ఐతే..నాకు ఒరిగిందేమిటి ?

Spread the love

మన ప్రజలు బహు విచిత్రులు. వాళ్లకు దేశం కోణంలో తీసుకునే నిర్ణయాలతో అవసరం లేదు. నాకు వ్యక్తిగతంగా ఏం జరిగిందన్నదే ముఖ్యం. చైనా వాడికీ, భారతీయుడికీ అదే తేడా. చైనా వాడు ప్రతిదీ దేశం కోణంలోనే ఆలోచిస్తాడు. జీవిస్తాడు. కానీ భారతీయుడు కోట శ్రీనివాసరావు అహ నాపెళ్లంట సినిమాలో మాదిరిగా నాకేంటీ.. అహ నాకేంటీ అని ఆలోచిస్తాడు. అందుకే ఈ వెనకబాటు. అదెలా చూద్దాం రండి.

మోడీ : మా ప్రభుత్వంలో 300 మిలియన్ బ్యాంకు అకౌంట్లు తెరిపించాము.
ఓటర్ : ఐతే..నాకు ఒరిగిందేమిటీ ?
మోడీ : మా హయాంలో 120 మిలియన్ ప్రజలకు సురక్షా బీమా కల్పించాము.
ఓటర్ : ఐతే..నాకు ఒరిగిందేమిటీ ?
మోడీ : 4 కోట్ల ప్రజలను జీవన జ్యోతి బీమా కల్పించాము..మరో 37 మిలియన్ ప్రజలను అటల్ పెన్షన్ యోజనలో భాగం చేసాము.
ఓటర్ : ఐతే..నాకు ఒరిగిందేమిటీ ?
మోడీ : మా గవర్నమెంట్ లో మనల్ని దొంగదెబ్బ తీసిన పాకిస్థాన్ కు సర్జికల్ స్ట్రైక్ తో గట్టి సమాధానం చెప్పాము.
ఓటర్ : ఐతే..నాకు ఒరిగిందేమిటీ ?
మోడీ : GST తర్వాత టాక్స్ రిటర్న్స్ బాగా పెరిగాయి.
ఓటర్ : ఐతే..నాకు ఒరిగిందేమిటీ ?
మోడీ : నోట్ల రద్దు తర్వాత దాదాపు 98 % డబ్బు తిరిగి వ్యవస్థలోకి వచ్చింది.
ఓటర్ : ఐతే..నాకు ఒరిగిందేమిటీ ?
మోడీ : మా ప్రభుత్వ హయాంలో ప్రపంచంలోనే అతిపెద్దదైన ఆరోగ్య బీమా ఆయుష్మాన్ భారత్ కు శ్రీకారం చుట్టాము.
ఓటర్ : ఐతే..నాకు ఒరిగిందేమిటీ ?
మోడీ : మా ప్రభుత్వంలో దారిద్ర రేఖకు దిగువన వున్న 12 కోట్ల కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్ లను ఉచితంగా పంపిణి చేసాము.
ఓటర్ : ఐతే..నాకు ఒరిగిందేమిటీ ?
మోడీ : స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి చీకట్లో మగ్గుతున్న 19వేల గ్రామాలకు విద్యుధీకరణతో వెలుగులు నింపాం.
ఓటర్ : ఐతే..నాకు ఒరిగిందేమిటీ ?
మోడీ : మా ప్రభుత్వ ప్రోద్భలంతో అమెరికా పాకిస్థాన్ కు చేసే సాయాన్ని నిలిపివేయించాం.
ఓటర్ : ఐతే..నాకు ఒరిగిందేమిటీ ?
మోడీ : కుల్ భూషణ్ జాదవ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానంలో పాకిస్థాన్ కు ఓడించాం.
ఓటర్ : ఐతే..నాకు ఒరిగిందేమిటీ ?
మోడీ : జపాన్ భాగస్వామ్యంతో త్వరలో మనదేశంలో బుల్లెట్ ట్రైన్స్ ను ప్రవేశ పెట్టబోతున్నాం.
ఓటర్ : ఐతే..నాకు ఒరిగిందేమిటీ ?
మోడీ : ముద్రా లోన్ సహాయంతో 10కోట్ల మంది నిరోద్యోగ యువతకు లోన్లు ఇచ్చాం.
ఓటర్ : ఐతే..నాకు ఒరిగిందేమిటీ ?
మోడీ : ఎంతో విజయవంతంగా సార్క్ సాటిలైట్ తో పాటు కార్డోశాట్ ప్రయోగాలను చేపట్టి ప్రపంచం మొత్తం మనల్ని చూసేటట్టు చేసాం.
ఓటర్ : ఐతే..నాకు ఒరిగిందేమిటీ ?
మోడీ : 4కోట్ల ప్రజలకు మిషన్ ఇంద్రధనుశ్ ద్వారా టీకాలు ఇప్పించి రోగాల బారి పడకుండా కాపాడం.
ఓటర్ : ఐతే..నాకు ఒరిగిందేమిటీ ?
మోడీ : మా ప్రభుత్వ హయాంలో ఎక్కువ మొత్తంలో ఫారెన్ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టారు.
ఓటర్ : ఐతే..నాకు ఒరిగిందేమిటీ ?
మోడీ : హజ్ సబ్సిడీని నిలిపివేశాం.
ఓటర్ : ఐతే..నాకు ఒరిగిందేమిటీ ?
మోడీ : ముస్లిం మహిళల పాలిట శాపంగా మారిన త్రిపుల్ తలాఖ్ తో పాటు నిఖా హలాలాను రద్దు చేసే నిర్ణయం తీసుకున్నాం.
ఓటర్ : ఐతే..నాకు ఒరిగిందేమిటీ ?
మోడీ : బినామీ చట్టం తీసుకొచ్చాం అండర్ రెరా యాక్ట్ కిందా.
ఓటర్ : ఐతే..నాకు ఒరిగిందేమిటీ ?
మోడీ : మా ప్రభుత్వంలోనే మొదటిసారి భారత్ యూకేను బీట్ చేసి 6వ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరించింది.
ఓటర్ : ఐతే..నాకు ఒరిగిందేమిటీ ?
మోడీ : రక్షణ బడ్జెట్ ను 11%కి పెంచగలిగాం
ఓటర్ : ఐతే..నాకు ఒరిగిందేమిటీ ?
మోడీ : 34,000 గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా మార్చగలిగాం.
ఓటర్ : ఐతే..నాకు ఒరిగిందేమిటీ ?
మోడీ : VIP కల్చర్ కు చిహ్నమైన రెడ్ బీప్ ను ఆపగలిగాం.
ఓటర్ : ఐతే..నాకు ఒరిగిందేమిటీ ?
మోడీ : మా హయాంలో పెద్ద ఎత్తున హైవే ప్రాజెక్ట్ లను నిర్మిస్తున్నాం.
ఓటర్ : ఐతే..నాకు ఒరిగిందేమిటీ ?
మోడీ : 2022 వరకు విద్యుత్ కనెక్షన్ లేని ఇళ్లకు ఫ్రీ కరెంట్ ఇవ్వాలనే కృతనిశ్చయంతో పనిచేస్తున్నాం.
ఓటర్ : ఐతే..నాకు ఒరిగిందేమిటీ ?
మోడీ : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో 30 ప్లేసులకు ఎగబాకం.
ఓటర్ : ఐతే..నాకు ఒరిగిందేమిటీ ?
మోడీ : నిరుద్యోగ యువత శిక్షణ కోసం 100 స్కిల్ డెవలప్ మెంట్ ఇనిస్టిట్యూట్ లను ఓపెన్ చేసాం.
ఓటర్ : ఐతే..నాకు ఒరిగిందేమిటీ ?

