Suryaa.co.in

Andhra Pradesh

బోర్డును నియమించే హక్కు ఎవరికుంది?

-జనసేన అధినేత పవన్ కల్యాణ్
అమరావతి : టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు జనసేన అండగా ఉంటుందన్నారు. 2010లో కాంట్రాక్ట్ ఉద్యోగులను సొసైటీలుగా ఏర్పాటు చేసుకోవాలని టీటీడీ సూచించిందని గుర్తు చేశారు.
ఇంకా పవన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కొత్తగా ఇప్పుడు కార్పోరేషన్ ఎందుకు? వ్యవస్థలను మార్చే సమయంలో జాగ్రత్త వహించాలి. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. సుప్రీంకోర్టు 2016లో వెలువరించిన తీర్పును పూర్తిగా విస్మరించారు. కార్పొరేషన్‌లో చేరని ఉద్యోగులను బెదిరిస్తున్నారు. కొత్తగా కార్పొరేషన్ ఏర్పాటు.. నిధులు దారి మళ్లించేందుకేనా? బోర్డును నియమించే హక్కు ఎవరికుంది? ఈ ప్రక్రియలో పారదర్శకత ఉందా? 73 సొసైటీలలో ఉన్న నాలుగు వేల మంది ఉద్యోగులను ఒప్పించ లేకపోయిందా? నాలుగు వేల మంది ఉద్యోగులకు వైసీపీ పాదయాత్రలో ఎందుకు హామీలు ఇచ్చింది? కాంట్రాక్ట్ ఉద్యోగులకు జనసేన పార్టీ అండగా ఉంటుంది’’ అని పేర్కొన్నారు.

LEAVE A RESPONSE