Suryaa.co.in

Andhra Pradesh

బందరు పోర్టు రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారు

-బందరు పోర్టు నిర్మాణానికి గ్రహణాలు తొలగిపోయాయి
-బందరు వాసుల కలను నేరవేర్చాం
-4 పోర్టుల ద్వారా లక్షల్లో ఉద్యోగాలు వస్తాయి
-రూ. 420 కోట్లతో ఫిషింగ్‌ హార్బర్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి
-రూ. 550 కోట్లతో మెడికల్‌ కాలేజ్‌ నిర్మాణం వేగంగా జరుగుతోంది
-గోల్డ్‌ కవరింగ్‌ పరిశ్రలకు విద్యుత్‌ ఛార్జీలను తగ్గించాం
-డీబీటీ ద్వారా 2.10 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారులకు అందించాం
-టీడీపీకి గజదొంగల ముఠా తోడైంది.. ఈ ముఠా సభ్యులు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5, ఓ దత్తపుత్రుడు
-వీళ్ల పని దోచుకోవటం.. దాచుకోవటం..తినుకోవటం
-పేదలకు ప్రవేశం లేని గేట్‌వే కమ్యూనిటినీ ప్రభుత్వ సొమ్ముతో కట్టుకోవాలని చూశారు
-పేదలకు చంద్రబాబు సెంటు భూమి కూడా ఇవ్వలేదు
-ఈనెల 26వ తేదీన అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ
-మీకు మంచి జరిగితే మీ బిడ్డకు తోడుగా నిలవండి
-బందర్ స‌భ‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

మ‌చిలీప‌ట్నం: పేదల ఇళ్లను దారుణంగా అడ్డుకుంటున్న ద్రోహి చంద్రబాబు అని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మండిప‌డ్డారు. అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు రాకుండా అడ్డుకుంది ఈ చంద్ర‌బాబే అని విమ‌ర్శించారు. చంద్రబాబుకు మానవత్వమే లేకుండా పోయింద‌న్నారు. పేదలకు చంద్రబాబు సెంటు భూమి కూడా ఇవ్వలేద‌ని గుర్తు చేశారు. టీడీపీకి గజదొంగల ముఠా తోడైంది.. ఈ ముఠా సభ్యులు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5, ఓ దత్తపుత్రుడు. వీళ్లెవరూ పేదల వద్దకు వచ్చి మంచిచేశాం ఓట్లేయండని అడిగే దమ్ములేద‌న్నారు. చంద్రబాబు నాయుడుకు పేదల కష్టాలు తెలుసా? అని ప్ర‌శ్నించారు.

పేదల తలరాతను మార్చాలని నిర్ణయించామ‌ని, అమరావతిలో 50వేల మంది పేదలకు ఈనెల26వ తేదీన ఇళ్ల స్థలాల పంపిణీ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. మీ బిడ్డ ప్రజలనే నమ్ముకున్నాడని, మీకు మంచి జరిగితే మీ బిడ్డకు తోడుగా నిలవండి అంటూ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. మచిలీపట్నం ప్రజల చిరకాల కల ఎట్టకేలకు సాకారం చేస్తూ సీఎం వైయ‌స్‌ జగన్‌ బందరు పోర్టు నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌సంగించారు.

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఏమన్నారంటే.. 
  • ఈ రోజు మీ అందరి చిరునవ్వుల మధ్య, మీ అందరి చిక్కటి ఆప్యాయతల మధ్య మీ బిడ్డ, మీ అన్నా, మీ తమ్ముడికి తోడుగా నిలబడుతూ ఆత్మీయతలను పంచిపెడుతున్న ప్రతి ఒక్కరికీ ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
  • దేవుడి దయతో ఈ రోజు మరో మంచి కార్యక్రమం మీ అందరి చల్లని ఆశీస్సులతో జరుగుతోంది. బందర్‌ పోర్టు అన్నది ఒక చిరకాల స్వప్నం.
