ప్రభుత్వం దోషిగా తేలితే ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేస్తారా?

– నాటుసారా మరణాలపై తాముచెప్పేది నిజమో.. ప్రభుత్వ వాదన నిజమో తేలాలంటే తక్షణమే న్యాయవిచారణ జరిపించాలి. తాము సభలో గొంతుచించుకొని మృతులకుటుంబాలకు న్యాయంచేయాలంటుంటే ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఎందుకు పారిపోతున్నారు? నాటుసారా ఘటనపై న్యాయవిచారణలో
• 55వేల జనాభాఉన్న ప్రాంతంలో, నాటుసారా తయారీలేకపోతే 18వేల లీటర్ల సారాని అధికారులుఎలా స్వాధీనంచేసుకున్నారో ముఖ్యమంత్రి చెప్పాలి.
• సభను తప్పుదోవపట్టిస్తూ అబద్ధాలుచెప్పిన ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలంటూ సభాహక్కుల తీర్మానం కింద నోటీసు ఇస్తే, దానిపై కూడా చర్చించడానికి ప్రభుత్వం భయపడింది.
• గౌరవించాల్సిన చట్టసభల్లో ముఖ్యమంత్రి, మంత్రులే అబద్ధాలు చెప్పినందుకు నైతికబాధ్యతవహిస్తూ వారిపదవులకు రాజీనామాచేయాలి.
• జగన్మోహన్ రెడ్డి ఓదార్పుయాత్రకోసం చనిపోయిన 600మందితప్ప, రాష్ట్రంలో ఎప్పుడు…ఏకారణాలతో చనిపోయినవారివన్నీ సహజమరణాలేనా?
– ఎవరు శవరాజకీయాలు చేస్తున్నారో తేలాలంటే ముఖ్యమంత్రి తక్షణమే నాటుసారా ఘటనపై న్యాయవిచారణ జరిపించాలి : జీ.దీపక్ రెడ్డి (టీడీపీ ఎమ్మెల్సీ) 

తొలి రోజు తాము మండలిలో ఇచ్చిన వాయిదా తీర్మానం సహా, నేటివరకు మండలి లో జరిగిన అనేక అంశాలపై ప్రభుత్వం సమాధానంచెప్పకుండా ఎందుకు పారిపోతోంది? మొదటిరోజు వాయిదాతీర్మానంఇస్తే అది తెలుగుదేశంపార్టీ సృష్టించింది అన్నారు. రెండోరోజు ఇస్తే సారా మరణాలుకాదు.. సహజమరణాలని బుకాయించారు. మూడోరోజు అంటే నేడు ఇచ్చిన వాయిదాతీర్మానంపై ప్రభుత్వం అసలు సమాధానమే చెప్పే పరిస్థితిలోలేదు. నాటుసారా మరణాలపై స్పందించకుండా ప్రభుత్వం ఎందుకు భయపడుతూ… తప్పించుకుంటోంది. ఏపీబీసీఎల్ వారి నివేదికలప్రకారం గతసంవత్సరం 28వేలకోట్ల వరకు మద్యం అమ్మకాలు జరిగాయంటున్నారు.

