జగన్ రెడ్డి … రాష్ట్రం మీ అయ్య జాగీరా?

– ఇసుక, మైనింగ్ ను సెంట్రలైజ్ చేసి దోచుకునే హక్కు మీకెవరిచ్చారు?
-మద్యంపై వచ్చే ఆదాయాన్ని 25 సంవత్సరాల పాటు తాకట్టు పెట్టే హక్కు ఎవరిచ్చారు?
– గోరంట్ల మాధవ్ ని పార్లమెంట్ సభ్యుడిగా తొలగించకుండా పార్లమెంటరీ పార్టీలో మళ్లీ కూర్చోబెట్టారు. ఆకృత్యాలు చేస్తే ప్రమోషన్స్ ఇస్తారా?
– టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు

మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ….. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ని పార్లమెంట్ సభ్యుడిగా తొలగించకుండా పార్లమెంటరీ పార్టీలో మళ్లీ కూర్చోబెట్టారు. ఆకృత్యాలు చేస్తే ప్రమోషన్స్ ఇస్తారా? గోరంట్ల మాధవ్ రాసలీలల గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. వైసీపీ నాయకత్వం పార్టీ నుంచి అతనిని సస్పెండ్ చేస్తాం, ఎంపీగా రాజీనామా చేయిస్తాం అని సాక్షి పత్రికలో లీకులు ఇచ్చి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే వైసీపీ నాయకుల వ్యక్తిగత విషయాలు బయట పెడతానని గోరంట్ల మాధవ్ బెదిరిస్తున్న పరిస్థితులలో వారంతా వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది.
డీఎల్ రవీంద్రారెడ్డి ‘‘మీరు కంత్రీ, మీ బతుకులు కంత్రీ’’. అని ఆ రోజు జగన్ పై ప్రకటన చేశారు. ‘‘సాక్షి పత్రిక జగన్ కరపత్రం’’, ‘‘జగన్ పత్రికలో అన్నీ అబద్ధాలే’’, ‘‘జగన్ వి అన్నీ వ్యాపార రాజకీయాలు’’ అని ధర్మాన ప్రసాదరావు నాడు పత్రికా ప్రకటనలు గుప్పించారు. ఆయన ఆరోజు, ఈరోజు మంత్రే.

గురిగిందగింజ తన కింది నలుపు ఎరగదు అన్నట్లుగా రాష్ట్రంలో అరాచకాలు తప్ప.. లా అండ్ ఆర్డర్ ఎక్కడా అమలుకావడంలేదు. మహిళలకు, దళితులకు, బీసీలకు, మైనార్టీలకు రక్షణ లేకుండా పోయింది. అనేకమంది మైనార్టీలు, దళితులు ఆత్మహత్యలకు పాల్పడినా ప్రభుత్వ స్పందన కరువైంది. మైనింగ్, సారాయి, గంజాయి వ్యాపారం విచ్చలవిడిగా సాగుతోంది. పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు. రాష్ట్రాన్ని పరిపాలించే నైతిక హక్కు జగన్ కు లేదు. 3 సంవత్సరాల 3 నెలల్లో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డ ఎంతమందిపై కేసులు పెట్టారు? దౌర్జన్యాలకు పాల్పడిన ఎంతమందికి శిక్షలు వేశారు? ఎంతమందిని జైలుకు పంపారు?

అనేకమంది ఆస్తులు ధ్వంసం చేశారు. అనేకమందివి వేల ఎకరాల ఆస్తులు ఆక్రమించారు. ఎక్కడ నుంచి ఎంత అప్పు తెచ్చారో లెక్కలు చెప్పాలి. ప్రభుత్వ భూములు, కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు, మందుబాబులను తనఖా పెడతున్నారు. ఏ1 నేరస్థుడు ముఖ్యమంత్రిపై 32 కేసులున్నాయి. ఏ2 ముద్దాయి విజయసాయిరెడ్డిపై 32 కేసులుంటే ఆయనను రెండుసార్లు రాజ్యసభ పదవి ఇచ్చారు. సీబీఐ, ఈడి కేసులున్నవారికి మొదట మంత్రి పదవి ఆ తరువాత రాజ్యసభ ఇచ్చారు. సంజనా, సౌజన్యా అని మాట్లాడి అడ్డగొలుగా దొరికిన అంబటి రాంబాబుకి మంత్రి పదవి ఇచ్చారు. తప్పులు చేస్తే ప్రమోషన్లా? చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన జోగి రమేష్ కి మంత్రి పదవి ఇచ్చారు.

