– ఇమామ్, మౌజమ్ లకు గౌరవ వేతనాలు పెంచుతామని పెంచలేదు
– బీఆర్ఎస్ నేతలు ఇంతియాజ్ అహ్మద్ ,అబ్దుల్ కలీం, బైకాని శ్రీనివాస్ యాదవ్
హైదరాబాద్: రేపటి తో రేవంత్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చి 420 రోజులు పూర్తవుతాయి. రాహుల్ చేతిలో రాజ్యాంగం పట్టుకుని తిరుగుతారు. రేవంత్ పాలనలో మాత్రం రాజ్యాంగం ప్రకారం మైనారిటీలకు రావాల్సిన ప్రయోజనాలు రావడం లేదు. మైనారిటీల గురించి రేవంత్ ప్రభుత్వం లో మాట్లాడేవారు లేరు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మైనారిటీలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
మైనారిటీ డిక్లరేషన్ లో చెప్పింది ఒక్కటి కూడా అమలు చేయలేదు. మైనారిటీలకు సబ్ ప్లాన్ అమలు చేస్తామని ఇప్పటివరకు అమలు చేయలేదు. ఇమామ్ ,మౌజం లకు గౌరవ వేతనాలు పెంచుతామని పెంచలేదు ..రావాల్సిన జీతాలు కూడా రేవంత్ ఇవ్వడం లేదు.
మైనారిటీలకు నిధులు బడ్జెట్ లో పెట్టినా ఖర్చు చేయడం లేదు.
కాంగ్రెస్ లో ముస్లిం నాయకులు ఉన్నా మైనార్టీల సమస్యల పై మాట్లాడటం లేదు. ముస్లింలు రేవంత్ ప్రభుత్వం పై పోరాడే సమయం వచ్చింది. కేసీఆర్ హాయం లో మైనార్టీల కోసం గురుకులాలు స్థాపించారు. గురుకులాల్లో చదివిన ముస్లిం విద్యార్థులు ఇపుడు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లో చదువుతున్నారు. ఇప్పుడు మైనారిటీ గురుకులాల్లో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి.
ఖానాపూర్ ఎమ్మెల్యే ఎడ్మ బొజ్జు మైనార్టీల అంతు చూస్తామని బెదిరించినా చర్యలు లేవు. దానం నాగేందర్ ముందు ఓల్డ్ సిటీ లో భవనాలు కూల్చాలని మైనార్టీల మనోభావాలను కించపరిచారు. రేవంత్ మంత్రివర్గం లో ఒక్క మైనార్టీకి కూడా స్థానం లేదు. సెక్యులర్ విలువలను కాంగ్రెస్ మంటగలుపుతోంది. మహబూబ్ ఆలం ఖాన్ ఇంట్లో రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు.ఆలం ఖాన్ మైనార్టీలకు అన్యాయం జరుగుతున్నా నోరుమెదపడం లేదు. స్ధానిక ఎన్నికల్లో మైనారిటీ లు కాంగ్రెస్ కు గట్టిగా బుద్ది చెబుతారు.