Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీలోని అసమర్థ కాపు నేతలు,సిగ్గులేకుండా చంద్రబాబు గురించి మాట్లాడతారా?

– కాపుజాతికి ఏ ముఖ్యమంత్రి చేయనంతసాయం, అందించనంత చేయూత చంద్రబాబు కాపులకు ఇచ్చాడు.
– తన అధికారం చేజారిపోతోందని జగన్మోహన్ రెడ్డికి అర్థమైంది కాబట్టే, రాష్ట్రంలో కుల,మత ప్రాంతీయ విద్వేషాలకు ఆజ్యంపోస్తున్నాడు.
– టీడీపీ శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు
కాపుజాతికి ఏ ముఖ్యమంత్రి చేయనిసాయం, అందించనిభరోసా, చేయూతను చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా అం దించాడని, కాపు యువతకు ఒక్కొక్కరికి రూ.2లక్షలరుణం, కా పు కార్పొరేషన్ ఏర్పాటుచేయడం, కాపులను బీసీల్లో చేరుస్తూ జీవోఇవ్వడం వంటిచర్యలన్నీ చంద్రబాబునాయుడి హాయంలోనే జరిగాయని, అలాంటివ్యక్తిని గురించి మాట్లాడే అర్హత పేర్నినాని, కన్నబాబు, సీ.రామచంద్రయ్యలకు లేనేలేదని టీడీపీ పొలిట్ బ్యూ రోసభ్యులు, శాసనసభ్యులు నిమ్మలరామానాయుడు తేల్చిచెప్పా రు. గురువారం ఆయన చంద్రబాబునాయుడి నిరసనదీక్షలో పాల్గొన్న అనంతరం మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
కాపులకు ఇస్తున్న రుణాలను నిలిపేసి, కాపుకార్పొరేషన్ తీసేసి, కాపుల రిజర్వేషన్లను తొక్కిపెట్టిన జగన్మోహన్ రెడ్డినిప్రశ్నించలేని కాపునేతలు, సిగ్గులేకుండా చంద్రబాబుగురించి మాట్లాడుతు న్నారు. కుట్రలు, కుతంత్రాలు, ద్రోహాలు, మోసాలకు నిలువెత్తు రూపం జగన్మోహన్ రెడ్డని, వాటిన్నింటిపై పేటెంట్ రైట్స్ ఆయనకే ఉన్నాయని సీ.రామచంద్రయ్య, కన్నబాబు, పేర్నినాని లాంటినేతలు,వైసీపీలోని ఇతరకాపునేతలు తెలుసుకోవాలి. సొంత బాబాయిని చంపించి, చిన్నాన్నకూతురికే రక్షణలేకుండాచేసిన గొప్పతనం జగన్ ది. సొంతచెల్లెల్ని మోసగించి, పొరుగురాష్ట్రం బాట పట్టించింది జగన్మోహన్ రెడ్డిదికాదా?
ఆఖరికి సొంతతల్లిని కూడా మోసగించి, తనస్వార్థానికి వాడుకొని వదిలేసింది ఈ ము ఖ్యమంత్రికాదా? కాబట్టే చెబుతున్నాం..కుట్రలు, కుతంత్రాలు, మోసాలు, ద్రోహాలు పుట్టిందే జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో. గతం లో ముఖ్యమంత్రిగా ఉన్నచెన్నారెడ్డిని గద్దెదింపడంకోసం జగన్ తండ్రి, దివంగత రాజశేఖర్ రెడ్డి ఏంచేశాడో రామచంద్రయ్యకు తెలి యదా? వైసీపీనేతలు, తనప్రభుత్వం సాగిస్తున్న మాదకద్రవ్యాలు, గంజాయి వ్యాపారం గుట్టు బయటకు పొక్కిందనే జగన్మోహన్ రెడ్డిలోని ఫ్రస్టేషన్ పతాకస్థాయికిచేరింది. తనకేసులవిచారణ దగ్గరకొచ్చే సమయంలోకూడా ముఖ్యమంత్రిలోని అసహనం పతాకస్థాయికి చేరుతూంటుంది.