  • మనందరికి ఒక వైపు సముద్రం కనిపిస్తుంది. మరో వైపు మహానగరం. అయినా కూడా బందర్‌కు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ప్రాంతంలో పోర్టు నిర్మాణం జరిగితే బందర్‌ కూడా ఏ ముంబాయి, చెన్నై మాదిరిగానో మహానగరంగా ఎదుగుతుందన్న సంగతి తెలిసి ఉన్నా కూడా అది ఒక నెరవేరని కలగా మిగిలించారు. ఆపరిస్థితిని పూర్తిగా మారుస్తూ మనందరి ప్రభుత్వం ఈ రోజు అన్ని కోర్టు కేసులను అధిగమించి, భూసేకరణ పూర్తి చేసి, అన్ని అనుమతులు తీసుకొచ్చి ఫెనాన్షియల్‌ క్లోజర్‌ను పూర్తి చేసి, టెండర్లు ముగించి, ఈ రోజు పోర్టు నిర్మాణ పనులు ప్రారంభించాం.
  • కాసేపటి క్రితం ఇ క్కడికి రాకముందు దాదాపుగా రూ.5156 కోట్లతో నాలుగు బెర్తులు ఇక్కడే రానుంది.
  • వార్షిక సామర్థ్యం 35.12 మిలియన్‌ టన్నులు
  •  బెర్తుల సంఖ్య 4
  •  భూసేకరణ.. 1,923 ఎకరాలు
  • ఎన్‌హెచ్‌ 216ను అనుసంధానం చేస్తూ 6.5 కి.మీ. మేర నాలుగు లేన్ల రహదారి
  • పెడన రైల్వేస్టేషన్‌ నుంచి పోర్టు వరకు 7.5 కి.మీ రైల్వే లైన్‌ నిర్మాణం
  •   బందరు కెనాల్‌ నుండి 11 కి.మీ పైప్‌లైన్‌ ద్వారా 0.5 ఎంఎల్‌డీ (మిలియన్‌ లీటర్స్‌ పర్‌ డే) నీటి సరఫరా
  •  పెడన 220 కేవీ సబ్‌స్టేషన్‌ నుండి 15 ఎంవీఏ (మెగా వోల్ట్‌ యాంప్‌) విద్యుత్‌ సరఫరా
  •  ఆగ్నేయాసియాకు ముఖద్వారంగా 974 కి.మీ తీరంతో దేశంలోనే రెండో అతిపెద్ద సముద్ర తీరంగల రాష్ట్రంలో ప్రస్తుతమున్న ఆరు పోర్టులకు అదనంగా ఏపీ మారిటైమ్‌ బోర్డు నాలుగు పోర్టులను అభివద్ధి చేస్తోంది.
  • ఇప్పటికే ఉన్న విశాఖపట్నం మేజర్‌ పోర్టు, ఐదు నాన్‌ మేజర్‌ పోర్టుల ద్వారా ఏటా 320 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థా్యన్ని రాష్ట్రం కలిగి ఉంది.
  •  కొత్తగా నిర్మిస్తున్న పోర్టుల ద్వారా 2025–26 నాటికి అదనంగా మరో 110 మిలియన్‌ టన్నుల రవాణా సామర్థ్యం అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
  •   పారిశ్రామికాభివద్ధి, వాణిజ్య కార్యకలాపాలకు ఊతమిచ్చేలా కొత్తగా నిర్మిస్తున్న మచిలీపట్నం పోర్టు సమీపంలో పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు 4,000 ఎకరాల సాల్ట్‌ భూములను ప్రభుత్వం గుర్తించింది.
  •   తీర ప్రాంతం మరియు పోర్టు పరిసర ప్రాంతాల పారిశ్రామికీకరణ దిశగా అడుగులు వేయడంతో పాటు పోర్టు అనుసంధానిత లాజిస్టిక్స్‌ ఏర్పాటు ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు అవకాశం లభించనుంది.
