Suryaa.co.in

Telangana

డాక్టర్ లక్ష్మణ్, బొడిగె శోభక్క చేసిన తప్పేంది?

– ప్రశ్నించడమే పాపమైందా?
– రాత్రింతా లక్ష్మణ్ ను చలిలో ఉంచుతారా?
– బండి సంజయ్ ఫైర్

ఈనెల 2న చేపట్టిన ‘జాగరణ’ కార్యక్రమం సందర్భంగా బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ ను, ఈరోజు మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభను అరెస్టు చేయడంపట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. లక్ష్మణ్, బొడిగె శోభ విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై స్పందిస్తూ.. ‘‘ డాక్టర్ లక్ష్మణ్ గారు హైదరాబాద్ నుండి వస్తుంటే దారిలో ఆపేసి అరెస్టు చేసిండ్రు. ఆయన వయసును కూడా గౌరవించకుండా తీసుకుపోయి రాత్రంతా పీటీసీ వద్ద చలిలో కూర్చోబెట్టిండ్రు. ఆయన ఏం తప్పు చేసిండని అరెస్ట్ చేయాల్సి వచ్చింది? నాకు చాలా బాధేసింది. ఇది ఏ మాత్రం మంచి పద్దతి కాదు.’’అని అన్నారు. బోడిగె శోభ అరెస్టు పై స్పందిస్తూ ‘‘ బొడిగె శోభక్క దళిత మహిళ. మాజీ ఎమ్మెల్యే. ఆమె జాగరణ కార్యక్రమం దగ్గరకు రానేలేదు. ఇంటి దగ్గరుంటే ఆరోజు ముందస్తు అరెస్టు చేసిండ్రు. అయినా ఆమె ఏం తప్పు చేసిందని మళ్లీ కేసుల్లో ఇరికించి అరెస్ట్ చేస్తరు? ప్రశ్నించడమే పాపమైందా? ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తరా? ఈ ముఖ్యమంత్రికి ఇదే జైలుకు పోయే రోజులు దగ్గర్లో ఉన్నయ్.’’అని అని మండిపడ్డారు.

LEAVE A RESPONSE