మణిపూర్ రావణకాష్టం చల్లారేనా?

Spread the love

రిజర్వ్‌డ్, రక్షిత అడవులు, చిత్తడి నేలలకు సంబంధించి మణిపూర్‌లోని బీజేపీ ప్రభుత్వం చేసిన సర్వేపై ఆదివాసీ గిరిజనులు తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం చర్చిలను కూల్చివేస్తోందని గిరిజన సంఘం ఆరోపిస్తున్నాయి. ఇదే సమయంలో మణిపూర్ జనాభాలో కీలకంగా ఉన్న మైతీలకు ఎస్టీ హోదాపై కోర్టు జారీచేసిన ఉత్తర్వులు వివాదానికి మరంత ఆజ్యం పోశాయి.

దీంతో ఎనిమిది జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారి ఎక్కడికక్కడ హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. బుధవారం చురచంద్పుర్ జిల్లా టోర్బంగ్ ప్రాంతంలో గిరిజన విద్యార్థుల సంఘం ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్ (ఏటీఎస్యూఎం) భారీ ర్యాలీ చేపట్టింది. ఇంఫాల్ లోయలో అధిక సంఖ్యలో ఉండే మైతీ సామాజిక వర్గం తమను ఎస్టీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తోంది.

దీనిని వ్యతిరేకిస్తూ ఏటీఎస్యూఎం నిరసన ప్రదర్శన చేపట్టింది. ఈ ఆందోళనకు వేలాది మంది గిరిజనులు హాజరయ్యారు. ఈ ర్యాలీలో.. గిరిజనులు, గిరిజనేతరుల మధ్య ఘర్షణలు చెలరేగి తీవ్రరూపు దాల్చాయి. వీటిని అదుపు చేసేందుకు పోలీసులు బాష్పవాయువు గోళాలు ప్రయోగించారు.మణిపూర్ జనాభాలో 53 శాతం ఉన్న ప్రధానంగా మణిపూర్ లోయలో నివసించే మెయిటీ కమ్యూనిటీని ఎస్టీ జాబితాలో చేర్చాలనే డిమాండ్ అశాంతిని నెలకొల్పింది.

కానీ అది కారణం మాత్రమే. అంతర్లీనంగా ఉన్న కోపం, చాలా కాలం పాటు తెగల మధ్య వైరుధ్యాలు అన్నీ కలసి మణిపూర్ లో రావణకాష్టనికి దారితీసింది. మండిపడటానికి ఇతర కారణాలున్నాయి. ఇవి రాష్ట్రంలోని కొండ ప్రాంతాలలో రిజర్వ్ చేయబడిన రక్షిత అడవులపై ప్రభుత్వం యొక్క నిర్బంధానికి మాత్రమే కాకుండా, కుకీల హింసకు గురవుతున్న భావనతో కూడా ముడిపడి ఉంది. మయన్మార్‌లోని సరిహద్దుకు ఆవల ఉన్న ఒకే జాతికి చెందిన అనేక మంది చిన్‌లు, హింస హింస నుండి పారిపోతూ భారతదేశంలోకి ప్రవేశించారు .

అక్రమ వలసదారులు అని పిలవబడే వారిపై ప్రభుత్వం యొక్క కఠినమైన వైఖరి కుకీలకు కోపం తెప్పించింది, వారి బంధువులు.మణిపూర్‌లోని కొండల్లోని రిజర్వ్‌డ్ మరియు రక్షిత అటవీ ప్రాంతాలను గిరిజన సంఘాలు ఆక్రమించడాన్ని వ్యతిరేకిస్తూ బిజెపి ముఖ్యమంత్రి యొక్క కఠినమైన వైఖరి వివిధ కారణాల వల్ల వచ్చింది, కొండల్లోని అనేక ఎకరాల భూములు గసగసాల సాగుకు ఉపయోగించబడుతున్నాయి.

మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా జరిగే యుద్ధంలో భాగంగా అటవీ ప్రాంతాలపై దాని అణిచివేతను ప్రభుత్వం చూస్తుంది, అయితే కుకి ప్రజలందరికీ వ్యతిరేకంగా “డ్రగ్ లార్డ్స్” అనే పదాన్ని ఉపయోగించడాన్ని కూడా తప్పుబట్టింది.రెండవది, మణిపూర్‌లో భూమిపై తీవ్రమైన ఒత్తిడి ఉంది. గిరిజన గ్రామాలలో జనాభా పెరగడంతో, వారు తమ చారిత్రక మరియు పూర్వీకుల హక్కుగా భావించే చుట్టుపక్కల అటవీ ప్రాంతాలకు వ్యాపిస్తున్నారు. దీన్ని ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది.

అదే సమయంలో, లోయలలో నివసించే మెయిటీలు, కొండ ప్రాంతాలలో స్థిరపడటానికి లేదా భూమిని కొనుగోలు చేయడానికి అనుమతించనందున కోపంతో ఉన్నారు, గిరిజన ప్రజలు లోయలలో భూమిని కొనుగోలు చేయవచ్చు.కొత్త గ్రామాలను ఎలా గుర్తించాలనే దానిపై ప్రభుత్వానికి అసలు విధానం లేదు. అలాగే మణిపూర్‌లో పారదర్శకమైన అటవీ విధానం లేదు.