  •   ప్రతీ 50 కి.మీకు ఒక పోర్టు లేదా ఫిషింగ్‌ హార్బరు ఉండేలా మత్స్యకారులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో 10 ఫిషింగ్‌ హార్బర్లు, ఆరు ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లను ప్రభుత్వం అభివద్ధి చేస్తోంది.
  •   వీటిద్వారా 2035 నాటికి రాష్ట్ర సముద్ర వాణిజ్య విలువ 20 బిలియన్‌ డాలర్లకు చేర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.
  •  ఇక రాష్ట్రానికి ప్రకృతి ప్రసాదించిన అతిపెద్ద సముద్ర తీర ప్రాంతాన్ని అభివద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళికతో దేశంలోని అతిపెద్ద పోర్టుల్లో ఒకటిగా, రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో కీలకంగా మార్చే విధంగా మచిలీపట్నం పోర్టును అభివృద్ధి చేస్తున్నాం,
  • ఈ పోర్టు నిర్మాణానికి గతంలో చాలా అడ్డంకులు చూశాం. అప్పట్లో చంద్రబాబు ఈ పోర్టు రాకూడదని అడుగులు వేశారు. 22 గ్రామాలు తీసుకోవాలి, 33 వేల ఎకరాలు తీసుకోవాలని భూములను నోటిఫై చేశారు. ఆ భూములు అమ్ముకునే స్వేచ్ఛ లేకుండా ఇబ్బంది పెట్టారు. ఇది చేస్తే ఇక్కడికి పోర్టు రాకుండా పోతుందని చంద్రబాబు అడుగులు వేశారు. కారణం ఇక్కడ పోర్టు రాకపోతే అమరావతిలో తాను, తన  బినామీలు కొన్న భూములకు విలువ వస్తుందని ఇక్కడి ప్రజలకు ద్రోహం చేశారు.
  • ఈ పోర్టుకు సంబంధించి ప్రతి రైతు ముఖంలో చిరునవ్వు చూడాలని, రైతులను సంతోషపెట్టేలా భూ సేకరణ ఉండాలని నేను చెప్పాను. మనస్ఫూర్తిగా రైతులు ఇచ్చిన భూముల్లో ఈ రోజు పోర్టు నిర్మిస్తున్నాం.
  • ఇక్కడికి పోర్టు ఆధారిత పరిశ్రమలు వస్తాయి. ఇక్కడే ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయి. వాటిలో కూడా పరిశ్రమలు వస్తాయి. లక్షల ఉద్యోగాలు వస్తాయి.
  • పోర్టు నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న గ్రహణాలన్నీ తొలగిపోయాయి. పోర్టు పనులు వేగవంతం అవుతాయి. మరో 24 నెలల్లోనే ఈ ప్రాంతం రూపురేఖలు మార్చబోతున్నాం. ఈ సముద్రతీరంలో పెద్ద పెద్ద ఓడలు కనిపిస్తాయి.
  • మచిలీపట్నం రూపురేఖలు మన ప్రభుత్వం ఎలా మార్చుతుందో చూడండి. మీ కళ్లేదుటే మార్పులు చూస్తున్నారు. గతంలో బందర్‌ జిల్లా ముఖ్య పట్టణం అయినా కూడా ఏ ఒక్క అధికారి కూడా  ఇక్కడ ఉండే పరిస్థితి లేదు. వారానికి ఒక రోజు బందర్‌కు కేటాయిస్తే అదే పది వేలు అనుకునే పరిస్థితిలో ఉన్న జనానికి మంచి జరిగిస్తూ ఈ రోజు ఇక్కడే ఈ జిల్లాలోనే కలెక్టర్‌ ఒక్కరే కాదు..మొత్తం యంత్రాంగం అంతా ఇక్కడే ఉండేలా మచిలీపట్నాన్ని జిల్లా కేంద్రంగా చేయడమే కాకుండా కలెక్టర్‌ ఇక్కడే ఉంటారు.