మన దేశ ఓటర్లు చాలా స్వార్థపరులు. వాళ్లకి కావాల్సిందల్లా వారికి ఏమైనా లాభం కలిగిందా అనే ఆలోచిస్తారు. కానీ దేశం గురించి ఆలోచించే సమయమే లేదు. ఇందులో మరికొందరు ఫ్రీ ఎలక్ట్రిసిటీ లేదా ఉచిత వైఫై ఇస్తే, దావూద్ ఇబ్రహీంకు ఓటేసినా ఆశ్యర్యపోవాలసిన అవసరం లేదు.మన వాళ్లకు హై క్లాస్ ఎమినీటీస్ కావాలి. కానీ ప్రాపర్ గా టాక్స్ పే చేయమంటే చేయరు. మన దేశం పరిశుభ్రంగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఎవరు డస్ట్ బిన్ లను యూజ్ చేయరు.

మనవాళ్లకు అవినీతి రహిత సమాజం కావాలని కోరుకుంటారు. కానీ ఎక్కడైన వెళితే ఎక్కడ లైన్లో నిలబడాల్సి వస్తుంది అని అవినీతి ప్రోత్సహించి, మరి మన పనులను చేయించుకుంటాం.మన అభిమాన హీరోను చూడటం కోసం గంటలు గంటలు పైగా వెయిట్ చేస్తాం. కానీ ట్రాఫిక్ లో గ్రీన్ సిగ్నల్ వచ్చే వెయిట్ చేసే ఓపిక ఉండదు.గవర్నమెంట్ స్ట్రిక్ట్ రూల్స్ పాటించాలని కోరుకుంటాం. కానీ మనమే ఆ రూల్స్ ను బ్రేక్ చేస్తాం. మనవాళ్లు కాళ్లు కదపకుండానే గవర్నమెంట్ అన్ని పనులు చేసి పెట్టాలి. మన బాధ్యతలను ప్రభుత్వమే స్వీకరించాలని కోరుకుంటాం. కానీ మనకు మనం సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ మరిచిపోతాం. ఇది మనదేశ ఓటర్ల మనోగతం.ప్రియమైన భారత ఓటర్లు ఒక్కసారి స్వార్థం విడిచి దేశం కోసం ఆలోచిద్దాం.

– పెంజర్ల మహేందర్ రెడ్డి
ఓసి సంఘం జాతీయ అధ్యక్షుడు

Leave a Reply