Suryaa.co.in

Andhra Pradesh

అది ముమ్మాటికీ జగన్ మేడ్ మిస్టేక్

  • ఏలేరు వరద నష్టం..మాన్ మేడ్ మిస్టేక్..యస్..జగన్ మేడ్ మిస్టేక్
  • రివర్స్ టెండరింగ్ పేరుతో ఏలేరు ఆధునికీకరణను అటకెక్కించిన వైసీపీ ప్రభుత్వం
  • ఇప్పుడు ప్రభుత్వం, అధికారుల అప్రమత్తత, నిరంతర పర్యవేక్షణతోనే భారీ నష్టం తప్పింది
  • నిరంతరం వరద బాధితుల మధ్యే ఉన్న సీఎం చంద్రబాబు నాయుడిని ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించడం హాస్యాస్పదం
  • జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన చూస్తుంటే…పిచ్చి ముదిరి పాకాన పడినట్టోంది
  • నెల్లూరులో మీడియాతో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఏలేరు రిజర్వాయర్‌లో వరద పోటెత్తింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల చింతపల్లి, వై. రామవరం, కేడీపేట ప్రాంతాల్లో ఒక్కరోజులోనే 15 సెం.మీ వర్షపాతం నమోదైంది. దీంతో ఏలేరు రిజర్వాయర్‌కి 47 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం చేరి పంటలు మునిగిపోయాయి. వర్షాలతో భారీగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం సకాలంలో అప్రమత్తం చేయడంతో ప్రజలకు పెద్దగా నష్టం కలగలేదు.

2003లో 42 వేల క్యూసెక్కుల వరద రాగా, ఈసారి 47 వేల క్యూసెక్కుల వరద వచ్చినా ప్రభుత్వం పర్యవేక్షణలో నష్టాన్ని తగ్గించగలిగింది. అయితే, 2020లో 17 వేల క్యూసెక్కుల వరదకే కాకినాడ వరకు ముంపు చోటుచేసుకోవడంతో జగన్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి.

ఇప్పుడు 47 వేల క్యూసెక్కుల ప్రవాహం వచ్చినా నష్టపరిధిని తగ్గించడంలో ప్రభుత్వం చాలా వరకు సఫలమైంది. వరద బాధితులను పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి టపాసులు కాల్చుకుంటూ , ముద్దులు పెట్టుకుంటూ, చేతులూపుకుంటూ వెళ్లడం హాస్యాస్పదం. ఏలేరు వరద మాన్ మేడ్ మిస్టేక్ అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు… దానికి సోమిరెడ్డి స్పందిస్తూ..

ఎస్…అది ముమ్మాటికీ మాన్ మేడ్ మిస్టేకే…ఆ మాన్ జగన్మోహన్ రెడ్డే

ఏలేరు వరదకు కారణమైన కాలువలో ప్రవాహ స్థాయిని 10 వేల క్యూసెక్కుల నుంచి 70 వేల క్యూసెక్కులకు పెంచేందుకు 2019లో మా ప్రభుత్వం రూ.292 కోట్లు పనులకు టెండర్ పిలిచింది. టెండర్ ప్రక్రియ పూర్తయి పనులు మొదలు పెట్టే సమయంలో మా ప్రభుత్వం మారి వైసీపీ అధికారంలోకి వచ్చింది.

వైసీపీ హయాంలో రివర్స్ టెండరింగ్ పేరుతో కాలువ ఆధునీకరణ పనులను మూలనపెట్టేశారు. ఐదేళ్ల పాలనలో ఆ కాలువ పనుల జోలికే పోలేదు..ఇదే జగన్మోహన్ రెడ్డి చేసిన మిస్టేక్. తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని రాజకీయం చేసే జగన్మోహన్ రెడ్డికి క్యూసెక్, టీఎంసీ, ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లోకు తేడా తెలియదు. వరద బాధితులను పరామర్శించడం కూడా చేతకాని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దోచుకునే అవకాశం లేకుండా పోయిందని కుట్రపూరిత రాజకీయాలు మొదలుపెట్టాడు.

ప్రజలు వైసీపీని 11 సీట్లకు పరిమితం చేసి, కూటమికి 164 సీట్లు ఇస్తే ఆయనకు రాష్ట్రపతి పాలన కావాలంట. అర్జెంటుగా ఆయన సీఎం సీటులో కూర్చోవాలని కలలు కంటూ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి పాలనలో కీలక శాఖలైన ఇరిగేషన్, వ్యవసాయాన్ని మూతేశారు.

