Suryaa.co.in

Andhra Pradesh

మంత్రి కేసులోని సాక్ష్యాలు కోర్టునుంచే మాయమైతే ముఖ్యమంత్రి స్పందించరా?

– వైసీపీలో నేరారోపణలు ఎదుర్కొంటూ,న్యాయస్థానాల్లో విచారణకు హాజరవుతున్నవారంతా కాకాణి గోవర్థన్ రెడ్డి మాదిరే కోర్టు తలుపులు పగలగొట్టాలన్నది ముఖ్యమంత్రి ఉద్దేశమా?

• బాబాయ్ హత్య కేసులో మాదిరి, నెల్లూరుకోర్టులో జరిగిన చోరీకేసులో కూడా అనామకుల్ని అరెస్ట్ చేసి, అసలు దోషుల్ని తప్పించాలని చూస్తున్నారు
• నెల్లూరు ఘటనపై ప్రభుత్వం, ముఖ్యమంత్రి స్పందించి, దోషులను శిక్షించకుంటే, తమనాయకుడు తమకు మార్గంచూపాడన్న అత్యుత్సాహంతో, భవిష్యత్ లో వైసీపీ గూండాలు, రౌడీలు, ఏకంగా సుప్రీంకోర్టుపై కూడా దాడి చేస్తారు
• జరిగినఘటనపై ముఖ్యమంత్రి తక్షణమే స్పందించాలి. కాకాణి గోవర్థన్ రెడ్డిని ఎమ్మెల్యే పదవినుంచి తప్పించి, మంత్రివర్గంనుంచి బర్తరఫ్ చేయాలి
• రాష్ట్ర హైకోర్ట్ నెల్లూరులో జరిగినఘటనను సుమోటాగా విచారణజరిపి, అసలు దోషులను శిక్షించి, ప్రజల్లో న్యాయవ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని రెట్టింపు చేయాలి
– టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీ.వీ.రెడ్డి

ఇళ్లల్లో, బ్యాంకుల్లో, గుళ్లల్లో దొంగలపడటం ఇప్పటివరకుచూశామని, కానీ ఏకంగా నెల్లూరు లో న్యాయాన్ని దొంగిలించినఘటన యావత్ దేశాన్నే నిర్ఘాంతపోయేలా చేసిందని, ఇప్పుడు జగన్ కేబినెట్లో మంత్రిగాఉన్న కాకాణిగోవర్థన్ రెడ్డి, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై అవినీతిఆరోపణలు చేశాడని, సోమిరెడ్డి 1000కోట్లవరకు సింగపూర్ లో దాచాడని దుష్ప్రచారం చేశాడని, కాకాణి ఆరోపణలపై సోమిరెడ్డి 2016లో కేసువేయడం జరిగిందని, టీడీపీ జాతీయ అధికారప్రతినిధి జీ.వీ.రెడ్డి పేర్కొన్నారు.

శనివారం ఆయన జూమ్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

కాకాణి గోవర్థన్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై చేసిన నిరాధార ఆరోపణలకు సంబం ధించి తప్పుడు ఆధారాలు సృష్టించారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రూ.1000కోట్లు సింగపూర్ లోదాచాడని, అందుకోసం ఆయన సింగపూర్ వెళ్లొచ్చాడనిచెబుతూ, నకిలీ పత్రాలు సృష్టించడమేకాకుండా, ఏకంగా నకిలీ విమానటిక్కెట్లు కూడా తయారుచేసి, టీడీపీసీనియర్ నేతపై బురదజల్లడానికి ప్రయత్నించారు.

తనపరువుకి భంగంకలిగించారని సోమిరెడ్డి కేసుపెట్టగా, దానిపై విచారణ జరిపినపోలీసులు కాకాణి చూపిన ఆధారాలను స్వాధీనంచేసుకొని విచారించగా ఆయన బయటపెట్టిన పత్రాలన్నీ నకిలీవని, ఆధారాలు కూడా కల్పితమైనవేనని నిర్ధారించారు. దానిపై పోలీస్ వారు అప్పుడే ఛార్జ్ షీట్ వేసి, సదరు కేసులో కాకాణిగోవర్థన్ రెడ్డిని ఏ1గా చేర్చారు. పోలీస్ వారు సేకరించిన ఆధారాలు, ఇతరత్రా సమాచారం అంతా కోర్టులో ఉంది. వాటిని తిరస్కరించడానికి నెల్లూరు కోర్టులో దొంగలు పడ్డా రు.

