అఖిలేష్ కేం తెలుసు కాశీ మహత్యం ?!

Spread the love

“గాడిదకేం తెలుసు గంధం వాసన ! ” అనే ఓ మాట వుంది.. అట్లాగే గతంలో ఓ 5 సంవత్సరాల పాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి వెళ్ళుగబెట్టిన ఈ అఖిలేష్ యాదవ్ అనే మాహానుభావుడికి “కాశీ” అనే నగరం, కేవలం జీవిత అంతిమ దశలో వుండే ప్రదేశం అనే పరిజ్ఞానం మాత్రమే వుంది.

ఇక 2014 కు పూర్వం కాశీ నగరం అంటే ఇరుకైన వీధులు, రోడ్లపై ఎక్కడపడితే అక్కడ అడ్డుగా ఆవులు పడుకోవడం అలాగే అవి వేసే పేడ తీసేవారెవ్వరు లేక దాన్నే తొక్కుకుంటూ… ముసిరే ఈగలతో పాటు దుర్గంధం ఒకవైపు అలాగే రోజు మొత్తం మీద కరెంట్ 5/6 గంటలు మాత్రమే వుండడంతో షాపులే కాకుండా బోరు బావుల నీరు తోడుకోవడానికి గృహ సముదాయాల్లో కూడా గజానికొక డీజిల్ జనరేటర్లు వుండడంతో అవి వదిలే పొగతో కళ్ళు మండడం ఒకవైపు… ఆఁ వాసన భరించలేక లేచే తలనొప్పి మరోవైపు… ఇక ఆఁ 5/6 గంటల కరెంట్ కూడా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని అగమ్యగోచర పరిస్థితి.

మరోవైపు విపరీతమైన డీజిల్ ఆటోలు వాటి పొగ. అత్యంత అశుభ్రమైన రైల్వే స్టేషన్… గంగ నదిలో స్నానం చేస్తుంటే, ఏవైపు నుండి ఏ కాలీకాలని శవం వచ్చి తాకుతుందో తెలియని భయానక పరిస్థితి. గంగా
kasiనదిలోకి చూస్తుంటే, ఆలా ఆలా సగం కాలిన శవాలు ఎన్నెన్ని కనబడేవో ! గంగలో మునకేసి లేచేసరికి పక్కన సగం కాలిన శవం.

అందుకు కారణం స్మశానాల్లో కాటికాపర్లు, కట్టెలు మిగుల్చుకునేందుకు ఆ శవం తాలుకువారు అలా అక్కడినుండి కదిలీకదలగానే, కాలీకాలనీ శవాల్ని గంగానదిలోకి తోసేయడం. ఇకలాగే స్నానఘాట్ లపై తిరిగే ఆవులు అవి వేసే పేడతో అశుభ్రం ఒకవైపైతే, చూసుకోకుండా దానిపై కాలు పెట్టిన వారు జారిపడి కాళ్ళు చేతులు… నడుములు విరగొట్టుకోవడం. ఇలాంటివి ఇంకా చెప్పాలంటే, అదో చెంతాడంత అసౌకర్యాల సమస్యలు. ఇక ప్రధానాలయం కూడా షాపుల మధ్య వుండడంతో అక్కడికెళ్లే వరకు అదే గుడి అని తెల్సేది కాదు.

modi-in-varanasiకానీ అదే.. ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది. 2014 లో మోడీ వారణాసి MP కావడం… ఇక 2017 లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో యోగీ ఆధ్వర్యంలో BJP ప్రభుత్వం రావడంతో ఆఁ కాశిలో ప్రతీ దానిలో మార్పులు మొదలయ్యాయ్. రైల్వే స్టేషన్ ఒక అంతర్జాతీయ విమానాశ్రయంలా వుంటుంది. డీజిల్ ఆటోల స్థానంలో మొత్తం ఎలక్ట్రిక్ ఆటోలే.. 24/7/365 కరెంట్, మునపటన్ని ఆవులు లేవు, ఉన్నా అవి వేసే పేడను 24/7 రీతిన తీసేసే పారిశుద్ద సిబ్బంది.