దీన్ని బట్టి వైసీపీకి నైతిక విలువలు లేవని తెలుస్తోంది. రాష్ట్రాన్ని మాఫియా, తాలిబన్ రాజ్యంగా తయారు చేస్తున్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు లేక నిరుద్యోగ సమస్య తాండవిస్తోంది. జాబ్ క్యాలెండర్ వేస్తానని చెప్పి వేయలేదు. వచ్చిన పారిశ్రామికవేత్తలకు కులాలను అంటగట్టి తరిమేస్తున్నారు. సొంత బ్రాండ్ మద్యాన్ని ప్రజలకు తాగించి మహిళల తాలిబొట్లు తెంచుతున్నారు. ప్రతి పథకంలోను అరాచకం, దోపిడీ సాగుతోంది. రాష్ట్రాన్ని అధోపాతాళానికి నెట్టారు.

బరితెగించి రాష్ట్రంలో మహిళలని కించపరిచే విధంగా అసభ్య ప్రవర్తనతో తన నైజాన్ని చాటుకున్న ఎంపీ మాధవ్ రాసలీలల విషయంలో జగన్ రెడ్డి ప్రభుత్వం నిమ్మకు నిరేత్తినట్టు వ్యవహరిస్తోంది. నేడు రాష్ట్రంలో మహిళల పట్ల ముఖ్యమంత్రికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోంది. ఎంపీ మాధవ్ రాసలీలల వీడియో బయటపడ్డాక క్షమాపణ చెప్పకుండా, తప్పును ఒప్పుకోకుండా పత్రికలు, మీడియాపై ఆగ్రహంగా మాట్లాడటం దుర్మార్గం. ‘‘కమ్మ నాయాళ్లు’’ అని కులాన్ని కించపరిచే విధంగా గోరంట్ల మాధవ్ మాట్లాడాడు. అనంతపురం జిల్లాలో 1989-94 మధ్య కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓబుల్ రెడ్డి అనే వ్యక్తి అకృత్యాలు, అఘాయిత్యాలు చూస్తే ఆ సమయంలో మహిళలు బయటకు రావాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఆడపిల్లలని స్కూళ్లకు పంపిచాలంటే భయపడే పరిస్థితి. ఒక అధికారి భార్యని కిడ్నాప్ చేసి బలవంతగా ఇంట్లో బంధించారు. వాళ్ల తల్లిదండ్రులు మా అమ్మాయిని పంపిచాలని కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడితే అంత తొందరేంటి పంపిస్తానులే అన్న ఘటనలు కూడ గతంలో చూశాం. ఇటువంటి ఘటనలు సినిమాలలో కూడ వచ్చాయి.

గతంలో ఆ ఉన్మాది చర్యల నుంచి అనంతపురం జిల్లాలో పేద వర్గాలు, బిసి వర్గాలని, మహిళలని ఒక ఆపద్భాందవుడిలా కాపాడిని వ్యక్తి పరిటాల రవి కాదా? పరిటాల రవి వచ్చిన తరువాతనే అక్కడ అకృత్యాల అంతానికి బీజం పడింది. అప్పుడు కులాలు మతాలు ఎవరు చూడలేదు. ఇప్పుడు ఎందుకు కులాలు మతాలు అంటూ సంభాషణలు వస్తున్నాయి. గతంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడ ఎలక్షన్ కమిషన్ గురించి ఆయన ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అని మాట్లాడారు. వైసీపీ ఎమ్మేల్యేలు, ఎంపీ లు, నాయకులు, ఆఖరికి ముఖ్యమంత్రి అయి ఉండి జగన్ రెడ్డి కూడ కూలాల గురించి మాట్లాడే పరిస్ధితికి వచ్చారు.

