Suryaa.co.in

Andhra Pradesh

అల్లూరి, పింగళి, వివేకానంద లను యువత ఆదర్శంగా తీసుకోవాలి

– బిజెపి రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్

అల్లూరి సీతారామరాజు 1897 జూలై 4వ తేదీ విజయనగరం జిల్లా,పాండ్రంగి గ్రామంలో తన తాతగారి ఇంట్లో జన్మించారు. రాజు తల్లిదండ్రులు సూర్యనారాయణమ్మ, వెంకటరామరాజు అని బిజెపి రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ తెలిపారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు జయంతి, పింగళి వెంకయ్య, స్వామి వివేకానంద లో వర్థంతి కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మధుకర్ మాట్లాడారు.

మన్యం ప్రజల కష్టాలను కడతేర్చడానికి బ్రిటిష్ వారి దోపిడిని ఎదుర్కోవడానికి గిరిజనలకు అండగా నిలిచి పోరాటం చేయాలని సీతారామరాజు నిర్ణయించుకున్నాడు. 1922 ఆగస్టు 22,23,24 తేదీల్లో మన్యంలో తిరుగుబాటు ప్రారంభమైంది.

రంపచోడవరం ఏజెన్సీలోని చింతపల్లి, కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్లపై సుమారు 300 మంది విప్లవకారులతో దాడిచేసి,రికార్డులు చింపివేసి,తుపాకులు,మందుగుండు తీసుకువెళ్లిపోయారు. రామరాజును పట్టుకోవడం కోసం బ్రిటిష్ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేసింది. చివరికి రాజును ఎలాంటి విచారణ లేకుండా బ్రిటిష్ సైన్యం కాల్చి చంపేశారు. అలాగే పింగళి వెంకయ్య, స్వామి వివేకానంద జీవితాలను వివరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నేతలు ఉప్పలపాటి శ్రీ నివాస్ రాజు, మువ్వల వెంకట సుబ్బయ్య, నెల్లూరు జిల్లా మాజీ అధ్యక్షుడు భరత్ కుమార్ యాదవ్, మైనారిటీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ బాషా, నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE