/సంక్షేమ పథకాలపై ప్రచారం చేయండి

సంక్షేమ పథకాలపై ప్రచారం చేయండి

– సికింద్రాబాద్ కాంగ్రెస్ ఇన్చార్జి ఆదం సంతోష్‌ను ఆదేశించిన సీఎం రేవంత్‌రెడ్డి
– నూతన సంవత్సర సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ని, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ని కలిసిన అదం సంతోష్

హైదరాబాద్: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే , నియోజకవర్గ ఇంచార్జ్ అదం సంతోష్ కుమార్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ని మర్యాద పూర్వకంగా కలిశారు.

అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు పేదల సంక్షేమం కోసం అమలుచేస్తున్న పథకాలను ఇంటింటికి ప్రచారం చేసే బాధ్యత తీసుకోవాలని ఆదంను ఆదేశించారు. పిసిసి చీఫ్ మహేష్‌గౌడ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే నగరాభివృద్ది జరుగుతోందని, గతంలో ఎన్నడూ లేనన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న విషయాన్ని ప్రజల్లోకి వెళ్లి వివరించాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా అదం సంతోష్ కుమార్ మాట్లాడుతూ, సికింద్రాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మరింత పటిష్టంగా నిర్మించేందుకు క్షేత్రస్థాయిలో పార్టీని బలపరిచే దిశగా నిరంతరం పనిచేస్తానని తెలిపారు.

అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు ప్రతి అర్హులైన లబ్ధిదారునికి చేరేలా బాధ్యతగా కృషి చేస్తానని సీఎం, టీపీసీసీ అధ్యక్షుడికి వివరించారు.

సికింద్రాబాద్ నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రజల సమస్యల పరిష్కారంపై ముఖ్య నేతలతో సానుకూలంగా చర్చ జరగడం ఈ సమావేశం ప్రత్యేకతగా నిలిచింది.