– బీజేపీ శాసనసభా పక్షనేత రాజా సింగ్
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోద్భలంతోపాటు మంత్రి కేటీఆర్ డైరెక్షన్ ప్రకారమే ‘ప్రజా సంగ్రామ యాత్ర’పై దాడులు జరుగుతున్నాయి. పాదయాత్ర మొదలు పెట్టకముందే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ‘‘పాదయాత్రను అడ్డుకునేందుకు కుట్ర జరుగుతోందని, దాడులు చేస్తారని’’ ముందే చెప్పారు. సంయమనంతో ఉండాలని చెప్పారు.
ఈరోజు జరిగిన దాడిని అడ్డుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీకి చెందిన రాష్ట్ర అధ్యక్షులు ప్రజల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ప్రజలకు భరోసా కలిగిస్తుంటే… పూర్తి భద్రత కల్పించాల్సింది పోయి ఇలాంటి దాడులు చేయడం సిగ్గు చేటు.
కేసీఆర్ రాజకీయ దివాళాకోరుతనానికి ఇది నిదర్శనం. అన్ని రంగాల్లో విఫలమైన ముఖ్యమంత్రి ప్రజాగ్రహాన్ని ఎదుర్కోలేక తమ కిరాయి గూండాలతో దాడి చేయించడం హేయమైన చర్య. రాష్ట్ర అధ్యక్షుడికి రక్షణ కల్పించలేని వాళ్లు సామాన్య ప్రజలకు ఏం రక్షణ కల్పిస్తారనే దానికి ఈ సంఘటన నిదర్శనం.
భవిష్యత్తులో ఈ ఘటన పునరావ్రుతం కాకుండా చర్యలు తీసుకోవాలని బీజేపీ శాసనసభాపక్షం తరపున డిమాండ్ చేస్తున్నాం. ప్రజా సంగ్రామ యాత్ర సాఫీగా కొనసాగేందుకు పూర్తి భద్రత కల్పించాలి. మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాం. ఇలాంటి ఘటనలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తుంటాయి.. పోతుంటాయి.. పోలీసులు చట్ట ప్రకారం విధి నిర్వహించాలే తప్ప రాజకీయ కుట్రలో ఇరుక్కోవద్దని సూచిస్తున్నాం.