-చెల్లి భర్తపై హత్యానేరం మోపిన జగన్ రెడ్డి ప్రజలకు రక్షణ కల్పిస్తాడా?
-మూడు రాజధానులంటే మూడు చోట్ల కాపురం పెట్టడమా?
-పొలిటికల్ లాబీయిస్ట్ విజయ్ కుమార్ చెప్పాడా?
-లేక విశాఖ శారదా పీఠం స్వరూపానంద ముహూర్తం పెట్టాడా?
-వివేకా హత్య కేసు వెబ్ సిరీస్ ను తలపిస్తోంది. నెట్ ఫ్లెక్స్, జీ 5, ప్రైమ్ కూడా వీరి ముందు దిగదుడుపే
-అవినాష్ రెడ్డి ఘటనాస్థలంలో రక్తపు మరకలు ఎందుకు తుడిచినట్టు?
-వివేకా హత్య కేసులో జగన్ అండ్ కో నటన ఆస్కార్ ను మించిపోయింది
-టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ
మూడు రాజధానులంటే మూడు చోట్ల కాపురం పెట్టడమా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. నేడు శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్భంగా ఈ ఏడాది సెప్టెంబర్ లో విశాఖ వచ్చి కాపురం ఉంటానని ముఖ్యమంత్రి చెప్పారు. విశాఖలో కాపురం పెట్టమని మొన్న తాడేపల్లి ప్యాలెస్ వచ్చిన సందర్భంగా పొలిటికల్ లాబీయిస్ట్ విజయ్ కుమార్ చెప్పాడా? లేక విశాఖ శారదా పీఠం స్వరూపానంద ముహూర్తం పెట్టాడా?
రాయలసీమలో కాపురం పెట్టి ఇడుపులడలపాయలో అసైన్డ్ భూములు కొట్టేశారు. అమరావతిలో కాపురం పెట్టి రాజధాని రైతులను రోడ్డున పడేశారు. అమరావతిని పూర్తిగా నాశనం చేశారు. భూములిచ్చిన రైతులను క్షోభ పెట్టారు. విశాఖ వెళ్లకముందే విజయసాయి, వైవీ సుబ్బారెడ్డిని అక్కడికి పంపారు. రూ. 40 వేల కోట్ల విలువైన భూములు కబ్జా చేసేశారు. ఋషికొండ ను బోడిగుండు చేసేసి రేపు సెప్టెంబర్ లో అక్కడ కాపురానికి వెళతారా? వికేంద్రీకరణ అంటే మూడుచోట్ల కాపురం పెట్టడమా జగన్ రెడ్డీ? నాలుగేళ్ల వైసీపీ పాలనలో విధ్వంసం, కబ్జాలు మినహా ఏం లేదు. ఏపీకి ఏకైక రాజధాని అమరావతి అని జగన్ తన నోటి వెంటే చెప్పే రోజు దగ్గర్లోనే ఉంది. ఒక వేళ జగన్ చెప్పకపోయినా ప్రజలే చెప్పిస్తారు.
ఒక హత్య-లక్ష అబద్ధాలతో కాలం గడపడం మినహా ఈ నాలుగేళ్లలో రాష్ట్రానికి జగన్ రెడ్డి చేసిందేంటి? వివేకా హత్య కేసు వెబ్ సిరీస్ ను తలపిస్తోంది. నెట్ ఫ్లెక్స్, జీ 5, ప్రైమ్ కూడా వీరి ముందు దిగదుడుపే.
వివేకా హత్య కేసులో జగన్ అండ్ కో నటన ఆస్కార్ ను మించిపోయింది. వైఎస్ వివేకా హత్య కేసులో అన్ని వేళ్లూ తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపిస్తున్నాయ్. ముందు గుండెపోటు అన్నారు. ఆ తర్వాత గొడ్డలిపోటు అన్నారు. ఆ గొడ్డలి టీడీపీదన్నారు. బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి హస్తం ఉందన్నారు. నారాసుర రక్తచరిత్ర పేరుతో పుస్తకాలు వదిలారు.
విపక్షంలో సీబీఐ విచారణ కావాలన్న జగన్ అధికారంలోకి రాగానే సీబీఐ విచారణ అవసరం లేదన్నారు. వివేకా హత్యలో ఆయన కూతురు సునీత హస్తం ఉందన్నారు. వివేకా రెండో భార్యే హత్య చేయించిందన్నారు. సునీల్ యాదవ్ తల్లికి, వివేకాకు సంబంధం ఉందన్నారు. వివేకా హత్య జరిగినప్పుడు ఎంపీ అవినాష్ రెడ్డి జమ్మలమడుగులో ఉన్నాడన్నారు. వివేకానంద రెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణలో ఆయన్ను పొగిడారు. ఇప్పుడేమో ఆయన్ను దుమ్మెత్తిపోస్తున్నారు.
జగన్ డ్రామా కంపెనీని ఏమనాలి? ఒక కన్ను మరో కన్నును పొడుచుకుంటుందా అంటూ అసెంబ్లీలో నంగనాచి కబుర్లు చెప్పిన సీఎం జగన్ ఎందుకు భయపడున్నారు? హత్య కేసులో అన్ని వేళ్లూ తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపిస్తున్నాయి. జగన్ రెడ్డి అనుమతి లేకుండా హత్య సాధ్యమా? పిన్నమ్మ తాళి తెంచిన జగన్ రెడ్డి ఏపీ ప్రజలకు న్యాయం చేస్తాడా?చెల్లి భర్తపై హత్యానేరం మోపిన జగన్ రెడ్డి ప్రజలకు రక్షణ కల్పిస్తాడా? కుటుంబసభ్యులనే దారుణంగా మోసం చేసిన జగన్ రెడ్డి పాలనలో సామాన్యుల పరిస్థితేంటి?
హత్య చేయలేదని చెబుతున్న అవినాష్ రెడ్డి ఘటనాస్థలంలో రక్తపు మరకలు ఎందుకు తుడిచినట్టు? ఇంత దారుణమైన అబద్ధాలు ఎవరూ మాట్లాడరు. హత్యలు చేయడమేంటి? జగన్ రెడ్డి నేరచరిత్ర చూసి ప్రజలు భయపడిపోతున్నారు. దోషులెవరో నిగ్గుతేల్చాన్సిన అవసరం ఉంది. సునీతకు న్యాయం జరుగుతుందని, కోర్టులు న్యాయం చేస్తాయని నమ్ముతున్నాం.