలోనే రైల్వే జోన్ పట్టలుఎక్కబోతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో రహదారుల నిర్మాణానికి కేంద్రం ప్రభుత్వం సహకారాన్ని అందిస్తుందనలన్నారు. రాజమండ్రి రైల్వేస్టేషన్ ఆధునీకరణకు రు.280 కోట్లు డీపీఆర్ కేంద్రానికి పంపించామని, ఈస్ట్ రైల్వే స్టేషన్ కు పుష్కరాల. నాటికి అభివృద్ధి చేస్తామని తెలిపారు.
రాజమండ్రి టు ఢిల్లీ, అయోధ్య, జైపూర్, కి విమానాలు నడపడానికి కేంద్రమంత్రికి ప్రతిపాదించడం జరిగిందన్నారు. విమానాశ్రయ నూతన టెర్మినల్ త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ తో రాష్ట్రం మరియు దేశంలో అభివృద్ధి సాధిస్తామన్నారు. ఎస్.డి.ఆర్.ఎఫ్ నిధులు గత ప్రభుత్వం పక్కదారి పట్టించిందని, మంచి ప్యాకేజీతో వరద బాధితులను రాష్ట్రం ప్రభుత్వం ఆదుకుందని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు.