ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయంతో జగన్ అతని మంత్రుల్లో నిరాశానిస్పృహలు

– ఓటమి తాలూకా అసహనం, అక్కసుతోనే మంత్రి ధర్మాన డ్వాక్రామహిళల్ని అనరాని మాటలని, – సభ్యసమాజం తలదించుకునేలా వారిని అవమానించాడు.
• డ్వాక్రామహిళలు అన్నదానిలో తప్పేముందో మంత్రి ధర్మానచెప్పాలి.
• డ్వాక్రామహిళల్ని పనికిమాలిన వాళ్లు అన్న మంత్రే పెద్దపనికిమాలినవాడు.
• ఆసరా పేరుతో జగన్ కోటి14లక్షల మంది డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు టోకరా వేశాడు.
• వైసీపీ సర్పంచ్ లు మొదలు మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ మహిళల్ని అవమానించారు.. ఇప్పటికీ అవమానిస్తున్నారు.
• రాజధాని మహిళల విషయంలో, అన్నెంపున్నెం ఎరుగని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళల విషయంలో జగన్ ఎంత కర్కశంగా ప్రవర్తించాడో చూశాం.
– టీడీపీ అంగన్ వాడీ, డ్వాక్రాసాధికార విభాగాల రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత

ఆసరాపేరుతో జగన్మోహన్ రెడ్డి కోటి14లక్షల మంది డ్వాక్రామహిళలకు టోకరావేశాడని, అధికారంలోకి రాకముందు డ్వాక్రామహిళల్ని ఉద్ధరిస్తాను, వారిరుణాలన్నీ మాఫీచేస్తానని హామీ ఇచ్చిన జగన్, 4ఏళ్ల పాలనలో వారిని నిలువునా వంచించాడని, ఆసరా సాయం అందించాల్సి వస్తుందని లభ్దిదారుల సంఖ్యను 79లక్షలకు కుదించాడని టీడీపీ అంగన్ వాడీ, డ్వాక్రాసాధికార విభాగాల రాష్ట్రఅధ్యక్షురాలు ఆచంట సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు క్లుప్తంగా ఆమెమాటల్లోనే ..

“జగన్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే డ్వాక్రామహిళలకు నాలుగువిడతల్లో చేస్తానన్న రుణమా ఫీ ఎందుకుచేయలేదు? సెప్టెంబర్లో నొక్కాల్సిన 3వ విడత రుణమాఫీ బటన్ మార్చిలో నొక్కా రు. బటన్ నొక్కాక డ్వాక్రామహిళలకు ఖాళీచెక్కులిచ్చి వారిని ఘోరంగా అవమానించారు. ముఖ్యమంత్రి డ్వాక్రా అక్కచెల్లెమ్మలను ఉత్తుత్తి బటన్ నొక్కుళ్లతో అవమానిస్తుంటే, మంత్రి ధర్మాన వారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉ న్నాయి. మంత్రి వ్యాఖ్యలు వైసీపీప్రభుత్వ నిరాశానిస్పృహలకు అద్దంపడుతున్నాయి.

డ్వాక్రామహిళల్ని పనికిమాలినవాళ్లు అన్న మంత్రిధర్మానే పనికిమాలినవాడు
జగన్మోహన్ రెడ్డి తనఇంట్లో సొమ్ముఏమైనా డ్వాక్రామహిళలకు ఇస్తున్నారా అని డ్వాక్రా మ హిళలు అంటున్నారని, డబ్బులు తీసుకుంటూ కూడా పనికిమాలిన ఆడవాళ్లు పనికిమాలి న విధంగా మాట్లాడుతున్నారని పనికమాలినమంత్రి అనడాన్ని తీవ్రంగా తప్పుపడుతు న్నాం. వైసీపీప్రభుత్వం, జగన్ నిజంగా డ్వాక్రామహిళలను ఉద్ధరించి ఉంటే, మంత్రిధర్మాన అలా ఎందుకు మాట్లాడారు?
తనసభనుంచి డ్వాక్రామహిళలు వెళ్లిపోతుంటే, మంత్రి పోలీసు ల్ని హెచ్చరించి, వారిసాయంతో ఆడవాళ్లను ఎందుకు అడ్డుకున్నాడు? మంత్రివ్యాఖ్యలు, ప్రభుత్వ ఫ్రస్టేషన్ కు నిదర్శనమనే చెప్పాలి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి పట్టం కట్టడంతో మంత్రులు, వైసీపీఎమ్మెల్యేలు అసహనానికి గురవుతున్నారు. గతంలో లక్ష్మారెడ్డి అనే వైసీపీ సర్పంచ్ డ్వాక్రామహిళలు ఒళ్లుకొవ్వెక్కి మాట్లాడుతున్నారన్నాడు.

డ్వాక్రామహిళలు అన్నదానిలో తప్పేమిటో మంత్రి ధర్మాన చెప్పాలి
డ్వాక్రామహిళలు అన్నదానిలో తప్పేముందో మంత్రిధర్మాన సమాధానంచెప్పాలి. డ్వాక్రా మహిళలకు అయినా, ప్రజలకు అయినా జగన్మోహన్ రెడ్డి తనఇంట్లో సొమ్ము ఇవ్వడంలేదు. ప్రజలు కట్టే పన్నుల సొమ్ములో కొంత తనఖజానాలో వేసుకొని, మిగిలింది ప్రజలకు పప్పు బెల్లాల్లా పంచుతున్నారు. ఆసరాపేరుతో డ్వాక్రామహిళల్ని ఉద్ధరించామని పాలాభిషేకాలు చేసుకుంటున్నవారు, మహిళల్ని బెదిరించి, భయపెట్టిసభలకు ఎందుకు తరలిస్తున్నారో సమ ధానం చెప్పాలి. మంత్రి మొదలు, వైసీపీ సర్పంచ్ వరకు డ్వాక్రామహిళల్ని హేళనచేయడమే నా జగన్ వారికి ఇస్తున్న గౌరవమర్యాదలు?

