విశాఖ: పాయకరావుపేట వైసీపీలో కుమ్ములాటలు రోజురోజుకు ముదురుతున్నాయి. వైసీపీ నేతలపై కార్యకర్తలు తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు. బాబూరావు తీరుపై సొంత పార్టీ నేతలే భగ్గుమన్నారు. ఎమ్మెల్యే బాబూరావుకు వ్యతిరేకంగా వైసీపీ నేతల పాదయాత్రకు చేశారు. ఎంసీటీసీ బొలిశెట్టి గోవింద్ ఆధ్వర్యంలో పెద్దగుమ్ములూరు దగ్గర పాదయాత్ర చేశారు. బాబూరావు వద్దు జగన్ ముద్దు అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. జాతీయ రహదారిపై నేతలు బైఠాయించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. అంతకుముందు ఎంపీటీసీ బొలిశెట్టి గోవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చేయి తడపనిదే ఎమ్మెల్యే బాబురావు ఏ పనీ చేయరని మండిపడ్డారు. ప్రతి పనికీ ఓ రేటు కట్టి బేరం కుదుర్చుకుంటారని ఆరోపించారు. కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ”మా సీఎం జైలుకెళ్లాడు.. నేనూ జైలు కెళ్లడానికైనా సిద్ధమే” అని బొలిశెట్టి గోవింద్ స్పష్టం చేశారు.