Suryaa.co.in

Andhra Pradesh

అవును నిజమే.. మిమ్మల్ని ఎవరూ పీకలేరు. కానీ..

అవును నిజమే.. జగన్ మోహన్ రెడ్డి.. మీరు విపరీతంగా కరెంట్ కోతలు విధిస్తున్నా.. అడ్డుగోలుగా విద్యుత్ ఛార్జీలు పెంచేస్తున్నా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవ్వరూ మీ వెంట్రుక కూడా పీకలేకపోతున్నారు.

మీరు ముస్లింలకు, బడుగు బలహీన వర్గాలకు పెళ్లి కానుక ఇవ్వకుండా మోసం చేస్తుంటే ఎవ్వరూ ఏమీ పీకలేకపోతున్నారు.

చంద్రన్న బీమాను నిర్వీర్యం చేసి వైఎస్సార్ బీమా పేరుతో ఆ పథకానికి తూట్లు పొడిస్తిరి.. ఐనా కూడా ఎవ్వరూ ఏమీ పీకలేకపోతున్నారు.
రాష్ట్రంలో కరోనా కష్ట కాలంలో మీరు CM రిలీఫ్ ఫండ్‌ను ఎత్తేస్తే ఎవ్వరూ ఏమీ పీకలేకపోయారు.

నిరుద్యోగులను జాబ్ క్యాలండర్ పేరుతో మోసం చేస్తే ఎవ్వరూ ఏమీ పీకలేకపోయారు.

మీ బాబాయిని హత్య చేయిస్తే ఎవ్వరూ ఏమీ పీకలేకపోయారు.
రైతులకు ఇవ్వాల్సిన నష్ట పరిహారం, సబ్సిడీలు అన్నీ ఎత్తేస్తే ఎవ్వరూ ఏమీ పీకలేకపోయారు.

పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేక పోయారు, రాజధానితో మూడు ముక్కల ఆట ఆడుతూ కాలయాపన చేస్తున్నారు అయినా ఎవ్వరూ పీకలేకపోయారు.

అడ్డుగోలుగా పన్నులు విధిస్తూ, నిత్యావసర ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేస్తే ఎవ్వరూ ఏమీ పీకలేకపోయారు.
SC, ST, BC కార్పొరేషన్ సబ్సిడీ రుణాలు ఎత్తేస్తే ఎవ్వరూ ఏమీ పీకలేకపోయారు.
అడ్డుగోలుగా ఇసుక దోపిడీ చేస్తున్నా, దౌర్జన్యాలు చేస్తున్నా ఎవ్వరూ ఏమీ పీకలేకపోయారు.

రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నా ఎవ్వరూ ఏమీ పీకలేకపోయారు.
పేదలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు తీసేస్తే ఎవ్వరూ ఏమీ పీకలేకపోయారు.
మీ సొంత కంపెనీల నుంచి నాసిరకం మద్యం బ్రాండ్లు తెచ్చి విపరీతమైన రేట్లు పెట్టి ప్రజల దగ్గర డబ్బులు గుంజుతున్నా ఎవ్వరూ ఏమీ పీకలేకపోయారు.
ఉపాధి హామీ బిల్లులు ఇవ్వక కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఎవ్వరూ ఏమీ పీకలేకపోయారు.

ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి.. రాస్తే రామ కోటి అవుతాయి. అందువల్ల మీరు చెప్పింది నిజమే మీరు ఏమి చేసినా ప్రస్తుతం ఎవ్వరూ ఏమీ పీకలేలేరు. కానీ 2024లో ప్రజలు తమ ప్రతాపం ఏమిటో ఓటు ద్వారా చూపిస్తారు.

– రామ్మోహన్, జర్నలిస్టు

LEAVE A RESPONSE