కడప వాళ్ళు అంటే ప్రాణాలు తీసే బాచ్ నా?..ఎవడ్రా అలా మాట్లాడేది?

Spread the love

ఏమిటీ కడప వాళ్ళు అంటే ప్రాణాలు తీసే బాచ్ నా.. వాళ్లకు ప్రాణాలు తీయడం తప్ప…అని… ఎవడ్రా అలా మాట్లాడేది ? అలా మాట్లాడే తెలుగుజాతి ద్రోహులారా…
మత విద్వేష బాచ్..
రాజకీయ స్వార్థ బాచ్..
కుల విద్వేష బాచ్..
సారాయి బాచ్..
ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని గుమా లకు తాకట్టు పెట్టే బాచ్..
ముందు తెలుసుకోండి..
కడప జిల్లా అంటే మన తెలుగుతల్లి కన్నబిడ్డల్లో ఒకటి, మనలాగే. అది దేవుని గడపరా.. అన్యాయంగా తిడితే కళ్ళు పోతాయి
వేల, లక్షల సంవత్సరాల నాటి మనుషులు/ సేపియన్స్ Paleolithic rock paintings కడప అంతా ఉన్నాయి., megalithic స్థలాలు కూడా. ముందు అవేంటో తెలుసుకో, మధ్యలో పుట్టిన కులమతాల ద్వేషంతో కొట్టుకు చావకు.

ప్రపంచానికి శాంతి సహనం, అహింసను చాటిన బుద్ధం శరణం గచ్చామి అని శాంతి ఎల్లెడెలా వినపడ్డ నేల అది. దానవులపాడు వద్ద పురాతన జైన దేవాలయ శిధిలాల ఉన్నాయి పోయి చూసుకో.
తెనుగు మొట్టమొదటి శాసనం కలమళ్ల అక్కడే దొరికింది తెలుసుకోండి ఉత్తర్.. వాళ్ళ బానిసలూ…
గండికోట నాయకుల పౌరుషం తెలుసుకో, రాయచూరుని గెలిచిన రామలింగానాయకుని ప్రతాపం, ఎందరో నాయకుల వీరత్వం వింటే వణుకువచ్చి అహ్మదాబాద్ పారిపోయి దాక్కునే బాచ్, చరిత్ర పోయి చదువుకో..

స్నేహానికి ప్రాణం ఇచ్చే బాచ్..కానీ తేడా వస్తే నిజాం నవాబు లాంటి ఘనత వహించినవాళ్ళు కడప నవాబు చేతుల్లో రాయచోటి వద్ద ఎలా హతం అయ్యారో ప్లాష్ బాక్ వేసుకుని చూడు.
రాయలసీమ నడిబొడ్డున చెయ్యేరు,పాపాగ్ని, కుందేరు, పెన్నా నదుల పరివాహక ప్రాంతంలో విలసిల్లిన ఆ కడపలో నాగరికత నీకు తెలుసా? ఎవరో కొంతమంది ఫ్యాక్షన్ బాచ్ ఉంటే ముప్పై లక్షలమంది ప్రజలకు అంటగట్టే దుర్భుద్ధి ఎందుకు? అది ఒంటిమిట్ట లాంటి ఎన్నో దివ్యక్షేత్రాలున్న పుణ్యభూమి . తాళ్ళపాక అన్నమాచార్యుడు నడయాడిన నేల, కడప సూఫీ దర్గా పోయి వచ్చారుగా మీ వాళ్ళు అప్పుడు తెలవలేదా గొప్పదనం. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మీకు పట్టబోయేగతి ముందే వ్రాసి ఉంటారు.

రామాయణం అంటారుగా.. మొల్ల రామాయణం చదివారా? మొల్ల, అష్టదిగ్గజ పెద్ద అల్లసాని పెద్దన అక్కడివారే తెలుసా.. ఓ ఆర్య పక్ష బానిసలూ.. కన్నాంబ, పద్మనాభం, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతలు బి.యన్ రెడ్డి, బి.నాగిరెడ్డి గార్లే కాదు రిజర్వుబ్యాంక్ గవర్నర్ వైవి రెడ్డి గారు, దేశంలో తెలుగువాళ్లల్లో ఒకే ఒక్క CWC చైర్మన్ అయిన DS గారు ఇంకా ఎందరో మహోన్నతులు పుట్టిన గడ్డ అది.
అన్నట్లు వేమన… మన తెలుగుజాతికి గర్వకారణం, ఆయనెవరో ఈ వేలిముద్ర బాచ్ విని ఉండరు. విని ఉంటే ఇలా మాట్లాడరు.

అయినా మళ్ళా రాష్ట్రాన్ని 3 ముక్కలుగా విద్వేషాలు రెచ్చగొట్టి చీల్చే దీర్ఘ ఆలోచనతో, నాలుగైదు ముక్కలైన తెలుగుజాతిని అహ్మదాబాద్ నుంచి తేలిగ్గా ఏలొచ్చనే కుట్రతో ఇలా రెచ్చగొట్టేటట్లు

మాట్లాడారేమో కొందరు? ఉభాజపాస్ ను తక్కువ అంచనా వేయొద్దు.ఆంధ్రుల, తెలుగుజాతి 13 కోట్లమంది హక్కులు, ఆత్మగౌరవం కోసం కచ్చితంగా మేము నిలబడతాము, తెలుగుజాతి నాది, నిండుగా వెలుగుజాతి నాది.

– చలసాని

Leave a Reply