వినయం శీలం లేని విద్యావంతుడు మృగం కంటే ప్రమాదకరం – అంబేద్కర్ అన్న మాటలివి.
అహింసావాదం చెప్పిన బౌద్ధం పేరు అంబేద్కర్ గారి పేరు చెప్పుకొని.. గొడ్డు మాంసం తింటాం పెద్ద కూర పండగలు చేస్తం అనే వాళ్ళా ? బ్రాహ్మణుడి ఇంటి పేరును, తన పేరు వెనుక తగిలించుకున్న అంబేద్కర్ మాకు ఆదర్శం. కానీ బ్రాహ్మణులను బాపనోళ్ళు అంటూ విపరీతంగా ద్వేషించే వాళ్ళా ?
అంబేద్కర్ గారు హిందుత్వంలోని వివక్షని , అంటరానితనాన్ని బ్రాహ్మణ ఆధిపత్యాన్ని నిరసిస్తే .. ఆయన పేరుతో హిందువులను హిందుత్వాన్ని దేవీదేవతలను తీవ్రమైన పదజాలంతో అనుక్షణం ద్వేషిస్తూ, అవసరం వచ్చినప్పుడల్లా వారిని బూతులు తిట్టుకుంటూ చెప్పులతో కొట్టే వాళ్ళా ?
అంబేద్కర్ ని చదివించి తన డబ్బుతో, ఒక అగ్రకులస్తుడైన రాజు ఇతర దేశాలకు చదువులకోసం పంపించాడని, అంబేద్కర్ జీవిత చరిత్ర లో చదువుతాం …మాటకు ముందు మాట తరువాత అగ్రకుల మనువాద అహంకారం అనే వాళ్ళా ? ఎవడో చేసిన తప్పుకి కొన్ని కులాలని తిడతాం …హిందూ సమాజం కులాలతో ఉంది అంటాం. సుమారు వంద ముక్కలైన బౌద్దంకు జై కొడుతూ….మళ్ళీ కులాల ఐక్యత వర్ధిల్లాలి అనే వాళ్ళా ?
తెల్లతోలు బ్రిటిష్ క్రైస్తవుడు మెకాలే రాసిన, మూలవాసి సిద్దాంతాన్ని తిరస్కరించిన అంబేద్కర్ కి జై కొడతాం …నేటి సైన్స్ టెక్నాలజీ అది తప్పని నిరూపించినా, మేము అంగీకరించం.మేము ద్రవిడులము మూలవాసులం అనే వాళ్ళా ? రామాయణ మహాభారతాలు పుక్కటి పురాణాలు అవి కట్టుకథలు అని చెబుతూనే, రావణుడి నరకాసురుడి వారసులం మేము అనే వాళ్ళా??
క్రైస్తవం భారత జాతి సమగ్రతను దూరం చేస్తాయన్న అంబేద్కర్ వాదనలను మర్చిపోతాం. క్రైస్తవం స్వీకరించి కూడా దొంగ సర్టిఫికేట్ లతో సాటి దళితుల విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు కొల్లగొడుతూ, చర్చికి పాస్టర్లకు అయ్యగార్లను మేపుతూ తామేదో గొప్ప వాళ్ళం అనుకునే వాళ్ళా ?
ఇస్లాం ని పూర్తిగా విస్మరించి…మత ప్రాతిపదికన దేశ విభజనను కాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని వ్యతిరేకించిన అంబేద్కర్ గారి పేరు చెప్పుకుంటూ, నేటి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ లలో దళితులు ఏమయ్యారో తెలిసీ జై బీమ్ మీమ్ అనే వాళ్ళా ?
దేశమా …నేనా….అంటే దేశమే అని చెప్పిన అంబేద్కర్ గారి మాటలు విస్మరిస్తాం …భారత్ తుకడే తుకడే వాదులకు వెన్నుదన్నుగా ఉంటాం అనే వాళ్ళా ?
దేశ సార్వభౌమత్యం కోసం సమన్యాయం కోసం.. కులాలు వద్దన్న అంబేద్కర్ మాటలు ముద్దు. మనుషులను విడదీసే మూలవాసి సంఘాలు…బహుజన సంఘాలు.కుల సంఘాలు ..మత సంఘాలు… పెద్ద కూర సంఘాలు… మొదలైనవి పెట్టుకునే వాళ్ళా ?గుడిలో దేవుడికి విగ్రహ పూజకి వ్యతిరేకం. కాని వీధి వీధికి సందు సందుకి అంబేద్కర్ గారి విగ్రహాలు పెట్టి వాటికి పూజలు దండలు పాలాభిషేకాలు చేసే వాళ్ళా ?
అంబేద్కర్ గారిని తీవ్రంగా అవమానించి, బ్యాలెట్ పేపర్లు అయినా చించండి కాని అంబేద్కర్ గారికి ఓటు వెయ్యెద్దు అన్న కమ్యూనిస్టులని సమర్ధించే వాళ్ళా ? అంబేద్కర్ గారిని తీవ్రంగా అవమానించి, ఆయన మృతి కారణమై…ఆయన అంత్యక్రియలకు కూడా హాజరు కాని పార్టీ ….ఏ పార్టీలో చేరితే దళితులకు ఆత్మహత్యాసదృస్యం అని అంబేద్కర్ గారు చెబితే, ఆ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి జెండా మోసే వాళ్ళా ?
దేశ నాయకుల విగ్రహాలకు డబ్బులు దండగ అని మాట్లాడుతం. కాని బహుజన రాజ్యాధికారం రాజ్యం అంటూ వచ్చిన పార్టీలు, కోట్ల రూపాయలు నాయకుల విగ్రహాలకు ఏనుగు బొమ్మలకు తగలేస్తే సమర్ధించే వాళ్ళా ?? ఎవ్వరు అంబేద్కర్ వాదులు ?
ఓసి సంఘం జాతీయ అధ్యక్షుడు
9666606695