-వక్ఫ్ ఓటు పోటు + ఆ పై ఈ ఫోర్జరీ విప్ మోసం
( బాబు భూమా)
అసలే వక్ఫ్ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయించడంలో విజయం సాధించిన వైవీ బాబాయి తెల్లవారుజామున వచ్చి పడుకున్నారు. నిన్న రాత్రి వైకాపా విప్ జారీ చేయలేదని, క్రాస్ ఓటింగ్ జరగబోతోందని జాతీయ మీడియాలో పెద్ద దుమారం రేగింది. తెల్లవారుజామున వివేకానంద రెడ్డి గారిని చంపిన సమయంలో రాజ్యసభలో వఖ్ఫ్ బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తే ఎవరికి ఎలా తెలుస్తుందిలే అని వైకాపా భావించింది.
కానీ తెల్లారేసరికి రాజ్యసభలో ఎవరి బలం ఎంత, హాజరైన మరియు హాజరుకాని సభ్యుల వివరాలు, పార్టీల వారీగా జారీ చేసిన విప్‌లు, బిల్లుకు అనుకూలంగా మరియు వ్యతిరేకంగా వచ్చిన ఓట్లు, విప్ ఇచ్చిన ఎన్‌డీఏ & కాంగ్రెస్ పార్టీల ఓట్లను తీసివేసి జాతీయ మీడియాలో లెక్కలు తేల్చేశారు. వైకాపా కూడా ముస్లింలకు వెన్నుపోటు పొడిచిన బ్లాక్ షీప్ పార్టీ అని తేలిపోయింది.
ఈరోజు మధ్యాహ్నం నిద్ర లేచి బిత్తరపోయి గతుక్కుమన్న వైకాపా.. బాబాయిని తరువాత బలిపశువును చేసుకోవచ్చులే అని, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా సోషల్ మీడియా వారికి పని అప్పగించింది. వారు ఏమి చేశాడో చూడండి. బాబాయి సంతకాన్ని కత్తిరించి అతికించినా సరిపోయేది. ఫోర్జరీ చేసినట్లు ఒక విప్‌ను సృష్టించి, దానిని ఖండిస్తూ ఇప్పుడు వైకాపా సోషల్ మీడియాలో లేఖను విడుదల చేశారు.
ముస్లింలను మభ్యపెట్టడానికి కాకపోతే.. నిజంగా విప్ ఇచ్చి ఉంటే నిన్ననే ముస్లీంలకు తెలిసేలా మీడియాకు ఆ సమాచారం ఇచ్చేవారు. సాక్షిలో స్క్రోలింగులు వేసి హోరెత్తించేవారు. పైగా ఆ తేదీని కూడా తొందర్లో నిన్నటిది వేశారు. ఏ పార్టీ అయినా ఆ రోజు ఓటింగ్‌కు వస్తుందంటే ఆ రోజే విప్ ఇస్తుందా?
చిత్తశుద్ధి ఉంటే కొన్ని రోజుల ముందే ఇచ్చేవారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి రాజ్యసభలో చర్చ మొదలైన తేదీతో విప్ ఇవ్వరు. ముస్లింలను ఉభయసభల్లో మోసం చేసింది చాలక, మళ్లీ ఇప్పుడు మోసం చేసి బురిడీ కొట్టించడానికి ఈ నాటకం ఆడారు.
మొదటి చిత్రం ఈ రోజు విడుదల చేసిన విప్‌లోనిది. రెండో చిత్రం గతంలో బాబాయి అవిశ్వాస తీర్మానం ఇచ్చినప్పటిది. సంతకాలను మీరే చూడండి.