2014-19 మధ్య మా ప్రభుత్వ హయాంలో రాష్ట్ర విభజన కారణంగా ఆర్థిక కష్టాలున్నప్పటికీ ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూ.63 వేల కోట్లు ఖర్చుపెట్టాం. 2019-24 మధ్య అదే స్థాయిలో పనులు జరగాలంటే పెరిగిన ఎస్ఎస్ఆర్ ధరల ప్రకారం రూ.80 వేల కోట్లు ఖర్చు పెట్టాలి. కానీ వైసీపీ ప్రభుత్వం ఖర్చు పెట్టింది కేవలం రూ.20 వేల కోట్లే. ఆ నిధుల విషయంలో కూడా కోస్తా ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు.

పెద్దిరెడ్డి, చిన్నిరెడ్డితో పాటు ఆ రెడ్డి..ఈరెడ్డిల ప్రయోజనాల కోసం వాళ్లు కోరిన జిల్లాల్లో, వారికే ఇచ్చి ఆ నిధులను కూడా రైతులకు ఉపయోగపడకుండా చేశారు

ఆ ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ శాఖ మంత్రి రికార్డింగ్ డాన్సులు, స్టెప్పులకు పరిమితమయ్యారు. సీఎం పబ్జీ ఆటతో గడిపేశారు..ఇక ఇరిగేషన్ శాఖను పట్టించుకునేదెవరు. ఏలేరు రిజర్వాయర్ పై నిరంతరం పర్యవేక్షణ జరిపి నష్టనివారణ చేసిన ఇంజనీరింగ్ అధికారులను అభినందించాల్సింది పోయి విమర్శించడం ఆయన నైజానికి నిదర్శనం.

ఇన్ని దుర్మార్గాలు చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడిపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది. విజయవాడకు వెళ్లి చంద్రబాబు నాయుడిపై ఆరోపణలు చేస్తాడు..ఏలేరుకు పోయి కూడా చంద్రబాబు నాయుడినే తిడతాడు. ఊహించని వరదలతో రెండు రాష్ట్రాలు మునిగిపోతే కామన్ సెన్స్ లేకుండా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించడం దురదృష్టకరం.

జగన్మోహన్ రెడ్డి ధోరణి చూసి ఆయనను మాడ్ అనాలో..సైకో అనాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. పిచ్చి ముదిరి పాకాన పడటంతోనే ఇలా ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తున్నాడు. వరదల సమయంలో ప్రజలకు అండగా నిలవడంలో చంద్రబాబు నాయుడు రోల్ మోడల్ గా నిలిచారని ఈ దేశమంతా చర్చించుకుంటోంది. బురద, వరద ప్రవాహాన్ని సైతం లెక్కచేయకుండా పడవలు, జేసీబీల్లో తిరుగుతూ పది రోజుల పాటు ప్రజల మధ్యే ఉన్నారు.

సీఎం నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు రోజుల తరబడి పొర్లుకట్టలపైనే ఉండి నష్టనివారణ చర్యలు చేపట్టారు. ఐదేళ్లూ తాడేపల్లి ప్యాలెస్ ను వదిలి బయటకు రాని జగన్మోహన్ రెడ్డి 13 కేసులతో లక్షల కోట్లు దోచుకోవడంలో రోల్ మోడల్ గా నిలిచాడు.

వరద బాధితులకు రూ.కోటి విరాళం ఇచ్చానని ఆయన గొప్పలకు పోతున్నాడు. దేశంలో అత్యంత ధనవంతులుగా రెండు రాజకీయ కుటుంబాలు ఉంటే..వారిలో ఒకరు..ఈ జగన్మోహన్ రెడ్డి. ప్రజాధనం దోచుకుని రూ.3.5 లక్షల కోట్ల ఆస్తులు పోగేసుకున్న జగన్మోహన్ రెడ్డి కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి రూ.కోటి మాత్రమే ఇస్తాననడం విడ్డూరం. ఏలేరు రిజర్వాయర్ వరద ముమ్మాటికీ జగన్ మేడ్ మిస్టేకే అని సోమిరెడ్డి అన్నారు.

LEAVE A RESPONSE