ఏ1గా ఉన్న కాకాణి గోవర్థన్ రెడ్డి ఇటీవలే మంత్రిగా ఎన్నికయ్యారు. ఆయనప్రధాన నిం దితుడిగా ఉన్న కేసు విచారణ రెండునెలలో నెల్లూరున్యాయస్థానంలోవిచారణకు రాబోతోంది. గతంలో సోమిరెడ్డిపై చేసిన నిరాధారఆరోపణల కేసులో తాను దోషినని తేలితే, తనమంత్రి పదవిపోతుందని భయపడే కాకాణి ఈ చర్యకు ఒడిగట్టాడు.
కాకాణి వంటివ్యక్తికి మంత్రి పద వి ఎందుకు ఇచ్చారని ప్రజలు ఎక్కడతనను నిలదీస్తారోనన్న భయంతో, ముఖ్యమంత్రి జగన్మో హన్ రెడ్డి కూడా సాక్ష్యాలదొంగతనానికి సహకరించాడని బహిరంగంగానే చెప్పుకుంటున్నా రు. తన, పర బేధం లేకుండా తప్పుచేసిన వారందరినీ శిక్షిస్తానని చెప్పడం జగన్మోహన్ రెడ్డికి ఫ్యాషన్ గా మారింది. ముఖ్యమంత్రి మాటలు ఒకలా ఉంటే, చేతలు మరోలాఉంటున్నా యి అనడానికి ఇలాంటి అనేకఘటనలను ఉదాహరణలుగాచెప్పవచ్చు.

న్యాయాన్ని దొంగలించేందుకు ఏకంగా కోర్టులోనే దొంగలుపడటం ఏనాడైనా, ఎక్కడైనా జరిగిందా? కాకాణి గోవర్థన్ రెడ్డిపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పెట్టినకేసే కాకుండా, ఆయన 2014లో ఎన్నికలసంఘానికి సమర్పించిన అఫిడవిట్ పరిశీలిస్తే, ఆయనపై దాదాపు 25 వరకు కేసులున్నాయి. అన్నికేసులున్నాయనే ముఖ్యమంత్రి కాకాణిని మంత్రివర్గంలోకి తీసుకున్నాడా? కాకాణి లాంటివ్యక్తిని మంత్రివర్గంలోకి తీసుకోవడం ముఖ్యమంత్రి చేసిన మొదటితప్పైతే, ఆయన్ని కాపాడటానికి ఏకంగా కోర్టులోనే దొంగలు పడేలా చేయడం జగన్మో హన్ రెడ్డి చేయించిన రెండో తప్పు.

నిజంగా కోర్టులో దొంగలుపడితే, అన్నికేసులకు సంబంధిం చిన పత్రాలు, సాక్ష్యాలు మాయంకావాలి. కానీ కాకాణిగోవర్థన్ రెడ్డికేసుకు సంబంధించిన పత్రాలు…అదీకూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కాకాణిపై వేసిన కేసుకు సంబంధించిన పత్రాలు మాయంకావడమే ఇక్కడ ప్రధానాంశం. కాకాణి గోవర్థన్ రెడ్డి, గతంలో కావాలనే సోమిరెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేశాడు. దానికి ప్రతిఫలంగా కోర్టులో విచారణ ఎదుర్కోబో తున్నాడు. ఈ నేపథ్యంలో ఏకంగా కోర్టుతలుపులు పగలగొట్టి, ఏకంగా సాక్ష్యాలనే మాయం చేశారు.

అదికూడా కాకాణి మంత్రిగా బాధ్యతలు చేపట్టిసరిగ్గా వారంరోజులుకూడా కాకముందే ఈ ఘటన జరగడంమరింత దారుణం. తానుఏ1 గాఉన్న కేసుతాలూకా సాక్ష్యాలు, ఇతర ఆధారాలు మాయమయ్యాయని తెలిసినాకూడా మంత్రి కాకాణి నోరుమెదపలేదు. ఎక్కడిక్క డ చేయాల్సినవన్నీచేయిస్తూ తేలుకుట్టిన దొంగల్లా మిన్నకుండిపోవడం వైసీపీనేతలకు, మంత్రులకు, ముఖ్యమంత్రికి బాగా అలవాటైంది.

నెల్లూరులో న్యాయం చోరీకి గురైన ఘటన పై ఈ ప్రభుత్వం ఇప్పటికే స్పందించి ఉండాల్సింది. కానీ చిత్తశుద్ధిలేని ప్రభుత్వం, చిత్తశుద్ధి లేని నాయకుడుకాబట్టి ఇంతవరకుస్పందించలేదు. ముఖ్యమంత్రి నిజంగా నిజాయితీపరుడు, తప్పుచేసినవారిని శిక్షించేవాడే అయితే, కాకాణిదోషిగా ఉన్నకేసులోని సాక్ష్యాలు మాయమైనవెంటనే గోవర్థన్ రెడ్డిని మంత్రిపదవినుంచి బర్తరఫ్ చేసిఉండేవాడు. ఆ పనిచేయలేదంటేనే అర్థమవుతోంది..

