ఏపీ ఆర్థిక వ్యవస్థను వైకాపా ప్రభుత్వం కృష్ణబిలంలా మార్చేసింది

– రాజ్యసభ ఎంపీ, కనకమేడల రవీంద్ర కుమార్‌

న్యూఢిల్లీ: ఏపీ ఆర్థిక వ్యవస్థను… వైకాపా ప్రభుత్వం కృష్ణబిలంలా మార్చేసిందని తెదేపా రాజ్యసభ ఎంపీ, కనకమేడల రవీంద్ర కుమార్‌ అన్నారు.ప్రజలు చెల్లించే పన్నులు, కేంద్ర నిధులు.. కనిపించకుండా పోతున్నాయన్నారు.

పరిస్థితి చేయిదాటకముందే కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థను…వైకాపా ప్రభుత్వం కృష్ణబిలంలా మార్చేసిందని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌ అన్నారు.ప్రజలు చెల్లించే పన్నులు, కేంద్ర నిధులు.. కనిపించకుండా పోతున్నాయన్నారు.

ద్రవ్యవినిమయ బిల్లు, అనుబంధ పద్దులు 2021-22పై రాజ్యసభలో జరిగిన చర్చలో… కనకమేడల పాల్గొన్నారు. నిధుల కేటాయింపులు, వ్యయం సహా.. ఏ విషయంలోనూ ఏపీ ప్రభుత్వం పారదర్శకత, జవాబుదారీతనం పాటించడం లేదని గుర్తుచేశారు. పరిస్థితి చేయిదాటకముందే కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు.

రవీంద్రకుమార్‌ మాట్లాడుతున్న సమయంలో వైకాపా సభ్యులు తీవ్ర అంతరాయం కల్పిస్తూ అడ్డుతగిలేందుకు యత్నించారు. సభాధ్యక్ష స్థానంలో ఉన్న ప్యానెల్‌ ఛైర్మన్‌ సురేంద్ర సింగ్‌ నాగర్‌ వైకాపా సభ్యుల నిరసనకు అనుమతి ఇవ్వలేదు.

“ఏపీలో బడ్జెట్ కేటాయింపులు, వ్యయాల తీరులో…ప్రాతిపదిక అంటూ లేదు. వ్యయం విషయంలో పారదర్శకత లేదు. ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడమే దీనంతటికీ కారణం. రాష్ట్ర ఆర్థికాన్ని… ప్రభుత్వం కృష్ణబిలంలా మార్చేసింది. ప్రజలు పన్నుల రూపంలో చెల్లించే మొత్తం కృష్ణబిలంలోకి వెళ్తున్నట్లుగా తుడిచిపెట్టుకుపోతోంది. నిధుల మళ్లింపు ద్వారా మూలధన వ్యయాన్ని పెంచడం వల్ల రుణ సేకరణకు ఏపీ ప్రభుత్వం అవకాశాలు పెంచుకుంటోంది. అపరిమిత అప్పులతో రాష్ట్ర ప్రజలతో పాటు కేంద్రాన్ని మోసం చేస్తోంది. ఏపీలో ఆర్థిక వ్యవస్థ పరిస్థితి దారుణంగా ఉంది. రాష్ట్రంలో ఆర్థిక అవకతవకలు, ఆర్థిక క్రమశిక్షణ లేమిపై ఇద్దరు కేంద్ర మంత్రులే చెప్పారు. ఉద్దేశపూర్వక తప్పిదాలు, ఆర్థిక అవకతవకల విషయంలో పరిస్థితి చేయిదాటకముందే కేంద్రం కట్టడి చేయకుంటే…దేశం 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు చేరుకోలేదు.” అని కనకమేడల రవీంద్రకుమార్‌ అన్నారు.

Leave a Reply