జంగారెడ్డి గూడెం సారాఘటనలో 10 ఎఫ్ఐఆర్ కాపీలు తమవద్దఉన్నాయి…. రేపోమాపో మరికొన్ని ఎఫ్ఐఆర్ కాపీలు కూడాతీసుకొస్తాము. నాటుసారా మరణాలపై ఆర్డీవో ఇచ్చిన నివేదికకూడా తమవద్ద ఉంది. వాటిపై ప్రభుత్వం ఏంసమాధానంచెబుతుంది? ఈ అబద్ధాలప్రభుత్వం అరగంటకూడా నాటుసారా మరణాలపై మండలిలో ఎందుకు చర్చించడంలేదు? ఈ ప్రభుత్వానికి ఏమాత్రం నైతికతఉన్నా.. వెంటనే నాటుసారా మరణాలపై ఉభయసభల్లో చర్చించాలని డిమాండ్ చేస్తున్నాం. గడచిన 4రోజుల్లోనే 11వేలకేసుల వరకు నాటుసారాను స్వాధీనంచేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈనెల 14వతేదీన ఎస్ఈబీ వారు ఇచ్చిన రిపోర్ట్ లో స్వయంగా నాటుసారా తయారీ, అమ్మకందారులపై 33కేసులు నమోదుచేసి, 22మందిని అరెస్ట్ చేశామన్నారు. వారు ఇచ్చిన రిపోర్ట్ కూడా తమవద్దఉంది. ఇంతస్పష్టంగా రాష్ట్రంలో నాటుసారా తయారీ, అమ్మకాలు సాగుతున్నా ముఖ్యమంత్రి ఏమీలేదని ఎలాచెబుతారు? నాటుసారా వల్ల చనిపోయిన వారి పూర్తివివరాలు పేర్లు, ఫోన్ నంబర్లు, కుటుంబసభ్యులవివరాలు, చిరునామాలతో సహా ఇచ్చాము.

తాముచెప్పేది వాస్తవమో.. ప్రభుత్వం చెప్పేది వాస్తవమో తేలాలంటే ముఖ్యమంత్రి తక్షణమే నాటుసారా మరణాల ఘటనలపై న్యాయవిచారణకు ఆదేశించాలి. ఆపనికూడా ఎందుకు చేయలేకపోతోంది? రెండుసంవత్సరాల క్రితం ఏప్రియల్ 2020న స్వయంగా స్పీకర్ గా ఉన్న తమ్మినేని సీతారామ్ గారే రాష్ట్రంలో నాటుసారా, కల్తీమద్యం అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయన్నారు. ఆయన వ్యాఖ్యలతాలూకా వివరాలను మీడియావారు కూడా ప్రముఖంగా ప్రచురించారు. రెండేళ్లక్రితం స్పీకర్ చెప్పినా పట్టించుకోకుండా ప్రభుత్వం నిద్రపోబట్టే, నేడు జంగారెడ్డిగూడెం ఘటన జరిగింది.

మూడు రోజులనుంచీ గొంతులు పోయేట్టు తాము నాటుసారా మరణాలపై చర్చకు పట్టుబడుతుంటే, ప్రభుత్వం తమకు సమయం ఎందుకు ఇవ్వడంలేదు. తమవద్ద ఉన్న ఆధారాలు, అసలు వాస్తవాలు ప్రభుత్వానికి తెలిసే, తప్పించుకుంటోంది. జంగారెడ్డిగూడెంఘటన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నాటుసారా, ఇతరత్రా మాదకద్రవ్యాలకు సంబంధించి 1170కేసులు నమోదు చేశామని, 660మందివరకు అరెస్ట్ చేశామని స్వయంగా ఎక్సైజ్, ఎస్ఈబీ, పోలీస్ అధికారు లే చెబుతున్నారు. అధికారులు అలాచెబుతుంటే, ముఖ్యమంత్రి సహజమరణాలనిచెప్పడం సిగ్గుచేటుకాదా? ప్రజలకు వాస్తవాలు తెలియకుండా ఎన్నాళ్లు ఇలా అబద్ధాలు, అసత్యాలతో తప్పించుకోవాలనిచూస్తారు?

నాటుసారా మరణాలు సహజమరణాలైతే ఎస్ ఈబీ వారు 18,300లీటర్ల నాటుసారాను ఎక్కడినుంచి స్వాధీనంచేసుకున్నారు? : నారా లోకేశ్ (టీడీపీ ఎమ్మెల్సీ)
నాటుసారాతాగి ఆసుపత్రిలో చికిత్సపొందుతూ నిన్న గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో మరణించిన వరదరాజులు సతీమణి ఏంచెప్పిందో, ఆమె ఫిర్యాదుచేస్తే కేసు ఎందుకు నమోదు చేయడంలేదో ప్రభుత్వం చెప్పాలి? ఒక్క జంగారెడ్డిగూడెంలోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ప్రభు త్వ అండదండలతో, అధికారపార్టీ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీల సహాయసహాకారాలతోనే నాటుసా రా వ్యాపారం విజయవంతంగా వర్ధిల్లుతోంది. నాటుసారా మరణాలపై చర్చకు తాము పట్టు పట్టినప్పుడే ప్రభుత్వం చర్చించిఉంటే ఒక్కరోజుతో వాస్తవమేంటో తేలిపోయేది.

