అవును.. అతడొక్కడే!

– ఆయన ఆయుధం ధరించని..అఖండ
– మాటల ఈటెలతో ఒళ్ళు జల్లెడ చేసే రఘురాముడు
భారత పార్లమెంట్.
సాక్షాత్తూ భారత ప్రధాని..కేంద్రమంత్రులు..దేశప్రజలకు ప్రాతినిధ్యం వహించే లోకసభ సభ్యులుంటారు.
ఒక సభ్యుడు తన స్వరాష్ట్రం గురించి..
అక్కడి అరాచకం గురించి ..
న్యాయస్ధానం నుండి దేవస్ధానం వరకు రైతులు మహిళలు వృద్దులు చేస్తున్న మహాపాదయాత్ర గురించి..
వారి మీద రాజ్యం సాగుస్తున్న దమనకాండ గురించి..
పోలీసు ల అత్యుత్సాహం ..ఐమీన్ ..ఓవరేక్షన్ గురించి..
వివరించారు..రైతులకు మద్దతు గా మాట్లాడారు.
దురదృష్టమేమిటంటే ..ఆయన సహచర సభ్యులు అడుగడుగునా అడ్డుతగిలారు.
సీబీఐ కేసుల గురించి ఎద్దేవా చేశారు.
తమ నాయకుడు మీదున్న లెక్కకు మిక్కిలి కేసుల గురించి అనిపించుకున్నారు.
ఎంతో ప్రతిష్ఠాత్మక సభలో యధావిధిగా..అలవాటయిన పద్దతి లో బూతులు మాట్లాడారు.
ఒళ్ళు మరచి తామున్నది పార్లమెంటు లో అన్నది మరిచారు.
నిత్యం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లో చెలరేగి మాట్లాడుతున్న మాటలు..ఇక్కడ ఈసారి వీరు మాట్లాడేశారు .
ఇతర సభ్యులు విస్తుపోయారు.
దేశవ్యాప్తంగా పరువు తీశారు.
ఆయన ఒక్కడే కావచ్చు అక్కడ..
ఆయన మీద బూతులతో విరుచుకు పడవచ్చు..
ప్రజలు చూస్తున్నారు..చూసేశారు..
రఘురామకృష్ణంరాజు మీద ఏడ్చే బదులు..ఎందుకు జనం ఆయన్ని ఓన్ చేసుకుంటున్నారో గమనించుకోవాలి.
ది డే బిగినింగ్ నుండి ..ఆయన ప్రజల సమస్యల మీద మాట్లాడుతున్నారు.
ప్రభుత్వ అవకతవక ..ప్రజావ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నిస్తున్నారు.
ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ..రాజ్యాంగం అమలు అవుతున్నదా..!?
వ్యవస్ధలు చట్టానికి లోబడి పనిచేస్తున్నాయా!?
అధికారుల ..నాయకుల దురహంకారం.‌..దౌర్జన్యం..అధికార మదం ఏ స్ధాయిలో ఉందో చూస్తున్నాము.
జనం తట్టుకోలేక పోతున్నారు..
ఊహాజనితమే అయినా..
ఎవరైనా అఖండ లాగ వస్తే బాగుండునని చూస్తున్నారు.
రాజుగారు..మొదటి నుండి ప్రజల కోణం లో మాట్లాడుతున్నారు..మద్దతు గా నిలుస్తున్నారు.
రాష్ట్రానికి చెందిన యంపీలు..మంచి మాట్లాడలేక పోయినా..కనీసం..అడ్డుతగలకుండా ఉంటే బాగుండేది.
అడ్డుతగిలినా ..బూతులు మాట్లాడకుండా ఉంటే బాగుండేది.
ఏం చేస్తాం…యంపీలు గా మళ్ళీ వచ్చే ఉద్దేశం లేదు.
అని వారు నిర్ణయించుకున్న తర్వాత ..ఎవరైనా ఏమి చెప్పగలరు.
రాజకీయాల్లో హత్యలుండవు..ఆత్మహత్యలే ఉంటాయి.
ఇరవై రెండు మందిలో..మళ్ళీ రాజుగారే కనిపిస్తారు పార్లమెంటులో.
వారు తమ పోరాటం ఆపకూడదు..
ప్రజల గొంతై వినిపించాలి.
చరిత మరువదు వారి తీరు.
నిజమే.. ఈయన ఆయుధం ధరించని..అఖండ!
మాటల ఈటెలతో ఒళ్ళు జల్లెడ చేసే రఘురాముడు..!!

– అడుసుమిల్లి శ్రీనివాసరావు