దీంతో సొంత పార్టీలోనే దుమారం రేగింది.మణిపూర్‌లో గిరిజనులు, గిరజనేతురల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణల్లో మృతుల సంఖ్యపై అధికారులు తొలిసారిగా ప్రకటన చేశారు. ఈ హింసలో 54 మంది మృతి చెందినట్టు తెలిపారు. అయితే, అనధికారిక వర్గాల ప్రకారం ఈ సంఖ్య 100కిపైగా ఉంటుందని తెలుస్తోంది. ఘర్షణలో దాదాపు 200 మందికి పైగా గాయపడినట్టు పేర్కొంటున్నాయి.

కాగా, చురచందాపూర్ జిల్లా మోర్గే ఆస్పత్రిలో 16, తూర్పు ఇంఫాల్ జిల్లా జవహర్‌లాల్ నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో 15 మృతదేహాలను భద్రపరిచారు. ఆర్మీ, అస్సాం రైఫిల్స్ పహారా మధ్య ఇంఫాల్‌ లోయలో జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంటోంది.

శనివారం మార్కెట్లు, దుకాణాలు తెరచుకున్నాయి. భారీస్థాయిలో రంగంలోకి దిగిన కేంద్ర బలగాలు ప్రధాన రహదారులు, కీలక ప్రాంతాల్లో మోహరించాయి. ఇంఫాల్‌ లోయలోని తిరుగుబాటుదారులు శిబిరాల్లో చేరితే మైతీ, గిరిజన వర్గాల మధ్య పూర్తిస్థాయి సాయుధ పోరాటంగా సంక్షోభం తీవ్రరూపం దాల్చుతుందనే భయాల మధ్య సైన్యం, అస్సాం రైఫిల్స్ ఫ్లాగ్ మార్చ్‌లను కొనసాగించడంతో శనివారం కొంత సాధారణ స్థితి తిరిగి వచ్చింది.

ఇదే సమయంలో భారత్-మయన్మార్ సరిహద్దుల్లో అస్థిర పరిస్థితి నెలకొంది. మణిపూర్‌లో సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి జరుగుతున్న ప్రయత్నాలకు ఇది హానికరం అని భద్రతా వర్గాలు వెల్లడించాయి. బుధవారం నుంచి ఉద్రిక్తంగా మారిన మణిపూర్‌లో 10 వేల మంది సైన్యం, పారామిలిటరీ బలగాలతో పహారా కాస్తున్నారు. ఇప్పటివరకు 13వేల మందిని శిబిరాలకు తరలించినట్లు రక్షణశాఖ ప్రతినిధి వెల్లడించారు.

మరోవైపు, ప్రజలు శాంతిని పాటించాలని కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు విజ్ఞప్తి చేశారు. జాతుల మధ్య చర్చలు జరగాలని ఆయన పిలుపునిచ్చారు. ‘‘చాలామంది చనిపోయారు.. ఆస్తులకు భారీ నష్టం కలిగింది. మైతీలైనా, కుకీలైనా అందరూ ఒకే రాష్ట్రానికి చెందిన వారు. శాంతి నెలకొంటేనే సమాజం ముందుకు సాగుతుంది.

ఇదే సమయంలో శుక్రవారం రాత్రి జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఐదుగురు మిలిటెంట్లు హతమయ్యారని, ఇద్దరు జవాన్లు గాయపడ్డారని అధికారులు తెలిపారు.

తమను షెడ్యూల్డ్‌ తెగ (ఎస్టీ)లో చేర్చాలన్న మైతీల డిమాండుకు అనుకూలంగా నాలుగు వారాల్లో కేంద్రానికి సిఫార్సు చేయాలని రాష్ట్రప్రభుత్వాన్ని మణిపూర్ హైకోర్టు ఆదేశించడంతో హింస చెలరేగింది. మైతీల డిమాండును మైనారిటీలైన కుకీ, నాగా గిరిజనులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. హైకోర్టు ఆదేశాల అనంతరం గిరిజన సంఘాలు నిర్వహించిన ర్యాలీలో ఘర్షణ చెలరేగింది.

రెండు వర్గాలు దాడులు, ప్రతిదాడులు చేసుకోవడంతో రాష్ట్రం అట్టుడికిపోయింది. మరోవైపు, మణిపూర్‌లో చిక్కుకున్న తమ పౌరులను తరలించేందుకు విమానాలు నడపాలంటూ తాము చేసిన విజ్ఞప్తిని కేంద్రం తిరస్కరించిందని మిజోరాం అధికారి ఒకరు తెలిపారు. దీనిపై కేంద్రం ఇంకా స్పందించలేదు.

డాక్టర్ యం.సురేష్ బాబు, అధ్యక్షులు, ప్రజా సైన్స్ వేదిక

Leave a Reply