మన భారతదేశం వసుదైక కుటుంబం. కులాలు, మతాలు అన్ని కలిసి అందరం కలిసుండి జీవించే సంస్కృతి భారతదేశంలో ఉంది. ఆ భారతదేశంలో భాగమే ఆంధ్రరాష్ట్రం. వైసీపీ నాయకులు మహిళల పట్ల అసభ్యంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు. కులాల గురించి మాట్లాడి ఎందుకు కించపరుస్తున్నారో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.

ఆంధ్రప్రదేశ్ లో పుట్టి పెరిగి జాతీయ స్థాయిలో ఉన్నతమైన పదవులను అధిరోహించిన నాయకులు ఎంతో మందికి కులాలు ఉన్నాయా. ఆంధ్రలో పుట్టిన పి.వి.నరసింహారావు గారు ప్రధాని మంత్రిగా, నీలం సంజీవ రెడ్డి గారు రాష్ట్రపతిగా, బాలయోగి గారు లోక్ సభ స్పీకర్ గా, వేణుగోపాల్ గారు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా, వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతి గా, రమణ గారు సిజెగా చేశారు. ఇలా ఎంతో మంది గొప్ప గొప్ప పదవులు చేసిన వారున్నారు, వారందరికి లేని కులాలు, మతాలు ఇప్పుడెందుకు వస్తుంది. 40 సంవత్సరాల చరిత్ర చూసుకుంటే ఎంతో మంది రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రులు, నాయకులు ఉన్నారు. గతంలో కుల మతాలు లేవు ఇప్పుడెందుకు కుల మతాల ప్రస్ధావన?

స్వాతంత్ర్యం తెచ్చిన గాంధీజీ కి, ఆంధ్రప్రదేశ్ ఆవిర్భానికి అసువులు బాసిన పొట్టి శ్రీరాములు కి కూడ కుల, మతాలని అంటగడతారా? మీకు కుల మతాల పట్ల ప్రేమ లేదు రాజకీయ దురుద్ధేశానికి వాడుకుంటున్నారు. కులాన్ని కించపరిచే విధంగా మాట్లాడటం సమంజసం కాదు. నోటిని అదుపులో పెట్టుకొని ప్రవర్తించాలి. గతంలో చాలా మంది కుల ప్రస్తావన తెచ్చి కించపరిచారు. ఎందుకు రచ్చ చేయడం అని సంయవనం పాటిస్తుంటే బరితెగించి నోరు పారేసుకుంటున్నారు. భవిష్యత్తులో ఇటువంటి విషయాలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వైసీపీ నాయకులు, ముఖ్యమంత్రికి ఉంది. అన్ని కులాలని సంస్కృతి మీకు కూడ ఉండాలి అని కోరారు. గడ్డాలు, మీసాలు పెంచుకొని గంగిరెద్దులు లాగా మీడియా ముందు రంకెలేయడం కాదు.

ఇటువంటి కులాల కించపరిచే విషయాలని అరికట్టాలి. అన్ని కులాలని సమానంగా చూసి, అందరూ కలిసి మెలిసి ఉండే విధంగా సంస్కృతి ఉన్న ఆంధ్రప్రదేశ్ చరిత్రని కాపాడుకోవాలి. ఇటువంటి పనులు మరోసారి పునరావృతం అయితే మీ గొయ్యి మీరు తవ్వుకున్నట్టు అని వైసీపీ నాయకులని హెచ్చరించారు. జగన్ రెడ్డి 2019 అధికారంలోకి వచ్చిన తరువాత రాజధాని మహిళలలు సెంటు అరసెంటు భూమికి కూడ మర్డర్ల అయ్యే పరిస్థితులలో ఉన్నారు. 33వేల ఎకరాలు ఉదారంగా ప్రభుత్వానికి ఇచ్చి రాజధాని నిర్మాణం కోసం పాటుపడిని రైతులకు మీరు అధికారంలోకి వస్తే రాజధానికి సహకరిస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానులు అని అనడంతో రైతులు, మహిళలు ఉద్యమం చేయడానికి ముందుకు వస్తే మహిళల కట్టుబొట్ల గురించి ఇష్టానుసారంగా మాట్లాడారు.