సభలు, సమావేశాలకు రాకుంటే రుణాలు ఇవ్వం.. పథకాలు నిలిపేస్తాం.. ఆర్థికసాయం ఆపేస్తామని బెదిరించడమేనా జగన్, అతని ప్రభుత్వం డ్వాక్రా మహిళల్ని గౌరవిస్తున్న విధానం?
డ్వాక్రామహిళల్నిమంచి పారిశ్రామికవేత్తలుగా మార్చి, వారిని బిల్ గేట్స్, బిల్ క్లింటన్ వంటి వారిపక్కన చంద్రబాబు కూర్చొబెడితే, జగన్ వారి పొదుపుసొమ్ముని కూడా లాక్కొని, వారిని ఉద్ధరిస్తున్నట్టు కబుర్లుచెబుతున్నాడు. 10లక్షలు, 20లక్షల రుణాలిస్తున్నట్లుచెబుతూ వారిని వంచించారు. చంద్రబాబు హయాంలో డ్వాక్రాసంఘాలకు సున్నావడ్డీకి రూ.3లక్షలవరకు రుణం ఇస్తే, జగన్ దాన్ని రూ.5లక్షలు చేస్తానని చెప్పి, అధికారంలోకి వచ్చాక మాటమార్చి వారిని మోసగించాడు. జగన్ అతని ప్రభుత్వం డ్వాక్రాసంఘాల్ని జనాల్ని సభలకు తరలించే సంఘాలుగా మార్చింది. ధర్మాన ప్రసాదరావు సభనుంచి బయటకు వెళ్లకుండా గేట్లకు తా ళాలు వేసినా మహిళలు ఉన్నారా? వైసీపీసభలు సమావేశాలకు రాకపోతే రుణాలుఇవ్వమ ని, ఆర్థికసాయంచేయమని బెదిరిస్తున్నా మహిళలు వస్తున్నారా? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారి టీ మహిళలకు న్యాయంచేస్తానన్న జగన్, వారికి ఏం లబ్ధిచేకూర్చాడో చెప్పాలి. జగన్ చేస్తు న్న డ్వాక్రామహిళల రుణమాఫీ 5లక్షలు, 10లక్షల రుణం తీసుకున్న సంఘాలకే వర్తించింది తప్ప, 3లక్షలు, 2లక్షలరుణం తీసుకున్న చిన్నచిన్నసంఘాల వారికి ఉపయోగపడటం లేదు.

జగన్ అధికారంలోకి వచ్చేనాటికి డ్వాక్రామహిళల రుణమాఫీ రూ.27వేలకోట్లు ఉంటే, దాన్ని రూ.25వేలకోట్లకు తగ్గించాడు. అదికూడా సక్రమంగా ఇవ్వకుండా లబ్ధిదారులసంఖ్య లో కోతపెట్టాడు. సెప్టెంబర్లోఇవ్వాల్సిన మూడోవిడత రుణమాఫీని మార్చిలో చెల్లించాడు. ఇక 4 వ విడతరుణమాఫీ ఎప్పుడు ఇస్తాడో కూడా చెప్పలేం. మహిళలపట్ల జగన్ కు గౌరవం ఉంటే తనసభకు వచ్చినవారు నల్లచున్నీలు వేసుకున్నారని అవి తీయిస్తాడా? సభకు వచ్చి నవారు, బాత్రూమ్ కు కూడా వెళ్లనీయకుండా అడ్డుకొని, డైపర్స్ వేసుకోవచ్చచుగా అంటూ హేళనగా మాట్లాడతారా? రాజధాని అమరావతికోసం ఉద్యమం చేస్తున్న ఆడబిడ్డల్ని బూటు కాళ్లతో తన్నిస్తారా? మగపోలీసులతో ఆడవాళ్లను విచక్షణారహితంగా ఈడ్పిస్తారా? డాక్టర్ సంధ్యారాణిని అవమానించి, వేధించడమేనా జగన్ ప్రభుత్వం మహిళల్ని గౌరవిస్తున్న విధా నం? ఎందరో ఎస్టీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ మహిళల మానప్రాణాలు హరించడమేనా జగన్ ఆడబిడ్డలకు ఇస్తున్న మర్యాద? జగన్ సంక్షేమం అంతా గారడీనే. సచివాలయానికి 15కిలో మీటర్ల దూరంలో ఉంటేనే పింఛన్లు ఇస్తామన్న నిబంధన పింఛన్లకు కోతపెట్టడంకాదా? బతుకుదెరువు కోసం ఎక్కడికీ వెళ్లకుండా, జగన్ఇచ్చే అరకొరపింఛన్ తోనే వృద్ధులు, మహిళలు బతకాలా? జగన్, అతనిప్రభుత్వం, మంత్రులు ఎంతటి అసహనంతో మాట్లాడుతున్నారో, దానికి రెట్టింపు అసహనంతో రాష్ట్రమహిళలు ఓటు అనేఆయుధంతో ఈ పాలకులకు బుద్ధి చె ప్పడానికి సిద్ధంగా ఉన్నారు.” అని సునీత తేల్చిచెప్పారు.

Leave a Reply