  • దాదాపుగా రూ.550 కోట్లతో మెడికల్‌ కాలేజీ నిర్మాణం దాదాపుగా పూర్తి కావోస్తోంది. ఈ ఏడాదిలోనే అడ్మిషన్లు కూడా జరుగనున్నాయి. దీని వల్ల అవనిగడ్డ, పెడన, గుడివాడ, కైకలూరు ప్రజలకు గొప్పగా వైద్యసేవలు అందే పరిస్థితి వస్తుంది.
  • ఏ సమయంలోనైనా మత్స్య సంపదను ఒడ్డుకు తెచ్చుకునేందుకు నాగూర్‌మీరా ఆశీస్సులతో ఇక్కడే మరో రూ. 420 కోట్లతో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణ పనులు వేగంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే 60 శాతం పనులు పూర్తి అయ్యాయి. మరో నాలుగు నెలల్లో పనులు పూర్తి అయి అందుబాటులోకి వస్తుంది.
  • నా పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు గోల్డ్‌ కవరింగ్‌ మద్దతుగా కరెంటు చార్జీలు రూ.7.60 నుంచి రూ.3.75కు తగ్గించాం. దాదాపుగా 40 వేల మందికి మంచి జరిగిస్తూ అడుగులు వేశాం.
  • బందర్‌ జిల్లా ముఖ్య పట్టణంగా మార్చేందుకు భారీ స్థాయిలో వర్తకానికి, వాణిజ్యానికి, పారిశ్రామిక అభివృద్ధికి రాబోయే రోజుల్లో కేరాఫ్‌ అడ్రస్‌గా మచిలీపట్నం ఉండబోతుంది.
  • మనందరి ప్రభుత్వం తీసుకువచ్చిన మార్పులు గమనిస్తే..మచిలీపట్నం పోర్టు సామర్ధం 320 మిలియన్‌ టన్నులు అయితే. 2025–26 నాటికి మరో రూ.110 మిలియన్‌ టన్నుల సామర్ధ్యం పెంచుతాం.
  • రాష్ట్రంలో ఉన్న పోర్టులు 4 లోకేషన్లలో ఆరు పోర్టులు ఉంటే, మీ బిడ్డ ప్రభుత్వంలో అక్షరాల రూ.16 వేల కోట్లతో మూడు గ్రీన్‌ ఫీల్డ్‌ పోర్టుల పనులు వేగంగా జరుగుతున్నాయి.
  • ఇప్పటికే కాకినాడ వద్ద గేట్‌ వే పోర్టు నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ నాలుగు పోర్టుల్లో కనీసం అంటే 25 వేల ఉద్యోగాలు వస్తాయి. ఈ పోర్టులు అందుబాటులోకి వస్తే లక్ష ఉద్యోగాలు వస్తాయి. ఇవే కాకుండా పోర్టు ఆధారిత పరిశ్రమలు కూడా వస్తాయి. లక్షల్లో ఉద్యోగాలు మన పిల్లలకు వస్తాయి.
  • గంగపుత్రుల కళ్లలోమరింత కాంతులు నింపడానికి, చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా మత్స్యకారులకు అండగా అడుగులు వేశాం. ఈ రోజు రాష్ట్రంలో షిపింగ్, ఫిషింగ్‌ హార్బర్లు నిర్మిస్తున్నాం. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో 10 ఫిషింగ్‌ హార్బర్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి. మరో నాలుగు నెలల్లో 5 ఫిషింగ్‌ హార్బర్‌ పనులు పూర్తి అవుతాయి. ఆరు షిష్‌ ల్యాండ్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి. వీటి కోసం రూ.3400 కోట్లు ఖర్చు చేస్తున్నాం.
