Suryaa.co.in

Telangana

మీ ముఖాలకు ప్రభుత్వం నడపడం చేతకావడం లేదు

– ప్రజలు రేవంత్ రెడ్డిని గెలిపించలేదు.. కేసీఆర్ ను ఓడించారు
– పదినెలల్లోనే రేవంత్ ప్రజల్లో పలుచన అయ్యారు.
– కాంగ్రెస్ అంటేనే స్కాములమయం
– సొంత మంత్రులు జైలుకు పోయిన చరిత్ర వారిది
– బీహార్ వెళ్లి మమ్ముల్ని గెలిపించండని రాహుల్ గాంధీ అడుగుతున్నారు
– మిమ్మల్ని గెలిపిస్తే తెలంగాణలో, హిమాచల్ ప్రదేశ్లో, కర్ణాటకలో ఏం చేస్తున్నారు
– లంచం ఇస్తే తప్ప రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వలేని దుస్థితి
– కాంగ్రెస్ ఇచ్చిన హామీల మీద, చేస్తున్న మోసాల మీద అబిడ్స్ చౌరస్తాలో చర్చకు సిద్ధమా ?
– పార్టీలో వైరుధ్యాలు ఉంటాయి.. బీజేపీలో ఇంత కాంపిటేషన్ ఎప్పడు లేదు.
– పోటీ పెరుగుతుంది అంటే పార్టీ బలంగా ఉన్నట్టు
– పార్టీని ఎవరు నడపాలని పెద్దలు నిర్ణయిస్తారు
– ఎంపీ ఈటల రాజేందర్.
– రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాసరెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ఎంపీ ఈటల

చోటా మన్ సే కోయీ బడా నహీ హో సక్తా.. టూటే దిల్ సే కోయీ కడా నహీ సక్తా.. అని మాజీ భారత ప్రధాని వాజిపేయి చెప్పారు. ఈరోజు వాజపేయి శతజయంతి సందర్భంగా ఆయన మాటలు గుర్తుచేసుకుందాం.

లీడర్ ఎదిగిన తరువాత అందరివాడుగా ఉంటారు తప్ప కొందరివాడిగా ఉండడు. మనుషులు కూడా సమాజ పరిణామ క్రమాన్ని పట్టి మారాలి. నాయకుడికి అభిమానులుంటారు.. కానీ పార్టీని కన్నతల్లి అనే భావన ఉండాలి. బాధ్యతలు పెరిగే కొద్దీ ఎక్కువ సమస్యలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. మాట్లాడడం తేలిక, పనిచేయడం కష్టం.

ఎల్బీ నగర్ కి నేను లోకల్. ఇక్కడే హాస్టల్ లో ఉండి చదువుకున్న. ఎన్నో ఏళ్లుగా ఈ నియోజకవర్గంలో బీజేపీకి బలం ఉంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో పోలైన ఓట్లలో 65 శాతం ఓట్లు సాధించి, 1.06 లక్షల మెజారిటీ సాధించిన నియోజకవర్గం ఎల్బీ నగర్. స్థానికంగా మన ప్రజాప్రతినిధులు ఉండడం వల్లనే ఇది సాధ్యమయ్యింది.

నాయకులు ఉంటేనే పార్టీకి పట్టు ఉంటుంది. రేపటి ghmc ఎన్నికల్లో కూడా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నంబర్ వన్ గా ఉంటుంది.. గ్రేటర్ మీద ఎగిరే జెండా కాషాయ జెండానే. దాన్ని ఆపగలిగే శక్తి ఎవరికీ లేదు. ప్రజలు రేవంత్ రెడ్డిని గెలిపించలేదు, కేసీఆర్ ను ఓడించారు. కానీ పదినెలల్లోనే రేవంత్ ప్రజల్లో పలుచన అయ్యారు. కాంగ్రెస్ అంటేనే స్కాములమయం. సొంత మంత్రులు జైలుకు పోయిన చరిత్ర వారిది.

