– తుమ్మిడి హట్టి దగ్గర ప్రాజెక్టు కు అనుమతి తీసుకురావాలి.
– ఏపీకి నీళ్లు పంపుతున్నారు.. తెలంగాణను ఎండపెడుతున్నారు
– మాజీ మంత్రి గంగుల కమలాకర్
హైదరాబాద్: కాళేశ్వరంతో సస్యశ్యామలమైన తెలంగాణలోని పలు ప్రాంతాలు ఇప్పుడు ఎడారిగా మారుతున్నాయి. కరీంనగర్ పట్టణానికి నాలుగు రోజులకు ఒకసారి నీరు ఇస్తున్నారు. ఏపీకి నీళ్లు పంపుతున్నారు. తెలంగాణను ఎండపెడుతున్నారు.
తుమ్మిడిహట్టి నుంచి గ్రావిటీ ద్వారా నీరు ఇస్తామన్నారు.ఇప్పటి వరకు ఎంత వరకు వచ్చింది?కేంద్రం వద్దకు వెంటనే తుమ్మిడిహట్టి ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకొచ్చి పనులు చేపట్టాలి. బడే భాయ్ దగ్గరకు వెళ్లి రేవంత్ రెడ్డి తుమ్మిడి హట్టి దగ్గర ప్రాజెక్టు కు అనుమతి తీసుకురావాలి.
రాజీవ్ గాంధీతో తెలంగాణకు ఏం సంబంధం? నిన్న రాజీవ్ గాంధీ పాదాల చెంత రైతు సంబరాలు చేస్తున్నామనే రీతిలో మంత్రులు నిసిగ్గుగా మాట్లాడుతున్నారు. ఇది తెలంగాణ కు అవమానం. కాంగ్రెస్ లో ఉన్న విబేధాలు, నిస్పృహను కేసీఆర్, బీఆర్ఎస్ పై చూపుతున్నారు. మేడిగడ్డకు మరమ్మత్తులు చేసి కాళేశ్వరం నీరు ఇవ్వండి లేదా తుమ్మిడిహట్టి వద్ద ఆనకట్ట కట్టండి. రేవంత్ రెడ్డికి కేసీఆర్ స్థాయి రావాలంటే పదేళ్ల పాటు సీఎం చేసి ఉండాలి. కేసీఆర్ కు రేవంత్ సమ ఉజ్జి కారు.