  • ఒక వంక పోర్టులు వేగంగా నిర్మిస్తున్నాం. మరో వంక ఎయిర్‌ పోర్టులు , ఇంకో వంక షిషింగ్‌ హార్బర్లు, మరో వంక షిష్‌ ల్యాండ్‌ సెంటర్లను అనుసంధానం చేస్తూ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నాం. మరోవంక పేదల సంక్షేమానికి కట్టుబడిన ప్రభుత్వంగా, నా అక్కచెల్లెమ్మల ముఖాల్లో చిరునవ్వులు చూడాలని, పేదవాడు పేదవాడిగా ఉండిపోకూడదని, నా అక్కచెల్లెమ్మల కుటుంబాల్లో వెలుగులు నింపడానికి అక్షరాల రూ.2.10 లక్షల కోట్లు డిబీటీ ద్వారా నేరుగా అందించాను.
  • అక్షరాల రూ.2.10 లక్షల కోట్లు నేరుగా అందించాను. నాన్‌ డీబీటీ కలిపితే ..30 లక్షల మందికి  ఇంటి స్థలాలు, ఒక్కో ఇంటి విలువ కనీసం రూ.2.50 ల క్షలు వేసుకున్నా కూడా నాన్‌ డీబీటీలో రూ.3 లక్షల కోట్లు ప్రజల చేతుల్లో పెట్టాను.
  • ఎక్కడ ఎలాంటి లంచాలు, వివక్ష లేదు. మీ బిడ్డ నేరుగా బటన్‌ నొక్కుతున్నాడు. మీ ఖాతాల్లో చేరిపోతుంది. పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాను.
  • ప్రజలకు అందించే సేవల్లో చూస్తే ఎన్నో విప్లవాత్మక మార్పులు ఈ నాలుగేళ్లలో చేశాం. పేదలకు అందించే పింఛన్లు, ప్రజా సేవలను సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా, ఆర్‌బీకేల ద్వారా, పల్లెల్లో విలేజ్‌ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్‌ వ్యవస్థ ద్వారా సేవలు అందిస్తున్నాం. మన కళ్లెదుటే ప్రస్ఫూటంగా కనిపిస్తోంది.
  • ఇప్పటికే 30 లక్షల ఇళ్ల పట్టాలు నా అక్కచెల్లెమ్మలకు అందించాం. ఇప్పటికే 21 లక్షల ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ ఇల్లు పూర్తి అయితే ఒక్కో ఇల్లు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు అంచనా వేసినా కూడా ..ఈ ఇల్ల ద్వారా అక్షరాల లక్షన్నర కోట్ల నుంచి రెండు లక్షల కోట్లు నా అక్కచెల్లెమ్మలకు ఇచ్చినట్లు అవుతుంది.
  • అమరావతి ప్రాంతంలో కూడా ఇలా 50 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం రెండేళ్ల క్రితమే మన ప్రభుత్వం ప్రారంభిస్తే…దేవతల యజ్ఞానికి రక్షసులు అడ్డుకున్నట్లు ఈ రోజు పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని మన ప్రభుత్వం అడుగులు వేస్తుంటే..ఈ టీడీపీకి తోడు ఓ గజ దొంగల ముఠా. వీళ్ల పని దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం. వీరికి ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ5, వీరికి ఓ దత్తపుత్రుడు తోడు.
  • వీరందరూ కూడా ఈ మహా యజ్ఞానికి అడ్డుపడుతూ వచ్చారు. రాజధాని ప్రాంతంలోని కృష్ణా, గుంటూరు జిల్లాలోని పేదలకు ఏమాత్రం ప్రవేశం లేని ఒక గేటెడ్‌ కమ్యూనిటిని గవర్నమెంట్‌ డబ్బుతో కట్టుకోవాలని చుట్టూ ఒక భారీ రియల్‌ ఎస్టేట్‌ ద్వారా లక్షల కోట్లు గడించాలని చంద్రబాబు వేసిన స్కేచ్‌ చూశాం.