కానీ మూడు రోజులనుంచీ మమ్మల్ని సభనుంచి బయటకుపంపుతున్నారుగానీ, చర్చకు మాత్రం ముందుకురావడంలేదు. అప్పుడు ఎవరుపారిపోతున్నారో అర్థంకావడంలేదా? ప్రజాసమ స్యలపై చర్చించకుండా ప్రభుత్వం పారిపోతూ, తమను అంటేఎలా? మండలిలో గొంతులు పోయేలా తాముఅరుస్తున్నా..నాటుసారా ఘటనను ప్రభుత్వం ఎందుకు సీరియస్ గా తీసుకోదు? నాటుసారా మరణాలు సహజమరణాలని చెప్పడం సమస్యను పరిష్కరించి నట్టా.. తమసందేహాలకు క్లారిటీ ఇచ్చినట్టా? నిజంగా జరిగినవన్నీ సహజ మరణాలే అయితే పోలీసులు ఎఫ్ఐఆర్ లు ఎందుకు నమోదు చేశారు?

18,300 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. 63టన్నులవరకు నల్లబెల్లం స్వాధీనంచేసుకున్నారు. ఇప్పుడు తాముచెప్పిందంతా జంగారెడ్డిగూడెం ఎస్ఈబీ స్టేషన్ లిమిట్ లో 11వతేదీ నుంచి 14వ తేదీవరకు జరిగిన వ్యవహారమే. జంగారెడ్డిగూడెం అర్బన్ ఏరియాలో ఏంచేశామో చెబుతూ ఈ ప్రభుత్వంలోని శాఖలే ఈ వివరాలన్నీ ఇచ్చాయి. తాము ఎక్కడో తీసుకొచ్చిన సమాచా రం కాదు. తాను నియమించిన ఎస్ఈబీ విభాగంతో మాట్లాడి అసలేం జరిగిందో తెలుసుకో కుండానే ముఖ్యమంత్రి సభలో నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఆయనేంచేస్తున్నాడో ఎవరికీ తెలియదు..కనీసం ఆయనకింద ఉన్న ప్రభుత్వశాఖలు, అధికారులుఏంచేస్తున్నారో కూడా ముఖ్యమంత్రి తెలుసుకోకపోతే ఎలా?

మంత్రి ఆళ్లనాని వరదరాజులు అనేవ్యక్తి ఇతర అనారో గ్యకారణాలతో చనిపోయాడని చెప్పడం సిగ్గుచేటు. మృతుడిభార్య తనభర్త కల్తీసారా తాగే చనిపోయాడని చెప్పింది. పోస్ట్ మార్టమ్ నివేదిక కూడా అలానేఉంది. అయినాకూడా ప్రభు త్వం పచ్చిగా అబద్ధాలుచెబితే ఎలా? ఊరికే ఎవరికితోచినట్లు వారు మాట్లాడకుండా, సభలో చర్చపెడితే వాస్తవాలు ఏమిటో ప్రజలకుతెలుస్తాయిగా! పొద్దున్నలేస్తే ప్రజలను ఎలా మోసం చేయాలనే ఆలోచనలు తప్ప, ఈముఖ్యమంత్రికి మరోటిఉండదు. ఈ విషయంపై సభను తాము ప్రొలాంగ్ చేస్తున్నామనే మాట కరెక్ట్ కాదు. మృతులకుటుంబాలకు న్యాయంజరిగేవర కు ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని వదిలిపెట్టేదిలేదు. సారావల్ల మరణించినవారి కుటుంబాల కు (ఒక్కోకుటుంబానికి) రూ.25లక్షలపరిహారంఇవ్వాలి.

