మమ్మల్ని అరెస్ట్ చేయాల్సిన అవసరమేంటి..?

– మాజీ మంత్రి ఎన్.అమర్నాథ్ రెడ్డి
పోలీసుల తీరుపై మాజీ మంత్రిఎన్.అమర్నాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.కుప్పంలో వైకాపా నేతలు పర్యటిస్తే అడ్డగించని పోలీసులు.. తమను ఎందుకు అరెస్టులు చేస్తున్నారని ప్రశ్నించారు. ఎన్నికలు సజావుగా నిర్వహించే బాధ్యత అధికారులపై ఉందని తెదేపా నేత అమర్నాథ్ రెడ్డి అన్నారు.
కుప్పం తెదేపా కార్యాలయానికి వచ్చిన ఆయన.. మీడియాతో మాట్లాడారు. వైకాపా నాయకులు కుప్పంలో తిరుగుతున్నారని.. స్థానికులైన మేము ఇక్కడ తిరిగితే తప్పేంటని? ప్రశ్నించారు.తమను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటని..? నిలదీశారు.కుప్పంలో వైకాపా నేతలు భయానకరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
“కుప్పంలో వైకాపా నేతలు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. అదే మేం వెళ్తే అరెస్టులు చేస్తున్నారు. మమల్ని అరెస్ట్ చేయాల్సిన అవసరమేంటి..? ఒక మున్సిపల్ ఎన్నిక కోసం ప్రభుత్వం.. ఇలాంటి వాతావరణం


సృష్టిస్తుందంటే.. రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో ప్రజలు గమనించారు. ఎన్నో సంవత్సరాలుగా చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.. కానీ ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదు” అని అమర్నాథ్ రెడ్డి అన్నారు.

Leave a Reply