కేసీఆర్ పిఎం కల నెరవేరే అవకాశం ఎంత…?

-డా.జయదేవ్.చల్లా /చెన్నై / సీనియర్ పాత్రికేయులు

మిత్రులొకరు తెలంగాణ నేత కేసీఆర్ ప్రధాని కాగలరా? అని నన్ను అడిగిన మీదట ఈ కధనం వ్రాస్తున్నాను.దీనికి నేను సంఖ్యా శాస్త్రం ప్లస్ వేదం జ్యోతిష్యాన్ని ఆసరాగా తీసుకోవడం జరిగింది.ఈ రెండు శాస్త్రాల ప్రకారం కేసీఆర్ జన్మ కుండలిని స్టడీ చేసినప్పుడు ఈ కింద విషయాలు తెలిశాయి.మీరు వాటి పైన ఓ లుక్కేయండి మరి..

సంఖ్య -జాతక శాస్త్రాలు ఏం చెబుతున్నాయి..?
6 3 3 7
2 2 5
9 6 1 9 4 7
6 7 1 4 2
4 8 5 6
3 4 2
7 6
4

కేసీఆర్ కారక సంఖ్యా,పిండ సంఖ్యా రెండూ 4 గే.ఈ సంఖ్యా రాహు గ్రహ సూచకం. అంటే మాయ కు కారకుడు. ఈ రాహువు వాక్ స్థానమైన వృషభ రాశిని చూస్తున్నాడు.అంటే మాయ మాటలు చెప్పడం అనేది ఈ జాతకునికి జన్మహత వచ్చే నైపుణ్యం.ఇక అయన జన్మాంకము,లగ్న అంకము రెండూ కూడా 8 కావడం విశేషం. దీనికి అధిపతి శనీశ్వరుడు కావడం వలన శిఖరాలు-లోయలు ఈయన జీవితంలో తప్పని,తప్పించుకోలేని అంశాలు.పూర్ణాంకం 1. అధిపతి రవి. అంటే రవి శనుల కారణం వలన ఈయన రాజకీయాల్లోకి రావడం జరిగింది.మార్చి 30 వరకు రాహువులో చంద్ర భుక్తి,ఆపైన కుజ భుక్తి. ఏప్రిల్ 16,2024 వరకు,ఈ 2023 వర్షన్క సంఖ్య 7.దీనికి కుజుడు-కేతువు అధిపతులు. జన్మ కుండలిలో కుజుడు అష్టమంలో ,కేతువు సింహాసన రాసి అయిన నాలుగో స్థానంలో ఉన్నారు.ఇది మంచి స్థానాలు కావు. సింహాసనం చేజారి పోయే అవకాశాలు హెచ్చుగా ఉన్నాయి. అంతే కాక 2023-2024 సంవత్సరాలు ఆరోగ్యపరంగా చిక్కులను ఇస్తాయి.కుజ భుక్తి రాగానే కొన్ని ఆరోగ్య సమస్యలు బయట పడతాయి. చక్రం లోని 9 వ స్థానాన్ని రాజముద్రిక స్థానం అంటారు.ఈ స్థానానికి గురువు ఉన్న స్థానానికి సంఘర్షణ ఏర్పడింది. .రాజముద్రిక రాశిని గురువు నిర్వీర్యం చేశాడు.అంటే అధికారం అయన చేతిలో నుంచి మరొకరికి బదలాయించబడే అవకాశాలు హెచ్చుగా ఉన్నాయి పరిశీలన మీదట కేంద్రంలో కేసీఆర్ చక్రం తిప్పగలగడం ఆయనకు ఒక కల లాగానే మిగిలిపో గలదు.

Leave a Reply