ఘటనపై న్యాయవిచారణ జరిపిం చాలి.. నాటుసారా మరణాలకు నైతికబాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి తనపదవికి రాజీనామా చేయాలి. ఇవన్నీ జరిగేవరకు టీడీపీ ఈఅంశంపై ఉద్యమిస్తూనే ఉంటుంది. పుష్కరాల సమ యంలో జరిగిన ఘటన ఒక యాక్సిడెంట్. దాన్ని కూడా ఈ ప్రభుత్వం రాజకీయాలకు వాడుకుంటే ఎలా? పోలవరం వద్ద బోటుప్రమాదంజరిగి దాదాపు 53మంది వరకు చనిపో యారు.. ఆబోటుకు అనుమతులిస్తూ మంత్రి అవంతి శ్రీనివాస్ స్వయంగా సంతకాలు పెట్టా రు. అదీ ఒక యాక్సిడెంట్. ఆ ఘటనకుకూడా ఈప్రభుత్వం, మంత్రి, ముఖ్యమంత్రి నైతిక బాధ్యతవహించాలని తాము అనడంలేదే ! ప్రమాదవశాత్తూ జరిగే ఘటనలపై తాము మాట్లాడటం లేదు.

కానీ జంగారెడ్డిగూడెం ఘటన ప్రభుత్వ అసమర్థత, చేతగానితనం వల్లే జరిగింది. సారామరణాలను సహజమరణాలనిచెప్పి, సభను తప్పుదోవపట్టించారు కాబట్టే, ముఖ్యమం త్రిని రాజీనామాచేయాలని డిమాండ్ చేస్తున్నాం. బీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి ఏ అంశంపైనైనా తాము చర్చకు సిద్ధమంటాడు..తీరాసభలోకి వచ్చేసరికి తమప్రశ్నలకు సమాధానంచెప్పలేక పారిపోతాడు. నాటుసారా మరణాలపై ముఖ్యమంత్రి చర్చకు సిద్ధమై తే, తాము రెడీగాఉన్నాము. ముఖ్యమంత్రి అన్నీ సహజమరణాలే అంటున్నాడు…మంత్రే మో అందరూ కాదు..కేవలంనలుగురే సారాతాగి చనిపోయాడు అంటున్నాడు.

ముఖ్యమంత్రి , మంత్రులకే ఘటనపై అవగాహనలేకపోతే ఎలా? వాలంటీర్లు, పోలీసులుఉన్నారు.. సారా ఎక్కడతయారవుతుందని జగన్మోసపురెడ్డి పెద్దపెద్ద మాటలు మాట్లాడాడుకదా… మరి 10 మంది తాలూకా ఎఫ్ఆర్ ఐల సంగతేంటి? ఎల్జీపాలిమర్స్ ఘటనజరిగినప్పుడు ఆఘమేఘా లపై విశాఖపట్నానికి వెళ్లి, కోటిపరిహారం ప్రకటించాడు. కానీ జంగారెడ్డిగూడెంలో 28మంది కల్తీసారా తాగిచనిపోతే ముఖ్యమంత్రికి మానవత్వంలేదా? మోసం చేయడంలో జగన్ రెడ్డిని మించినవారు లేరు. అసలు ఆ విద్యలో ఆయన్నిమించిన వారు దేశంలోఎవరూఉండరు.

జగన్మోసపురెడ్డి తెలివితేటలు చూడలేకే ఆయన తండ్రి, ఆయన్ని హైదరాబాద్ లో ఉంచకుం డా బెంగుళూరు పంపించాడు. ఇప్పుడు 28 మందిచనిపోయారు.. అయినాప్రభుత్వం ఘట నపై చర్చించడంలేదు. ఎంతమంది చనిపోతే ప్రభుత్వం స్పందిస్తుందని ప్రశ్నిస్తున్నాం. తాము ఇంతసీరియస్ గా మాట్లాడుతుంటే, మంత్రులేమో సభలో జోకులు వేసుకుంటు న్నారు. సాక్షిపత్రికలో నేడుకూడా ముఖ్యమంత్రిచెప్పిందే రాశారు.

Leave a Reply