నా పేరు గోగడ రత్నయ్య( రిటైర్డ్ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడను) కొంచెం ఓపిగ్గా రెండు నిమిషాలు చదివి అర్థం చేసుకోండి. నేను హెడ్మాస్టర్ గా పనిచేసిన కాలములో ప్రతి పాఠశాలకు ఆ పాఠశాల యొక్క విద్యార్థుల స్ట్రెంగ్త్ ను బట్టి 25 వేల నుండి 1,50,000 దాకా మంజూరు జరుగుతూ ఉండేది. నా పాఠశాల విషయానికి వస్తే సంవత్సరమునకు రూ.75000 మంజూరు జరిగేది ఇది ఎలా జరిగేది అంటే బడ్జెట్ కేటాయింపులకు ముందు మంత్రివర్గ ఆమోదం జరుగుతుంది. శాసనసభ, శాసన మండలలలో బడ్జెట్ కేటాయింపులు ఆమోదం జరిగేది.
తరువాత ఆయా పాఠశాలలకు సి ఎఫ్ ఎం ఎస్ ద్వారా రిలీజ్ చేయడం ఖర్చు పెట్టడం జరుగుతుండేది. ఉదాహరణకు ఫిజికల్ ఎడ్యుకేషన్ కు పరికరాలు కొనుక్కోవడానికి, పిల్లలను జోనుకు తీసుకు వెళ్లడానికి, తర్ఫీదు ఇవ్వడానికి రూ.10000 పిడికి ఇచ్చాను అనుకోండి పీడీ గారు ఫిజికల్ ఎడ్యుకేషన్ వస్తువులను నెల్లూరులో కొనుగోలు చేస్తే, ఆ పరికరాలు అమ్మినోడు మా దగ్గర జిఎస్టి వసూలు చేయడం జరిగింది ఈ జీఎస్టీ లో కూడా రెండు రకాలు ఉన్నాయి ఒకటి సి జి ఎస్ టి, రెండవది ఎస్ జి ఎస్ టి . మొదటిది సెంట్రల్ గవర్నమెంట్ కు సంబంధించినది అయితే రెండవది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినది.
మాకు పరికరాలు అమ్మినవాడు మా దగ్గర జిఎస్టి వసూలు చేశాడు కానీ వాడు సి జి ఎస్ టి కట్టలేదట (అంటే సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్) అయితే వాస్తవంగా ఆలోచిస్తే అందులో హెడ్మాస్టర్ గా నాకు ప్రమేయం ఉండదు మా పిడి వస్తువులు కొనుగోలు చేశాడు పూర్తి అమౌంటు చెల్లించడం జరిగింది అతనికి సంబంధం లేదు ఎవరి మీద చర్యలు తీసుకోవాలి ఒకసారి ఆలోచన చేయండి.
పిడి స్థాయిలో ఏదైనా అవకతవకలు జరిగిందంటే పిడి మీద అయినా చర్యలు తీసుకోవాలి లేదా డబ్బులు డ్రా చేసిన నా మీద అయినా తీసుకోవాలి అంతేకానీ ముఖ్యమంత్రి మీద చర్యలు తీసుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి చెప్పండి.
పాఠశాలకు ఫిజికల్ ఎడ్యుకేషన్ కు సంబంధించిన వస్తువులను అమ్మినోడు టాక్స్ కట్టకుంటే అతని మీద కదా చర్యలు తీసుకోవాల్సిందే ఎవరైతే బాధ్యులో వారి మీద చర్యలు కాకుండా, పాఠశాలకు నిధులు కేటాయించాలని మంత్రివర్గం నిర్ణయించుకుంటే దానిని బడ్జెట్లో కేటాయిస్తే తరువాత చీఫ్ సెక్రటరీ స్థాయి నుండి ఆర్థిక కార్యదర్శి ద్వారా ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వారా పాఠశాలలకు నిధులు వచ్చాయి ఇందులో ముఖ్యమంత్రికి ఏదైనా సంబంధం ఉంటుందా!
ముఖ్యమంత్రి మీద కేసు పెట్టడం అంటే ఇది ఎంతవరకు సమంజసం ఒక్కసారి ఆలోచన చేయండి. స్కిల్ డెవలప్మెంట్ కేసు కూడా ఇదే ముఖ్యమంత్రికి సంబంధం లేని దాంట్లో, అన్ని ఫ్రీ పోల్ సర్వే రిపోర్ట్స్ తనకు వ్యతిరేకంగా వస్తూ ఉండేసరికి చివరికి పీకే రిపోర్టు కూడా వ్యతిరేకంగా వచ్చింది ఇక భవిష్యత్తులో నేను ముఖ్యమంత్రిని కావటానికి అవకాశం లేదు అనుకుని ఈ పిచ్చి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మీద కక్ష తీర్చుకుంటున్నాడు అంతకు తప్ప ఇంకేమీ కాదు కదా! ఇటువంటి కుట్రదారులకు ప్రజా కోర్టులో శిక్ష తప్పదు ఇది తథ్యం.
ఇట్లు
గోగడ రత్నయ్య,
రిటైర్డ్ హై స్కూల్ హెడ్మాస్టర్ ,
కనిగిరి.