పోలీసు అమరవీరుల దినోత్సవంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికీ డీజీపీ గౌతం సవాంగ్ ధన్యవాదాలు తెలిపారు. పోలీసు అమరవీరుల దినం కార్యక్రమంలో డీజీపీ పాల్గొని ప్రసంగించారు. అభద్రత భావం దూరం చేస్తూ ఏకాగ్రతతో పని చేయడం ప్రతీ పోలీసు పని అని అన్నారు. కాలం పోలీసు విధులకు కొలమానం కాదని…అన్ని రకలుగా సామాజిక భద్రతకు పనిచేయడమే పోలీసుల విధి అని చెప్పుకొచ్చారు. పోలీసుల సంక్షేమానికి సీఎం జగన్ జారీ చేసిన పధకాలు విలువైనవన్నారు. వీక్లీ ఆఫ్ పోలీసులకు ఇవ్వాలన్న సీఎం జగన్ నిర్ణయాన్ని ప్రతీ పోలీసు అభినందించాలని తెలిపారు. రూ.15 కోట్ల నిధులు సీఎం జగన్ పోలీసు సంక్షేమనికి విడుదల చేయాలని కోరుతున్నామన్నారు. కోవిడ్ కాలంలో ప్రాణాలర్పించిన వారికి ఒకొక్కరికి రూ.5 లక్షలు అదనంగా ఇవ్వడం అభినందనీయమని డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు.