నెల్లూరు రాజ‌కీయాల‌ను అస‌హ్యించుకునేలా ఎన్నిక‌ల్లో వైసీపీ వ్య‌వ‌హ‌రించింది

-దుర్మార్గపు రాజకీయాలకు వైకాపా స్వస్తి చెప్పాలి
– ఎన్నిక‌ల పోలింగ్ కేంద్రం వ‌ద్ద నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్..
నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా నెల్లూరు రూరల్ లో ఎన్నికలు జరుగుతున్న వివిధ వార్డుల్లో జరుగుతున్న ఎన్నికల పోలింగ్ సరళిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇంచార్జీ అబ్దుల్ అజీజ్ పరిశీలించారు.అనంతరం మీడియాతో బీద రవిచంద్ర మాట్లాడుతూ…
మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి నామినేషన్ల పర్వం వరకు అడగడుగునా అధికారులు వైసీపీకి తొత్తులుగా వ్యవహరించారు. కలెక్టర్ నుంచి కింది స్ధాయి అధికారుల వరకు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేల ఆదేశాలే పరమావధిగా భావించి పనిచేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వానికి ఎన్నికల సజావుగా జరిపించాలన్న ఉద్దేశం లేదు.
వైసీపీ నేతలు, కార్యకర్తలు వైసీపీ కండువాలు వేసుకుని పోలింగ్ బూతుల్లోకి వెళ్లినా అధికారులు పట్టించుకోవటం లేదు… కనీసం టీడీపీ అభ్యర్ధులు సైతం పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లే పరిస్థితి లేదు.. వైసీపీ అరాచకాలు, అక్రమాలపై కలెక్టర్, మున్సిపల్ అధికారులకు చెప్పినా పట్టించుకోవటం లేదని టీడీపీ అభ్యర్ధులు తమ గోడు వెల్లబోసుకుంటున్నారు..
మీడియా తో అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ….నెల్లూరు జిల్లాలో రాజకీయం పేరు చెప్తే అసహ్యించుకునేలా న‌గ‌ర కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వైసీపీ వ్యవహారం నడిచిందని పేర్కొన్నారు. వర్షాల తరువాత జరుగుతున్న ఎన్నికల పోలింగ్‌కు ప్రజలు విశేషంగా ఓటింగ్‌లో పాల్గొంటున్నారని తెలిపారు…కానీ అక్కడక్కడా కొన్ని డివిజన్లలో బురద కారణంగా ఓటర్లు కొందరు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు…
అధికారులు దీనిని గమనించి కొద్దిగా మట్టి వేసి ఉంటే బాగుండేద‌న్నారు….ఇది తప్పితే ప్రశాంతంగానే అధికారులు పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారని అన్నారు… ఇలాగే ఎన్నికలు ప్రశాంతంగా చివరిదాకా జరిగేలా అన్ని పార్టీల వారు వ్యవహరించాలని సూచించారు. ప్రజలు ఎవరు మంచి చేస్తే వారికే ఓటు వేస్తారు కానీ దౌర్జన్యం చేయడం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోలీస్‌స్టేష‌న్‌ల్లో ఉంచి వారిని ప్ర‌లోభాలకు గురిచేయ‌డం వైసీపీప్ర‌భుత్వానికి మంచిది కాద‌ని తెలిపారు.ఇకనైనా ఈ దుర్మార్గపు రాజకీయాలకు స్వస్తి చెప్పాలని హితవు పలికారు.