  • ఇందులో పేద వర్గాలు కేవలం పాచి పని చేయాలట, రోజు వారి పని చేసుకోవాలట, అక్కడ పేదలు నివాసం ఉండటానికి వీల్లేదట. పొద్దునే పేదలు అక్కడికి వచ్చి సాయంత్రానికి వెళ్లిపోవాలట. ఇటువంటి దారుణమైన మనస్తత్వం ఉన్న రక్షసులతో యుద్ధం చేస్తున్నాం.
  • నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, ఇతర నిరుపేద వర్గాలకు తావు లేకుండా, ఇళ్ల స్థలాలు లేకుండా, అడుగు పెట్టే పరిస్థితి లేకుండా కేవలం పనివారుగా మిగిలిపోవాలని ఆలోచన చేస్తున్నారు.
  • ఆ పేదల తల రాతలు మార్చాలని, ప్రతి పేద కుటుంబం తల రాతలు మార్చాలని అక్కడే..ఆ అమరావతిలో 50 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా ఇల్లు కట్టించే బృహత్తర కార్యక్రమాన్ని మరో నాలుగు రోజుల్లో ప్రారంభిస్తున్నా.
  • పేదలంటే ఈ చంద్రబాబుకు ఎంతటి చులకనో తెలుసా? ఆయన మాటలు వింటే అర్థమవుతుంది.  ఎస్సీ కులంలో ఎవరైనా పుట్టాలని అ నుకుంటారా అని దళితులను దారుణంగా అవమానించిన వ్యక్తి చంద్రబాబు. బీసీల తోకలు కత్తరిస్తానని మాట్లాడాడు. కోడలు మగ బిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అని మహిళలను అవమానించాడు ఈ చంద్రబాబే.  మూడు రాజధానులు వద్దని అన్ని ప్రాంతాలను అవమానించాడు. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్‌ మీడియం వద్దని మొత్తం పేదవర్గాల మీద దాడి చేశాడు.
  • చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సెంట్‌ భూమి కూడా ఇవ్వలేదు. ఒక్కరికి కూడా ఇల్లు కట్టించలేదు. పేదలకు మీ బిడ్డ ఇళ్ల స్థలాలు ఇస్తుంటే రాష్ట్రవ్యాప్తంగా కోర్టుల్లో కేసులు వేయించింది ఈ బాబే. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే సామాజిక సమతూల్యం దెబ్బతింటుందని కోర్టుల్లో కేసులు వేశాడు.
  • రూపం మార్చుకున్న అంటరానితనానికి, నయ పెత్తందార్ల భావజాలానికి ప్రతీక ఈ బాబు,,ఆయనతో పాటు దుష్ట చతుష్టయం, గజ దొంగల ముఠా. ఈ మధ్యకాలంలోనే విశాఖలో చంద్రబాబు అన్న మాటలు మరీ బాధనిపిస్తుంది.
  • విశాఖలో చంద్రబాబు ఏమన్నారో మీరంతా చూశారు. అమరావతిలో మీ బిడ్డ 1.1 సెంట్‌ భూమిలో ఉచితంగా ఇల్లు కట్టిస్తుంటే..50 వేల మందికి ఒక శాశ్వత చిరునామాగా సొంత ఇంటిని ప్రభుత్వమే నిర్మిస్తుంటే..ఈ గొప్ప పవిత్ర స్థలాన్ని చంద్రబాబు సమాధి కట్టుకునే స్థలంతో పోల్చాడు. ఇలాంటి చంద్రబాబుకు మనవత్వం ఉందా?ఒక్కసారి ఆలోచన చేయండి.
  • ఇలాంటి పెద్ద మనిషికి పేదల కష్టాలు తెలుసా? సొంత ఇల్లు లేకపోతే..అద్దె ఇంట్లో ఉండే నిరుపేద, దిగువ, మధ్య తరగతి ప్రజలు ఎలా బతుకుతారో చంద్రబాబుకు అవగాహన ఉందా? ఈ కుటుంబాల్లో ఎవరైనా మనిషి చనిపోతే ఆ శవాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియని పరిస్థితి. వాళ్లు ఎలా బతుకుతారని చంద్రబాబు సృహ లేదా? కళ్లరా కడసారి చూపు లేని పరిస్థితి. గుండెల నిండ బాధ ఉన్నా..ఎక్కడ ఏడ్చాలో తెలియని పరిస్థితి. శ్మశానం వద్ద ఏడ్చే పరిస్థితి ఉంది. ఇవేవి చంద్రబాబుకు పట్టవా?
