వైకాపా అంటే కాంగ్రెస్ పార్టీకి కాపీ పార్టీ

-ఏపీలోనూ లిక్కర్ మాఫియాది మామూలు‌కుంభకోణం కాదు
-ఏపీ గంజాయి మాఫియా చేతిలో పడింది
-ఏపీకి అప్రతిష్ఠ చుట్టుకుంటోంది. ఇకనైనా ఈ దందా ఆపండి
-ఏపీలోనూ బీజేపీ వస్తేనే అభివృద్ధి సాధ్యం
-అవినీతిలో ఏపీ నాలుగో స్థానం, తెలంగాణ రెండో స్థానం
-కేంద్ర క్రీడలు, యువజన శాఖ మంత్రి, ముఖ్య అతిధి అనురాగ్ సింగ్ ఠాకూర్

లిక్కర్ కింగ్, స్టిక్కర్ కింగ్ జగన్ను ఇంటికి పంపే తరుణం వచ్చింది. ఒకపుడు విదేశీ ఆక్రమణ దారులు వచ్చి ఈదేశంలో మతం మార్చి, దోపిడి చేస్తే ఇపుడు ఏపీలో జగన్ అదే చేస్తున్నాడు.
ఆనాడు చంద్రబాబు బాబు రావాలి జాబు రావాలి అని ప్రచారం చేసి అధికారం దక్కించుకున్నాడు‌. బాబూ ఏది మా జాబు అని నాటి బిజెవైఎం అధ్యక్షుడు రమేష్ నాయుడు నిలదీశారు. జగన్ జాబు కాలెండరని యువతను నమ్మించి అధికారానికి వచ్చాడు. ఏవీ ఉద్యోగాలు?
కొత్త పరిశ్రమలు రావటం లేదు, ఉన్న పరిశ్రమలు తరలిపోతున్నాయి, ఇక ఉపాధి ఎలా?
వైకాపా అంటే కాంగ్రెస్ పార్టీకి కాపీ పార్టీ. ఈ రాష్ట్ర ప్రభుత్వం మాఫియాల ప్రభుత్వం. లిక్కర్ మాఫియా, గంజాయి మాఫియా, ఇసుక మాఫియా, భూకబ్జామాఫియా… దీన్ని మాఫ్ కాదు సాఫ్ చేస్తాం.

ఢిల్లీలో ఆప్ సర్కారు భారీ లిక్కర్ కుంభకోణం చేసింది. దాన్ని కేంద్రం బయటకు తీసింది. ఏ వన్ సిసోదియా అనే మంత్రి అయినా కింగ్ పిన్ మాత్రం కేజ్రీవాలే. 15 మంది మీద కేసులు నమోదైతే ఇద్దరు పరారీలో ఉన్నారు. వదిలే ప్రసక్తే లేదు. ఏపీలోనూ లిక్కర్ మాఫియాది మామూలు‌కుంభకోణం కాదు. జనం డబ్బులు ఎవరి జేబుల్లోకో పోతున్నాయి.

యూపీ జనాభా 25 కోట్లయితే అక్కడ పేదలకు 18 లక్షల ఇళ్లు కేటాయించిన మోదీజీ ఏపీకి 21 లక్షల ఇళ్లు ఇస్తే జగన్ వాటిని పేదలకు అందకుండా చేస్తున్నారు. సొంత కడప జిల్లాలోనే 18 వేల ఇళ్లకి 870image-1 మాత్రం కట్టిన జగన్ ఇక మిగతా రాష్ట్రాన్ని ఏమి ఉద్ధరిస్తారు. నాటి చంద్రబాబు, నేటి జగన్ ఇద్దరూ రాయలసీమ వారేగా? మరి రాయలసీమ యువత ఉపాధికోసం వలస పోవడం ఏమిటి? నీరు కూడా ఇవ్వలేని వారు రాష్ట్రాన్ని పాలిస్తే ఫలితమేమిటి? ప్రతి ఇంటికీ కొళాయి నీరు అని మోదీజీ పథకం, నిధులు ఇచ్చి మూడేళ్లలో పూర్తి కావాలంటే ఇప్పటి వరకూ తన వాటా నిధులే జగన్ ఇవ్వలేదు. ఇదీ ఆయనకు పేదలపట్ల చిత్తశుద్ధి.

ఏపీ ఎలా ఉండేది ఎక్కడికి దిగజారింది? గంజాయి మాఫియా చేతిలో పడింది. జగన్ గారూ.. గంజాయితో యువత జీవితాలు నాశనం చేయొద్దు. ఇతర రాష్ట్రాలకు సైతం ఈ గంజాయి పోతోంది, ఏపీకి అప్రతిష్ఠ చుట్టుకుంటోంది. ఇకనైనా ఈ దందా ఆపండి.

కేంద్ర ప్రభుత్వం ఎన్నెన్ని పథకాలు ఇస్తోంది. కానీ మీరు మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయకుండా ఆ పథకాలు అటక ఎక్కించేశారు. విశాఖ కాకినాడ పెట్రో కెమికల్ కారిడార్, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, రెండు గ్రీన్ ఫీల్డ్ ఎలక్ట్రానిక్ పార్కులు, మెడ్ టెక్, ఫుడ్ పార్కులు, నేషనల్ ఇన్వెస్టుమెంట్ జోన్… రైల్వే ప్రాజెక్టులు… ఒకటా రెండా? ఎన్నెన్ని పథకాలు ఇచ్చినా జగన్ సర్కారు సద్వినియోగం చేయటం లేదు.

యూపీలో అఖిలేష్ సర్కారు ఉండగా ఇలాగే కేంద్ర పథకాలను మూల పడేశారు. యోగీ వచ్చాక అవి పట్టాలు ఎక్కాయి. ఎంతో అభివృద్ధి జరిగింది అందుకే చరిత్రను తిరగ రాస్తూ యోగీ మళ్లీ అధికారానికిimage-2 వచ్చారు. ఏపీలోనూ బీజేపీ రావాలి. వస్తేనే అభివృద్ధి సాధ్యం. కుంభకోణాలకు పరిమితం అయ్యే కుటుంబ పార్టీల పాలన వద్దు. ప్రగతికి ప్రతీక అయిన బిజెపి గెలుపునకు యువసంఘర్షణ యాత్రే నాంది. సునీల్ దేవధర్, సత్య కుమార్, సోము వీర్రాజు నాయకత్వంలో ఏపీలో బిజెపి అధికారానికి రావటం ఖాయం.

అవినీతిలో ఏపీ నాలుగో స్థానం, తెలంగాణ రెండో స్థానం అని సర్వే వచ్చింది. ఈ రెండు రాష్ట్రాలూ మొదటి స్థానానికి పోటీ పడుతున్నాయి. ఏపీలో ఆరోగ్యం అడుగంటింది‌ ఎక్కడ చూసినా డెంగీ జ్వరాలు. ఆరోగ్య శ్రీ అంటూ ఆయుష్మాన్ భారత్ అనే ప్రధాని పధకానికి స్టిక్కర్ వేశారు. కానీ ఏం లాభం? జనానికి వైద్యం దొరకటం లేదు.

Leave a Reply