– తీరని మంచినీటి సమస్య!
– భూ కబ్జాలు, మోసాలపై వెల్లువెత్తిన అర్జీలు
– గ్రీవెన్స్‌లో పాల్గొన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, చైర్మన్ లు జీవీ రెడ్డి, గురుమూర్తి
మంగళగిరి: టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అక్రమాలు, మోసాలు, భూ కబ్జాలపై ఫిర్యాదు చేసేందుకు సోమవారం అర్జీదారులు పెద్దఎత్తు తరలివచ్చారు. వారి నుండి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ జీవీ రెడ్డి, గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుముర్తి లు అర్జీలు స్వీకరించి అధికార్లతో ఫోన్లలో మాట్లాడి బాధితుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.
• నల్లె నాగార్జున అనే వ్యక్తి ఆయుష్మాన్ భారత్ కార్డుల వర్క్ ఇప్పిస్తానని తన వద్ద రూ. కోటి రూపాయాలు తీసుకొని మొసం చేశాడని.. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన హుసన్ బాషా గ్రీవెన్స్ లో నేతలకు అర్జీ ఇచ్చారు. అతనిపై చర్యలు తీసుకొని తనకు డబ్బులు వచ్చేలా చూడాలని వేడుకున్నాడు.
• తమ పిల్లలకు ఉద్యోగం ఇప్పిస్తామని.. రత్నబాబు, కృష్ణచైత్య, రాజేష్ అనే వ్యక్తులు తమ వద్ద రూ. 6,40,000 తీసుకొని తమను మోసం చేశారని.. వారిపై చర్యలు తీసుకొని డబ్బులిప్పించాలని గుంటూరుకు చెందిన మండెపూడి కోటయ్య గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి వాపోయాడు.
• ప్రభుత్వం ఆదేశం మేరకు 72,306 జతల యూనిఫాంలను స్కూల్ పిల్లలకు కుట్టి ఇచ్చామని, గత ప్రభుత్వం తమకు డబ్బులు ఇవ్వకపోవడంతో తాము ఇబ్బంది పడుతున్నామని.. దయ చేసి తమకు రావాల్సిన రూ. 19,34,208 లను విడుదల చేసి సహకరించాలని కడప జిల్లాకు చెందిన హుసెన్ బాషా వేడుకున్నారు.
• చంద్రన్న బీమా లో బీమా మిత్రలుగా పనిచేస్తున్న1800 మందిని గత ప్రభుత్వం అన్యాయంగా తొలగించిందని.. దయ చేసి తమను తిరిగి విధుల్లోకి తీసుకొని తమకు ఉపాధి అవకాశం కల్పించాలని పలువురు బీమా మిత్రలు అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేశారు.
• కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతేకూడ్లురు గ్రామంలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని.. నాడు టీడీపీ ప్రభుత్వంలో ఈ మంచినీటి సమస్యను పరిష్కరించడానికి సమ్మర్ స్టోరేజ్ ను ప్రతిపాదిస్తే.. గత వైసీపీ ప్రభుత్వం దీన్ని పూర్తిగా గాలికొదిలేసిందని.. దయచేసి పనులను పూర్తి చేసి గ్రామంలో నెలకొన్న మంచినీటి సమస్యను పరిష్కరించాలని పలువురు గ్రామస్తులు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేశారు.
• కలెక్టర్ ఉత్తర్వులను మార్చేసి అక్రమ పద్ధతిలో మైన్ లీజు పొంది రూ. 1690 కోట్ల రూపాయలను కృష్ణ సాయి గ్రానైట్స్ వారు కొట్టేశారని.. దీనిపై విచారణ జరిపితే భారీ అవినీతి బయటకు వస్తుందని..దీనిపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని.. అందుకే గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేస్తున్నట్టు ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలానికి చెందిన రంగరావు అనే వ్యక్తి నేతలకు అర్జీ ఇచ్చి చర్యలు తీసుకోవాలని కోరాడు. అంతేకాకుండా పర్యావరణ అనుమతులకు మించి చీమకుర్తి ప్రాంతంలో అధిక పరిమాణంలో తవ్వకాలు జరుపుతున్నా అధికారులు తప్పుడు నివేదికలతో జరిగిన అక్రమాలను కప్పెడుతున్నారని వాటిపై కూడా విచారణ జరిపించాలని కోరారు.
• సత్యసాయి జిల్లా, ధర్మవరం మండలం రావుల చెరువు గ్రామానికి చెందిన కె.చంద్రశేఖర్ విజ్ఞప్తి చేస్తూ.. తమ భూమిని వైసీపీ నేతలు కబ్జా చేశారని.. దీనిపై విచారించి సర్వే చేసి తమ భూమిని తమకు అప్పగించాలని ఎన్నిసార్లు అర్జీలు అధికారులకు పెట్టుకున్నా పట్టించుకోవడంలేదని.. దయ చేసి తమ భూమిని సర్వే చేసి తమకు అప్పగించాలని వేడుకున్నారు.
• గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు ఎస్టీ కాలనీకి చెందిన పలువురు పేదలు గ్రీవెన్స్ లో అర్జీ ఇస్తూ.. తాము గుడారాలు వేసుకుని బతుకుతున్నామని.. తమకు నిలువు నీడలేదని.. దయ చేసి తమకు ప్రభుత్వం ఇల్లు కట్టించి ఆదుకోవాలని వారు అర్జీ ఇచ్చి నేతలను వేడుకున్నారు.
• ప్రకాశం జిల్లా దర్శికి చెందిన ఎస్. చిన్నరమణయ్య విజ్ఞప్తి చేస్తూ.. తమ ఇంట్లో 15 సవర్ల బంగారం దొంగలు ఎత్తుకెళ్లారని.. దీనిపై పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు తీసుకోవడంలేదని.. బాధితుడు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశాడు.
• 2014-2019 నరేగా పెండింగ్ బిల్లులు దాదాపు 4,23,014 వర్కులకు ఆమోదింపబడిన 132.8 కోట్లు క్లోస్డ్ మోడ్ లో ఉండడం వలన పేమేంట్ జరపలేకపోతున్నారని.. దీనిపై క్లోస్డ్ మోడ్ లో ఉన్న వర్క్స్ ను కేంద్రంతో మాట్లాడి ఓపెన్ చేయించాలని.. గత ప్రభుత్వం నిర్వాకం వలన పేమెంట్స్ అప్లోడ్ చేయడానికి క్రింది స్థాయి ఆఫీసర్లు విముఖత వ్యక్తం చేస్తున్నారని ఏసీబీ కేసులపై క్లారిటీ ఇప్పించి నిధులు విడుదలైయ్యే లా చూడాలని కేంద్రమంత్రిని గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుముర్తిని కోరారు.
• ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన పేరెడ్డి నాగిరెడ్డి విజ్ఞప్తి చేస్తూ తాము గతంలో కొన్న భూమిని కబ్జా దారులు ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నారని.. దయ చేసి తమ భూమిని కబ్జా కాకుండా తమకు న్యాయం జరిగేలా చూడాలని కేంద్ర మంత్రికి విన్నవించుకున్నారు