మీ ఇష్టానుసారం బరితెగించి ప్రవర్తిస్తారా. వైసీపీ పేటియం బ్యాచ్ అంతా మహిళల గురించి ఇష్టమొచ్చినట్టు పోస్టులు పెడతారా. ఇదేనా మీరు మహిళలకు ఇచ్చే గౌరవం. భువనేశ్వరి గురించి ఇష్టారాజ్యంగా అసెంబ్లీలో మాట్లాడారు. ఎన్.టి.ఆర్ కూతురు ఉమా మహేశ్వరి చనిపోతే ఆవిడ గురించి మాట్లాడుతూ లోకేష్, చంద్రబాబు నాయుడు గురించి వికృత చేష్టలు చేశారు. ఎ1 నిందుతుడు ముఖ్యమంత్రి, ఎ2 విజయసాయి రెడ్డి ఎంపీ స్థాయిలో ఉండటం దురదృష్టం. మీ ఇష్టారాజ్యంగా ఎన్.టి.ఆర్ కూతురు మరణాన్నికూడ రాజకీయం చేయాలని చూశారు. రెండు రోజులలోనే వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ రాసలీలలు బయటకొచ్చి అదఃపాతాళానికి పోయారు. అధికార అహంకారంతో అధికార దుర్వినియోగానికి ప్రవర్తిస్తే ప్రభుత్వమే సమాధానం చెబుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజానికం తగిన సమాధానం చెబుతారు.

మాఫియా రాజ్యంగా తయారు చేశారు ఆంధ్ర రాష్ట్రాన్ని. యదేచ్ఛగా గంజాయి సరఫరా చేస్తూ మత్తు పదార్థాలకు బానిసలుగా చేస్తున్నారు యువతను. గుడివాడ కొడాలి నాని గడ్డం బ్యాచ్ క్యాసినో పెడితే తప్పేంటని మాట్లాడటం దుర్మార్గం. ఒంగోలు మాజీ మంత్రి నేను క్యాసినో కి వెళతాను పేకాట ఆడతాను తప్పేటని మాట్లడతారు. వైసీపీ ఎమ్మేల్సీ ఒకరు మర్డర్ల్ చేసి శవాలని పార్శిల్ చేస్తారు. ఎంపీ గోరంట్ల మాధవ్, అరగంట మంత్రి అవంతి శ్రీనివాస్, గంట మంత్రి అంబటి రాంబాబు మహిళలని లైంగిక వేదింపులకి గురి చేస్తారు. వైసీపీ ప్లీనరీ సమావేశాలలో రికార్డింగ్ డ్యాన్సులు పెడతారు. సామాజిక న్యాయం అని బస్సు యాత్రని పెడితే జనాలు రాకపోయే సరికి రికార్డింగ్ డ్యాన్సులు పెట్టి జనాలని పోగేసుకున్నారు. సమావేశానికి వచ్చిన జనాలు వెళిపోతే పోలిసులతో బెదిరించి కూర్చోబెడతారు.

ముఖ్యమంత్రి పదవిశాశ్వతం కాదు వ్యవస్థలు శాశ్వతం. చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు దొరక్క పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతే వారి తల్లిదండ్రుల పరిస్థితేంటి? రాష్ట్రం తాలిబన్ రాజ్యం కాకూడదు. రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మహిళలపై ఉంది. మహిళలు దుర్గామాతలు, కన్నెర్రజేస్తే ప్రభుత్వం కూలిపోవాల్సిందే. రాష్ట్రంలోని అన్ని కులాలు, మతాలను గౌరవించాల్సిన బాధ్యత సీఎంపై ఉంది. మీ ఆకృత్యాలను, ఓటు బ్యాంకు రాజకీయాలను ప్రజలు అర్థం చేసుకుంటారు. రాష్ట్ర ప్రజానీకం ఆలోచించి రాష్ట్రాన్ని రక్షించుకోవాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.

Leave a Reply