ప్రజాగ్రహాన్ని చవిచూడటంలో వైసీపీఎమ్మెల్యేలు దేశంలోనే అందరికంటే ముందున్నారన్న సీఓటర్ సంస్థ సర్వేకూడా ముఖ్యమంత్రిని స్థిమితంగా ఉంచడం లేదు. తనపార్టీలోనే తనకు వ్యతిరేకంగా అంతర్గత ఆగ్రహం ఎక్కువవుతోందన్న వాస్తవంకూడా జగన్మోహన్ రెడ్డిని కుదురుగా ఉండనీయడంలేదు. తనలోని నిరాశా, నిస్పృహలను కప్పిపుచ్చుకోవడానికే జగన్మోహన్ రెడ్డి టీడీపీనేతలు, కార్యాలయాలపై దాడులుచేయిస్తున్నాడు. గంజాయి మూలాలుఏపీలోనే ఉన్నాయని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ చెబితే, దానిపై సీపీకి నోటీసులివ్వగల ధైర్యం ఈ ముఖ్యమంత్రి, డీజీపీకి ఉన్నాయా? తనదగ్గరున్న ఆధారాలు సమర్పించాలని ఏపీ పోలీసులు హైదరాబాద్ సీపీని ఎందుకు అడగలేదు?
డీజీపీ ఆఫీసులో పనిచేస్తున్నవ్యక్తే తెలుగుదేశం కార్యాలయంపైకి దాడికివచ్చాడంటే, కచ్చితంగా దాడిలో పోలీసుల ప్రమేయముందనే అనుకోవాలి. వైసీపీఎమ్మెల్యే జోగిరమేశ్ మాజీ ముఖ్యమంత్రి ఇంటిపైకి దాడికివెళ్తే, డీజీపీ వినతిపత్రం ఇవ్వడాని కి వెళ్లాడని అధికారపార్టీ ఎమ్మెల్యేను వెనకేసుకొచ్చాడు. మరి అలాగే మేముకూడా 30, 40 కార్లతో ముఖ్యమంత్రి ఇంటికివెళ్తే, డీజీపీ, అతని పోలీస్ శాఖ ఊరుకుంటుందా? అలా వెళ్లడానికి అనుమతులు ఇవ్వగలధైర్యం ఈ డీజీపీకి ఉందా? మైదుకూరు వైసీపీఎమ్మెల్యే మంగళగిరి టీడీపీ కార్యాలయం కాబట్టి దాడితో సరిపెట్టారని, రాయలసీమలో అయితే ఖూనీలు చేసేవారమని బాహటంగానే బెదిరిస్తున్నాడంటే, వైసీపీనేతల ఈర్ష్యాద్వేషాలు ఏ స్థాయికి చేరాయో అర్థమవుతోంది.
తన అధికారం చేజారిపోతుంద న్న భయం జగన్మోహన్ రెడ్డిలో మొదలైందని, దానిప్రభావంతోనే ప్రజావ్యతిరేకవిధానాలను పక్కదారి పట్టించడానికి కుల,మత, ప్రాంతీయవిద్వేషాలు రెచ్చగొడుతున్నాడు. ప్రశాంత్ కిషోర్ నిర్దేశక త్వంలోనే ముఖ్యమంత్రి ఈవిధమైన నీచరాజకీయాలకు పాల్పడు తున్నాడు. చేగువేరా చెప్పినట్లుగా ప్రతి తెలుగుదేశం నాయకుడు, కార్యకర్త, వైసీపీప్రభుత్వ కుట్రలు, కుతంత్రాలు, ద్రోహాలను ఎండగట్టి జైళ్లకువెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజాక్షేత్రంలో జగన్మో హన్ రెడ్డిని ఎప్పుడెప్పుడు దోషిగా నిలబెడదామా అని టీడీపీ ఎదురుచూస్తోంది.

LEAVE A RESPONSE