యథానాయకుడు…తథా మంత్రులని. కాకాణి గోవర్థన్ రెడ్డిని మంత్రిపదవినుంచి తొలగించకుండా, విచారణ పేరుతో కాలయాపన చేసి, రెండేళ్లపాటుసాగదీస్తే, ఈలోగా ప్రభుత్వకాలపరిమితి అయిపోతుందని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. చోరీఘటనలో ఎవరో దారినపోయే అనామకుల్ని అరెస్ట్ చేసి, పోలీసులతో డ్రామాలు ఆడించి, అసలుదోషులను కాపాడాలని ప్రభుత్వం చూస్తోంది.

కాకాణిని కాపాడటానికి నేడు నెల్లూరుకోర్టు తలుపులుపగలగొట్టినవారు, రేపు సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డి కేసులవిచారణసాగితే దేశఅత్యున్నతన్యాయస్థానం తలుపులు పగలగొట్టర ని గ్యారంటీఏమీలేదుకదా! అధికారంలోఉన్నామన్న అహంకారంతో ఇంతటి దారుణాలకు ఒడిగడతారా? ముఖ్యమంత్రి స్థానంలోఉన్న వ్యక్తి ఇలాంటిఘటనపై స్పందించకపోవడం దారుణం. డీజీపీగాఉన్నవ్యక్తి నెల్లూరుచోరీ ఘటనపై ఎందుకు ఇప్పటివరకుస్పందించలేదు.

కోర్టు తలుపులు పగలగొట్టి, సాక్ష్యాధారాలు మాయంచేశారంటే రాష్ట్రంలో న్యాయవ్యవస్థకు , న్యాయమూర్తులకురక్షణ ఎక్కడుందని ప్రశ్నిస్తున్నాం. ఇలాంటిఘటనలతో రాష్ట్రంలో ఎవరికై నా న్యాయంజరుగుతుందా? జరుగుతుందని, దోషులనుశిక్షిస్తామని ముఖ్యమంత్రి ప్రజలకు హామీఇవ్వగలడా? ఇచ్చినకూడా అది ఎన్నికలహామీల్లానే ఉత్తుత్తిహామీగానే మిగిలిపోతుం ది తప్ప…నెరవేరదనికచ్చితంగా చెప్పగలం.

నెల్లూరు చోరి ఘటన సాదాసీదా విషయంకాదు. చాలాచాలా దారుణమైంది. వైసీపీలో 150 మంది ఎమ్మెల్యేలుగా ఉంటే, వారిలో దాదాపు 80మందిపై అనేకకేసులున్నాయి. చాలామం దికాకాణిగోవర్థన్ రెడ్డిలానే న్యాయస్థానాల్లో విచారణఎదుర్కొంటున్నారు. వారందరికీ కూడా ముఖ్యమంత్రి నెల్లూరులోచేసినట్టే న్యాయస్థానాల తలుపులుపగలగొట్టి, అడ్డొచ్చిన వారిపై దాడిచేసి సాక్ష్యాలుఎత్తుకురమ్మని చెప్పాలనుకుంటున్నారా? జరిగిన ఘటనలు చూస్తుంటే, ముఖ్యమంత్రి ఉద్దేశం అదే అనిపిస్తోంది.

న్యాయస్థానంలో సాక్ష్యాలు చోరీకి గురైన ఘటనపై ముఖ్యమంత్రి వెంటనే చర్యలు తీసుకోవాలి. కాకాణిగోవర్థన్ రెడ్డిని ఎమ్మెల్యేపదవినుంచి తొలగించడమేకాకుండా మంత్రివర్గంనుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కాకాణి కి తెలియకుండా, ఆయన ప్రమేయంలేకుండా న్యాయస్థానంలోని సాక్ష్యాధారాలు మాయమ య్యాయంటే ముఖ్యమంత్రి నమ్ముతారా? ప్రజలైతే అస్సలు నమ్మడంలేదు.

కాకాణి గోవర్థన్ రెడ్డిపై వ్యక్తిగతంగా తమకేమీకోపంలేదు. ముఖ్యమంత్రి ఈ ఘటనలో అసలుదోషులను శిక్షిం చకపోతే, భవిష్యత్ లో నెల్లూరుఘటనను స్ఫూర్తిగా తీసుకొని అనేకచోట్ల మరిన్ని ఘటనలు పునరావృతమవుతాయి. రాష్ట్ర హైకోర్టు కూడా ఈ ఘటనను సుమోటాగా విచారణకు తీసుకొ ని, అసలుదోషులను, వారికి సహకరించినవారిని…వారిని వెనకుండినడిపించిన వారిని కఠినంగా శిక్షించాలని వేడుకుంటున్నాం.

 

LEAVE A RESPONSE