– 111జీవో .. అదే యాపారం
ఒక వైపు మద్యం వరద, డ్రగ్స్ మాఫియా, భూకబ్జాలు, అప్పుల కుప్పలు…
మరొకవైపు కమీషన్స్, కుటుంబపాలన, ప్రభుత్వ ఆస్తులు అమ్మకం, పర్యావరణ విధ్వంసం, ఆరోగ్యాలు నాశనం…
అన్నీ తెలంగాణా ను పీల్చి పిప్పి చేస్తున్నాయి, అయినా, ప్రజలు మౌనంగా ఎందుకు భరిస్తున్నారు?
విలువల పతనం, స్వార్థం, బాధ్యతారాహిత్యం, మూర్ఖత్వం భవిష్యత్ ను కాటేయబోతున్నాయి…
ఎన్నడు మేల్కొనేది? ఎన్నడు తెలివొచ్థేది?
కిస్మత్ పూర్ పక్కన సాఫ్ట్వేర్ పార్క్ అన్నారు, గజం 15,000 ఉంటే 40,000 కు కృత్రిమ రేటు సృష్టించి పొలాలు, ప్లాట్లు అమ్ముకొని బయటపడ్డారు…
సాఫ్ట్వేర్ పార్కొచ్చింది లేదు, ఉద్యోగాలు పెరిగింది లేదు…
పహాడీషరీఫ్, తుర్కయాంజాల్, హయత్నగర్, నాగారం, కొంపల్లి, మియాపూర్ ఇన్నర్ రింగ్ రోడ్డు అన్నారు,
ప్లాట్లు, పొలాలు రేటు పెంచుకునిఅమ్ముకున్నారు, గమ్మున జారుకున్నారు…
ఐటిఐఆర్ పార్క్ అన్నారు, రీజనల్ రింగ్ రోడ్ అన్నారు, కండ్లకోయ సాఫ్ట్వేర్ పార్క్ అన్నారు,
యాదగిరిగుట్ట అన్నారు,
హార్డ్వేర్ పార్క్ లన్నారు,
ఫార్మా సిటీ అన్నారు,
చిన్న ఏర్పోర్ట్ లన్నారు,
టెక్స్టైల్ పార్క్ అన్నారు…
అన్నింటిలో అదే తంతు…
ఇప్పుడు 111జీవో అంటున్నారు…
ఇక్కడా అదే యాపారం…
వెరీ సింపుల్ .
కోటి రుపాయలకు ఎకరా అగ్రిమెంట్ చేసుకోవడం, 111జీవో ఎత్తేస్తున్నామని పది కోట్లకు అమ్ముకోవడం, పైసలు తీసుకొని దుబాయ్ కి పోవడం…
ఎక్కడా పేరు రిజిష్టర్ కాదు, పైసలు తీసుకున్నట్లు సాక్ష్యం ఉండదు…
కొన్నోడు బలి,
అమ్మినోడు బాహుబలి.
చూరుగాలేది లేదు
పిల్లిలేసేది లేదు…
అసలు తెలంగాణాలో జరుగుతున్నది రియల్ ఎస్టేట్ యాపారమే కానీ ప్రభుత్వపాలన కాదనేది ఎప్పుడు గ్రహిస్తారు?
జై హింద్.. జై శ్రీరామ్
– పెంజర్ల మహేందర్ రెడ్డి
అఖిల భారత ఓసి సంఘం
EWS ఎకనామికల్ వీకర్ సెక్షన్
జాతీయ అధ్యక్షులు