17 ఎకరాల భూమిలో కేసీఆర్‌కు వాటా ఎంత?:దాసోజు

17 ఎకరాల భూమిని అప్పనంగా అప్పగించారని వ్యాఖ్యానించారు. తెలంగాణ భూములను దోపిడీదార్లకు సీఎం కేసీఆర్ అప్పగించారని కాంగ్రెస్ నేత దాసోజు శ్రావణ్ ఆరోపించారు. ఇందులో కేసీఆర్‌కు వాటా ఎంత? అని ఆయన ప్రశ్నించారు. 1500 కోట్ల రూపాయల విలువైన ఫిల్మ్ నగర్ భూములను ఎంపీ.రంజిత్ రెడ్డికి అడ్డగోలుగా ఇచ్చేసారనిశ్రావణ్ ఆరోపించారు. కంచె చేను మేసినట్టుగా అధికార పార్టీ నాయకులు విలువైన భూములను అడ్డగోలుగా తీసుకున్నారని మండిపడ్డారు. ఎంపీ రంజిత్ రెడ్డి, ఇందు శ్యామ్ ప్రసాద్‌రెడ్డిలకు ప్రభుత్వం విలువైన భూములను కట్టబెట్టిందని ఆందోళన వ్యక్తం చేశారు.అక్కడ ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయాలన్ని కూడా తొలగించి భూములను స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు. ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన నియోజక వర్గంలో ఉన్న ఈ భూముల గురించి మాట్లాడతారా? అని ప్రశ్నించారు. గతంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే‌గా చింతల రామచంద్రారెడ్డి పని చేసిన విషయాన్ని కూడా శ్రావణ్ గుర్తు చేశారు. బీజేపీ వాళ్ళు ఆంజనేయ గుడిని కాపాడేందుకు ఎందుకుపోరాటం చేయడం లేదన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రితో పాటు సంబంధిత అధికారులకు, హోసింగ్ బోర్డుకు లేఖలు రాశామని దాసోజు శ్రావణ్ తెలిపారు.

Leave a Reply