చక్కటి రోడ్లు, కాశీ నగరంలో మీకెక్కడా వేలాడుతూ కనబడే ఏ కేబుళ్ళు కూడా కనఁబడవు. అంతా “భూగర్భం”లోనే, అవి విద్యుత్ అయినా, TV అయినా, TV కేబుల్ అయినా… నెట్ అయినా.ఇక గుడి ప్రాంగణం ఇప్పుడెలా వుందో నిన్న మనం TV ల్లో చూసాం. ప్రధాని మోడీ ఇంకా చేయాలనుకుంటున్న అభివృద్ధిలో ఇప్పటివరకు చేసింది, సగం మాత్రమే, ఇంకా చేయబోయేది ఇంకెంతో వుంది. ఇలా అన్నింటా అద్భుతమైన సమూల మార్పులే.

ఇక విద్యుత్ నిర్వహణ మొత్తం జపాన్ ప్రభుత్వం ఉచితంగా నిర్వహిస్తుంది. భక్తితో కాశీకి ఆఁ దేశ బహుమానమది. కాశీ వీధుల్లో గుళ్లో, గంగా నది ప్రాంతాల్లో నొసటిపై విభూతి.. మెళ్ళో రుద్రాక్ష మాలల దండలు వేసుకొని భక్తితో ధ్యాన్నం చేస్తూ జపాన్ దేశీయులు మనకెందరో కనబడతారు. పూర్తిగా సాత్విక ఆహారం తీసుకుంటూ గంగా నదిలో రోజుకు రెండు మార్లు స్నానం చేస్తూ వాళ్ళు నెలల కొద్ది కాశీ నగరంలో వుంటారట !

(ఇకదే ఊరంతా చర్చిలున్న గోవాలోనేమో తాగితందనాలు ఆడుతూ డ్రగ్స్ తీసుకుంటూ విచ్చలవిడి విదేశీయులు కనబడతారు.) జపాన్ మరియు కొన్ని యూరప్ దేశాల నుండి వచ్చి నెలల కొద్దీ వుండి ఇక్కడ సంగీతం, తబలా, వేణువు లాటి మరెన్నో సంగీత పరికరాలు నేర్చుకునే వారెందరెందరో కనబడతారు. వారికోసం ప్రత్యేక హోటళ్ళువున్నాయ్.

ఇక అఖిలేష్ యాదవ్ జరుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఆలా నోరుపారేసుకున్న ఓ అల్పబుద్ది మరియు సంస్కారహీనుడు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఇలా అభివృద్ధి చెందితే తమకిక పుట్టగతులండవనే Frustration తోనే ఈ ఈ పిచ్చి ప్రేలాపనల ఏడ్పులు. ఇక ఇలాంటి వారి ఏడ్పులే BJP & మోడీలకు దీవెనలు.

NB : గత 10/15 సంవత్సరాలుగా కాశీకి దగ్గర్లోనే వున్న అలహాబాద్ హైకోర్టుకు రెగ్యులరుగా వేడుతుంటాను. కాశీ ఎయిర్పోర్ట్ లో దిగి నేరుగా అలహాబాద్ వెళ్లడం, తిరుగు ప్రయాణంలో కాశీలో ఓ వారం రోజులంటాను గనుక ఈ మార్పులకు నేను కూడా ఒక ప్రత్యేక్ష సాక్షిని. కొన్నికొన్ని మార్లు 2 వారాలు కూడా వుంటాను. ఈ కరోనా మూలం 20 నెలల నుండి వెళ్ళలేదు తప్ప, ప్రతీ 2/3 నెలల కోసారి వెళ్ళొస్తాను.
ఆఁ నేలలో ఏదో మహత్తు వుంది, పుట్టినప్పటి నుండి కాశీ గురించి విన్నాం గనుక మనకలా అన్పిస్తుందేమో అనుకుందాం, కానీ అక్కడికొచ్చిన విదేశీయులతో మాట్లాడితే, వాళ్ళు కూడా అనే మాట అదే. మన ప్రమేయం లేకుండానే అక్కడ ఏదో ఓ ప్రశాంతత కల్గుతుంది, అందుకే నేనక్కడ వుండడానికి ఇష్టపడతాను. ఇక అక్కడ మన తెలుగు వాళ్ళు అత్యధికం.నిజానికి చాగంటి వారి మూలంగా మన తెలుగు యాత్రికులే అధికం కనుక మన తెలుగు భోజన సదుపాయాలకు అస్సలు ఇబ్బంది వుండదు.

– నాగమంజరి

Leave a Reply