బీహార్ వెళ్లి మమ్ముల్ని గెలిపించండని రాహుల్ గాంధీ అడుగుతున్నారు.. మిమ్మల్ని గెలిపిస్తే తెలంగాణలో, హిమాచల్ ప్రదేశ్లో, కర్ణాటకలో ఏం చేస్తున్నారు?
లంచం ఇస్తే తప్ప రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఈ అంశం మీద, కాంగ్రెస్ ఇచ్చిన హామీల మీద, చేస్తున్న మోసాల మీద అబిడ్స్ చౌరస్తాలో చర్చకు సిద్ధమా అని సవాలు చేస్తున్నా. రేవంత్ ఐదేళ్లు నిలబడి ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసింది లేదు.. మంత్రిగా పనిచేసిన అనుభవం లేదు. ఇన్ని హామీలు ఎలా ఇస్తారు అని అడిగితే.. మమ్ముల్ని గుడ్డిగా ద్వేషిస్తారా అని విమర్శించారు.

కడుపుకట్టుకొని పనిచేస్తే సంవత్సరానికి 40 వేల కోట్లు పెట్టడం పెద్ద సమస్య కాదు అని మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ఇవాళ ఎటు పోయాయని అడుగుతున్న? 15 శాతం లంచం ఇవ్వకుండా కాంట్రాక్టర్స్ కి బిల్లులు ఇవ్వడం లేదు. వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మీ ముఖాలకు ప్రభుత్వం నడపడం చేతకావడం లేదు. కాంగ్రెస్ మళ్లీ గెలవదని ప్రజలనుకుంటున్నారు.

బీఆర్ఎస్ ను నమ్మే పరిస్థితి లేదు. వారు చేసినవి ఏకరువు పెడితే.. ప్రజలు ఎన్నటికీ నమ్మరు. డబ్బులు పెట్టి సభలు పెడితే ప్రజలు వారివైపు వస్తారని అనుకుంటున్నారు. ప్రజల హృదయాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కి చోటు లేదు. ముమ్మాటికే ఆదరించేది బీజేపీనే.. పవర్ అనే ఆర్బిట్ లోకి ఎంటర్ అయ్యాం.

ఈ రాష్ట్రం అప్పులు తీరాలన్నా, పురోగమనం చెందాలన్నా మోదీ అండలేకుండా సాధ్యంకాదని ప్రజలకు అర్థం అయ్యింది. 2026 లో, 28లో ఎప్పడు ఎన్నికలు వచ్చినా గెలిచేది బీజేపీనే. 45 ఏళ్లుగా బీజేపీ కార్యకర్తల త్యాగాలుచేసి కళ్లలో వత్తులు వేసుకొని అధికారం కోసం ఎదురుచూస్తున్నారు.

దేశంలో ఇద్దరు పార్లమెంట్ మెంబర్స్ గెలిస్తే ఒకటి తెలంగాణ ఇంకోటి గుజరాత్ నుండి గెలిచారు. గుజరాత్ లో 27 ఏళ్ల తరువాత కూడా మళ్లీ బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈ సారి మన దగ్గర కూడా అధికారం రాబోతుంది.

పార్టీలో వైరుధ్యాలు ఉంటాయి.. బీజేపీలో ఇంత కాంపిటేషన్ ఎప్పడు లేదు. పోటీ పెరుగుతుంది అంటే పార్టీ బలంగా ఉన్నట్టు పార్టీని ఎవరు నడపాలని పెద్దలు నిర్ణయిస్తారు. పార్టీని గెలిపించడంలో భుజం భుజం కలిపి నడుద్దాం. కొట్లాడే వారిదే విజయం. పోరాటమే మనల్ని బ్రతికిస్తుంది. దిమ్మ తిరిగాలి. పనులు చేస్తామని హామీలు ఇవ్వండి..

కేంద్రంలో అధికారంలో ఉన్నది మనం కేంద్రం అండ లేకపోతే రాష్ట్రంలో అభివృద్ధి లేదని మర్చిపోకండి అని ఈటల రాజేందర్ అన్నారు.

LEAVE A RESPONSE