Suryaa.co.in

Andhra Pradesh

దళిత యువకుడు నూతక్కి రవికిరణ్ మతృదేహం ఎక్కడ?

– నిందితుల్లో వైసీపీ కార్యకర్తలు
– హత్యపై గుంటూరు రేంజ్ డీఐజీకి లేఖ రాసిన తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

ఎస్సీ-మాదిగ కులానికి చెందిన నూతక్కి రవికిరణ్‌ను దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని గోనె సంచిలో వేసి బకింగ్ హాం కాలువలో పడేసినట్లు ప్రచారం జరుగుతోంది.ఈ హత్యలో ప్రధాన నిందితులు లడ్డు అనబడే సముద్రాల పవన్ కుమర్, నన్నపనేని కృష్ణ చైతన్య, అత్తోట దీప్తి, మక్కెన వంశీ, పిల్లి రవికుమార్‌ లు అరెస్టు కాగా తూమాటి ప్రశాంత్ పరారీలో ఉన్నాడు.

లడ్డు అనబడే సముద్రాల పవన్ కుమార్ ఇప్పటికే ఐదు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. నిందితులకు అధికార వైసీపీ నుంచి మద్దతు ఉంది. నిందితులను విడుదల చేయాలని అధికార పార్టీ నేతలు పోలీసులపై ఒత్తిడి చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

వైసీపీ నేతల ప్రభావంతో తమకు న్యాయం జరగదని రవికిరణ్ కుటుంబం ఆందోళన చెందుతోంది. రవికిరణ్ మృతదేహం జాడ లేకపోవడంతో కుటుంబ సభ్యులు మృతుడిని చివరి చూపు చూసేందుకు ఆందోళనకు గురవుతున్నారు.

బాధిత కుటుంబం సామాజికంగా, ఆర్థికంగా పేద కుటుంబానికి చెందినవారు. త్వరగా మృతుడి మృతదేహాన్ని గుర్తించాలని, బాధిత కుటుంబానికి వీలైనంత త్వరగా న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాను.నేరం జరిగిన ప్రదేశంలో దొరికిన మృతుడి రక్తపు మరకలతో అతని తల్లి DNAతో పరీక్ష నిర్వహించాలని కోరుతున్నాను.

LEAVE A RESPONSE