దుర్భాషలాడిన మంత్రిపై డీజీపీ ఏం చర్యలు తీసుకుంటారు?

-పోలీస్ అధికారిని దుర్భాషలాడిన మంత్రిపై డీజీపీ ఏం చర్యలు తీసుకుంటారు?
-ముఖ్యమంత్రి పిరికిపంద కాబట్టే, విశాఖపర్యటనలో అంత బందోబస్తు పెట్టుకున్నాడు

– మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి

జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు విశాఖ వచ్చినా ఆయనకు ప్రజలసమస్యలు పట్టవని, ఏదో చుట్టపుచూపుగా వచ్చి వెళుతుంటారని, ఆయనరాక సందర్భంగా పశుసంవర్థక శాఖా మంత్రి అప్పలరాజు, విధినిర్వహణలో ఉన్న పోలీస్ అధికారిని నానా దుర్భాషలాడటంతోపాటు, అతనిచొక్కా పట్టుకొని తోసేస్తే డీజీపీ ఏంచేస్తున్నాడని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి ప్రశ్నించారు.

ఆయన విలేకరులతో మాట్లాడుతూ… ముఖ్యమంత్రి బందోబస్తులో ఉన్న పోలీస్ అధికారిని పట్టుకొని, మంత్రి అప్పలరాజు శివాలుఎత్తితే డీజీపీకి కనిపించడంలేదా అన్నారు. పోలీస్ అధికారిని తిట్టినందుకు ఈ ముఖ్యమంత్రి, మంత్రిని మెచ్చుకున్నా మెచ్చుకొని ఉంటాడని, అలాంటి దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి ఉండ టం ప్రజల దురదృష్టమని వ్యాఖ్యానించారు. విధినిర్వహణలో ఉన్న పోలీస్ అధికారిని ఉద్దేశించి.. తమాషాలు మింగుతున్నావా.. నా కొడకా.. అనడం, అధికారి చొక్కా పట్టుకొని లాగేస్తాననడం, పిచ్చిపిచ్చిగా ఉందా.. ఎవడ్రా వీడు అంటూ హూంకరించడం, డీజీపీ కంటికి కనిపించడంలేదా.. మంత్రి అన్నమాటలు ఆయనకు వినిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నామన్నారు.

డీజీపీకి సాటి పోలీస్ అధికారికి గౌరవమిప్పించాల్సిన బాధ్యత లేదా.. సదరు అధికారిని తిట్టిన మంత్రిపై చర్యలు తీసుకు నే ధైర్యం లేదా అని ప్రశ్నిస్తున్నామన్నారు. అప్పలరాజు మంత్రి అయితే ఆయన కళ్లు నెత్తికి ఎక్కుతాయా.. జరిగిన ఘటనపై పోలీస్ సంఘం ఏంచేస్తోందని నిలదీస్తున్నామన్నారు. మంత్రి దూషణలు పోలీస్ సంఘానికిఎంతటి సిగ్గుచేటో సదరు సంఘం నేతలు ఆలోచించాలన్నారు.

ముఖ్యమంత్రి శారదాపీఠానికి వచ్చి, తాను హిందువునని ప్రచారం చేసుకోవడానికి తాపత్రయపడుతు న్నాడని మాజీమంత్రి ఎద్దేవాచేశారు. ముఖ్యమంత్రి విశాఖకు వస్తే 16 గంటలపాటు దుకాణాలు, ఆఖరికి మెడికల్ షాపులు కూడా మూయించారని, అలా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. ప్రజల్లోకి రావడానికి ముఖ్యమంత్రికి భయమని, కాబట్టే పిరికి పందలా వేలాదిమంది పోలీసులభద్రత మధ్యన బిక్కుబిక్కుమం టూ విశాఖలో పర్యటించాడన్నారు. ముఖ్యమంత్రి రాకవల్ల విమా నాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు, ఇతరప్రజలు నానాఅవస్థలు పడ్డారని బండారు తెలిపారు. అన్నిదుకాణాలు మూయించిన ముఖ్యమంత్రి మద్యం దుకాణాలు మాత్రం కొనసాగించాడని, ఇంత లా దిగజారిపోయిన ముఖ్యమంత్రిని ఇప్పుడే చూస్తున్నానన్నారు .

జైలు నుంచి వచ్చి, రేపో మాపో మరలా జైలుకువెళ్లే వ్యక్తికి ఇంత భద్రత, బందోబస్తు అవసరమా అని సత్యనారాయణ మూర్తి ఎద్దేవాచేశారు. ప్రజలు తనను ఎక్కడ అడ్డుకుంటారోనన్న భయం ముఖ్యమంత్రి నరనరాల్లో ఉందని, విశాఖప్రజలు తమకు జరిగిన అవమానాలపై నిలదీస్తారన్న భయంతోనే 16 గంటలపాటు కర్ఫ్యూ విధించిమరీ, పర్యటనకు వచ్చాడన్నారు. పసిపిల్లలకు పాలుకూడా దొరక్క ప్రజలు నానాఅవస్థలు పడేలా ముఖ్యమంత్రి వ్యవహరించాడన్నారు. జగన్మోహన్ రెడ్డి తన విశాఖపర్యటనలో ఎందుకు మద్యం దుకాణాలు మూయించలేదని, ఆయనొక మాన సిక రోగి కాబట్టే, కర్ఫ్యూలు, బందోబస్తులతో ప్రజలను వేధించాడ న్నారు.

చంద్రబాబునాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రిగా విశాఖ కు వచ్చినా ఏనాడూ ప్రజలుఇబ్బంది పడిన దాఖాలాలు లేవన్నా రు. 16 గంటలపాటు ప్రజలను వేధించినందుకు ముఖ్యమంత్రి తక్షణమే వారికి బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు.

గతంలో ఏపీ పోలీసులపై తనకునమ్మకం లేదన్న వ్యక్తే, ఇప్పుడు వారిని అడ్డు పెట్టుకొని ప్రజాగ్రహం నుంచి తప్పించుకుంటున్నాడన్నారు. ఒళ్లు కొవ్వెక్కి, కండకావరంతో పోలీస్ అధికారిని అనరాని మాటలన్న మంత్రి అప్పలరాజుని తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని మాజీమంత్రి డిమాండ్ చేశారు.

Leave a Reply