ముఖ్యమంత్రి కేంద్ర క్రీడాశాఖా మంత్రిని ఎందుకు కలిశారు?

Spread the love

– సంక్రాంతికి పేకాట, గుండాట వంటి జూద క్రీడలకు అనుమతి ఇవ్వాలని కోరారా?
– వైసీపీ నేతల ఆధ్వర్యంలో నడుస్తున్న ‎పేకాట శిబిరాలకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆడేవారిని అనుమతించాలని కోరారా?
– తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాశ్

రాష్ట్రంలో క్రీడలను, క్రీడాకారులనుప్రోత్సహించకుడా క్రీడారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కేంద్ర క్రీడాశాఖ మంత్రితో ఎందుకు భేటీ అయ్యారో, భేటీలో ఏం చర్చించారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. సంక్రాంతికి పేకాట, గుండాట వంటి జూద క్రీడలకు అనుమతి ఇవ్వాలని కోరారా? లేక రాష్ట్రంలో వైసీపీ నేతల ఆధ్వర్యంలో నడుస్తున్న ‎ పేకాట శిబిరాలకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆడేవారిని అనుమతించాలని అనుమతి కోరారా?

ఏపీలో క్రీడారంగాన్ని ఏం అభివృద్ది చేశారని కేంద్రమంత్రిని కలుస్తారు? జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి 3 ఏళ్లు కావొస్తోంది, రాష్ట్రంలో ఎన్ని క్రీడలు నిర్వహించారు, ఎంతమంది క్రీడాకారులకు ప్రోత్సాహం అందించారో జగన్ రెడ్డి, వైసీపీ నేతలు చెప్పగలరా? టీడీపీ హయాంలో రాష్ట్రంలో జాతీయస్ధాయి క్రీడలు నిర్వహించటంతో పాటు క్రీడాకారులను అన్నివిధాల ప్రోత్సహించాం. నియోజకవర్గానికో మినీ స్టేడియం నిర్మాణానికి శ్రీకారం చుట్టాం.

కానీ జగన్ రెడ్డి మాత్రం ‎రెడ్డి మాత్రం ‎రాష్ట్రంలో పేకాట, గుండాట వంటి జూడ క్రీడలను ప్రోత్సహిస్తూ రాష్ట్రాన్ని జూధాంద్రప్రదేశ్ గా మార్చారు. వైసీపీ మంత్రులు, వైసీపీ నేతల ఆధ్వర్యంలోనే రాష్ట్రంలో విచ్చలవిడిగా పేకాట శిబిరాలు నడుస్తున్నాయి. క్రీడాకారులంటే పేకాట ఆడేవారేనని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అనుకుంటున్నారు. అందుకే అసలైన క్రీడాకారులను వదిలేసి పేకాట ఆడేవారిపై కేసులు లేకుండా చూస్తూ వారిని ప్రోత్సహిస్తున్నారు.

Leave a Reply