  • ఇటువంటి పరిస్థితిలో ఉన్న పేదలను ఆదుకోవాలనే ఆలోచన చంద్రబాబుకు ఎప్పుడు రాలేదు. చివరికి పక్షి కూడా తన పిల్లల కోసం ఒక గూడు కట్టుకోవాలని ఆలోచన చేస్తుంది. ఇలాంటి నిరుపేదలు కొన్ని లక్షల కుటుంబాలు సొంత ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీని అతిదారుణంగా అడ్డుకుంటున్న ద్రోహి చంద్రబాబు.
  • మంచి చేసే చరిత్ర వీరికి లేదు. వీరు ఎవరూ కూడా పేదల వద్దకు వచ్చి ఫలాన మంచి చేశామని చెప్పి ఓట్లు అడిగే పరిస్థితి లేదు. వీరి ఆలోచన అంతా ఒక్కటే, కుళ్లు, కుతాంత్రాలు ఒక్కటే. ఒక దత్తపుత్రుడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5ను నమ్ముకుంటారు. వీరంతా ఏకమై ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చూపించగలరు.
  • వీరందరూ ఏకమైతే ..మంచి చేసిన చరిత్ర ఉన్న మీ బిడ్డ ఎన్నికల్లో గెలవడమే కష్టమట. మిమ్మల్ని నేను అడుగుతున్నాను..ఒక్కసారి మీ గుండెలపై చేతులు వేసుకొని,ఒక్కసారి ఆలోచన చేసి మీ బిడ్డ పాలనలో మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే..మీ బిడ్డకు తోడుగా మీరే సైనికులుగా నిలబడండి అని అడుగుతున్నాను.
  • మీ బిడ్డకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు తోడుగా ఉండకపోవచ్చు. మీ బిడ్డ వీళ్లను నమ్ముకోలేదు. మీ బిడ్డ నమ్ముకుంది దేవుడి తోడు, మీ అందరి చల్లని ఆశీస్సులనే నమ్ముకున్నాడు. మీ బిడ్డ చేసిన మంచిని చూపించి మీ ఆశీస్సులు కోరుతున్నాను.
  • ఇవాళ చేసే ఈ కార్యక్రమం ద్వారా ఈ ప్రాంతం ఇంకా బాగుపడాలని, ఈ ప్రాంతానికి ఇంకా మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను.
  • చివరిగా..పేర్ని నాని అడుగుతున్నట్లుగా..మెడికల్‌ కాలేజీ వద్ద రోడ్డు ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి రూ.25 కోట్లు అవుతుంది. దీన్ని కూడా మంజూరు చేస్తున్నాను.
    ఆరు కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి రూ.3 కోట్లు అవుతుంది. దాన్ని కూడా మంజూరు చేస్తున్నాను. అంబేద్కర్‌ భవన్‌ మరమ్మతులకు రూ. 5 కోట్లు కేటాయిస్తున్నాను.
    మరో 12 గ్రామాలకు సంబంధించి ఎంజాయ్‌మెంట్‌ సర్వే పూర్తి చేసుకొని 12,615 ఎకరాలకు సంబంధించి వివాదాల పరిష్కారాలను కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తున్నాను. అర్హులను గుర్తించి అసైన్డ్‌ భూములతో పాటు వీరికి కూడా పట్టాలు ఇస్తామని సీఎం వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. ఈ ప్రాంతానికి ఇంకా మంచి జరగాలని కోరుకుంటూ సీఎం వైయస్‌ జగన్‌ తన ప్రసంగాన్ని ముగించారు.

 

LEAVE A RESPONSE