Suryaa.co.in

Andhra Pradesh

మెడికల్ కాలేజీలపై వైసీపీ నిర్లక్ష్యం!

– వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్

విజయవాడ: రెవెన్యూ సదస్సులతో సమస్యలు తగ్గుతున్నాయి.. నేషనల్ హెల్త్ మిషన్ ని పొడిగించడం ద్వారా పలు లాభాలు కలుగుతున్నాయి.. కేన్సర్ పరీక్షలు నిర్వహించడం, వ్యాధుల గురించి చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై.సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇక్కడి భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర కార్యాయలంలో శుక్రవారం నిర్వహించిన వారధి కార్యక్రమంలో ఆయన పాల్గొని, పలు ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన ఏమన్నారంటే…

అన్ని స్థాయిల్లోని పద్ధతి ప్రకారం అన్ని పదవుల నిర్ణయం ఉంటుంది. అధికారంలో భాగస్వామ్యం ఉంది కనుక ప్రజల సమస్యలు తీర్చడంలో ముందున్నాం. సూర్యఘర్ ద్వారా ప్రతీ ఇంటికి ఆదాయ వనరుగా మార్చే పనులు చేస్తున్నాం. నిత్యం ప్రజలలోకి వెళ్ళాలి… 2030 నాటికి 500 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం. పీపీపీ మోడ్ లో మెడికల్ కాలేజీలు తేవాల్సిన పరిస్ధితికి గత ప్రభుత్వం కారణం. 800 కోట్లు మాత్రమే మెడికల్ కాలేజీలకి ఖర్చు పెట్టింది గత ప్రభుత్వం. నిధులు సరిగా ఇవ్వకుండా కాలేజీల నిర్మాణం జరగకపోవడానికి గత ప్రభుత్వం కారణం. సిద్ధార్ధ మెడికల్ కాలేజీలో విద్యార్ధినుల హాస్టల్ లేదు. పీ4 మోడల్ లో మెడికల్ కాలేజీలు వచ్చిన దానికి తగిన ఫ్రీ సీట్లు ఉంటాయి.

వినతుల వెల్లువ
గుంటూరు జిల్లా నుంచి జొన్నలగడ్డ మహేశ్వరీ అనే మహిళ ఆస్తిని జమ్ముల శ్రీను అనే వ్యక్తి కబ్జా చేసి బెదిరింపులకు గురిచేసినట్టు బాధితురాలు మంత్రి సత్య కుమార్ యాదవ్ కి వివరించారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చినా పోలీసులు స్పందించలేదని మంత్రి దృష్టికి తీసుకువెళ్ళారు. మంత్రి గుంటూరు జిల్లా ఎస్పీ, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి తమ సమస్యని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

నరాలు చచ్చు పడిన పిల్లలకి సరైన వైద్య సదుపాయం కలిపించాలని అమరావతి రేర్ డిసిస్ ఆర్గనైజేషన్ వారు మంత్రి కి వినతి పత్రం అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 400 వందల మంది పిల్లలు నరాలు చచ్చు పడే వ్యాధి తో బాధపడుతున్నారని ఈ వ్యాధి నిర్దారణ కొరకు ఎయిమ్స్ లో పరీక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ వ్యాధి నిర్దారణ కొరకు హైదరాబాద్ నిమ్స్ హాస్పటల్ కి వెళ్లాల్సి వస్తుందని, ఈ దృష్ట్యా ఎయిమ్స్ లో ఇలాంటి పరీక్షలకు ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు. కేబినేట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. యునైటెడ్ మినరల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు మైనింగ్ సమస్య ను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణ, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, రాష్ట్ర అధికార ప్రతినిధి యామినీ శర్మ, వారధి సమన్వయ కర్త కిలారు దిలీప్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE