పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు

-నేటి నుంచే అమలు ఎన్నికలు సమీపిస్తుండటంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. పెట్రోల్, డీజిల్ ధరలపై రూ.2 తగ్గిస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. హైదరాబాద్: లీటర్ పెట్రోల్ ధర- రూ.107.66 లీటర్ డీజిల్ ధర- రూ.95.82 విశాఖపట్నం: లీటర్ పెట్రోల్ ధర- రూ.108.48 లీటర్ డీజిల్ ధర- రూ.96.82 విజయవాడ: లీటర్ పెట్రోల్ ధర- రూ.109.76 లీటర్ డీజిల్ ధర- రూ.97.51

Read More

సీతమ్మ తల్లికి రంగులు మార్చే బంగారు చీర

తన తండ్రి నల్ల పరంధాములు నెలకొల్పిన వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని, అదే దిశలో చేనేత మగ్గంపై పలు ప్రయోగాలు చేస్తూ, తండ్రికి దగ్గర తనయుడు అనిపించుకున్నారు నల్ల పరందాములు.. సిరిసిల్లలో అగ్గిపెటెల్లో చీరను నేసి ఘనతను సాధించిన చేనేత కళాకారుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అతని కుమారుడు నల్ల విజయ్ ఇఫ్పుడు భద్రాద్రి రాములోరికి.. బంగారు చీరను నేసి.. మరింత ఖ్యాతి సంపాదించారు. తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న నల్ల విజయ్ అగ్గిపెట్టెల్లో, దబ్బనంలో పట్టే చీరలను నేసి…..

Read More

రేవంత్‌కు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి

-కేసీఆర్.. ఖబడ్దార్! -టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ డిమాండ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాటు ఉంటదో ఉండదేమో అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టు లాంటిది. కుంభకోణాల్లో ఇరుక్కున్న కేసీఆర్ అసహనంతో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. పదేపదే బిజెపి బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం పై మాట్లాడటం, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను అవమానపరుస్తున్నట్లే. ఖబర్దార్ బిజెపి, బీఆర్ఎస్ నాయకుల్లారా.. తక్షణమే బేషరతుగా…

Read More

రాష్ట్రం గొంతెండుతోంది

-దాహం తీర్చండి -తాగునీటి కష్టాలపై మాజీ మంత్రి హరీష్‌రావు ట్వీట్‌ రాష్ట్రంలో తాగునీటి కష్టాలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు బుధవారం ట్వీట్‌ చేశారు. రాష్ట్రం గొంతెండుతోంది. గుక్కెడు నీటి కోసం ప్రజలు రొడ్లెక్కుతున్నారు. ఖాళీ బిందెలతో ధర్నాలు చేస్తున్నారు. ట్యాంకర్ల కోసం ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్‌ పాలనలో నీటి కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. పదేళ్ల కేసీఆర్‌ ప్రభుత్వంలో ఇలాంటి దుస్థితి, దృశాలు ఎప్పుడూ కనిపించలేదు. మారుమూల తండాల్లోనూ మిషన్‌ భగీరథ జలధార సమృద్ధిగా వచ్చేది….

Read More

కమనీయం.. భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణం

తరలి వచ్చిన భక్తజనం భద్రాచలం: శ్రీరామ నవమి భద్రాచల క్షేత్రంలో బుధవారం సీతారాముల కల్యాణం నేత్రపర్వంగా సాగింది. కల్యాణం సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారలకు ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. తిరు కల్యాణ బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం తెల్లవారు జామునే ఆలయ ద్వారాలను తెరిచి అర్చకులు.. రామయ్యకు సుప్రభాత సేవ జరిపారు. అనంతరం తిరువారాధన, ఆరగింపు, మంగళ శాసనం, అభిషేకం ఆ తర్వాత…

Read More

యుపిఎస్సీ విజేతకు రావుల అభినందన

యుపిఎస్సీ ఫలితాల్లో ఆలిండియా 3వ ర్యాంకు సాధించిన మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకల్ మండలం పొన్నకల్ గ్రామానికి చెందిన డోనూర్ సురేష్ రెడ్డి మంజుల దంపతుల కూతురు డోనూరు అనన్య రెడ్డిని మాజీ ఎంపీ ,వనపర్తి మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి అభినందించారు. తన మొదటి ప్రయత్నంలోనే మూడవ ర్యాంకు సాధించి పాలమూరు సత్తా చాటిన తెలంగాణ ముద్దుబిడ్డ అనన్య కు ఆమె తండ్రి డోనూర్ సురేష్ రెడ్డి తో ఫోన్ లో మాట్లాడి అభినందనలు…

Read More

ప్రజలకు వెన్నుపోటు పొడవడమే ఇందిరమ్మ రాజ్యమా?

-హామీలు తక్షణమే అమలు చేయాలి -బోగస్‌ డిక్లరేషన్‌, గ్యారంటీలతో కాలం గడపొద్దు -రాష్ట్రంలో మరో వసూలు రాజ్యం వచ్చింది -కిషన్‌రెడ్డి రైతు దీక్షలు ప్రారంభం కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేయ డాన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సోమవారం రైతు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నపుడు రాష్ట్రంలో అనేక రకాలుగా రైతులకు అన్యాయం చేసింది. రైతు రుణమాఫీ…

Read More

హనుమంతుడు దేవుడు…లీడర్‌ కాదు

-దేశ వినాశనం కోసం పుట్టిన పార్టీ బీజేపీ -గాంధీ కుటుంబంలా త్యాగాలు చేశారా? -పదేళ్లలో అప్పులను రెట్టింపు చేశారు -దేవుడి పేరుతో రాజకీయం మానుకోండి -15 ఎంపీ స్థానాలు గెలవబోతున్నాం -తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి దేశ వినాశనం కోసం పుట్టిన పార్టీ బీజేపీ అని తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. గాంధీ భవన్‌లో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ విలువలతో రాజకీయాలు చేస్తుందని, రాహుల్‌ గాంధీ కుటుంబం ఆస్తులను…

Read More

కవితకు 23 వరకు జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు

మద్యం కేసుకు సంబంధించి అరెస్టయిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు జ్యుడీషియల్‌ కస్టడీని కోర్టు పొడిగిస్తూ సోమ వారం తీర్పు చెప్పింది. ఈ నెల 23 వరకు జ్యుడీషియల్‌ కస్టడీ విధిస్తూ ఢల్లీ రౌస్‌ ఎవెన్యూలోని సీబీఐ స్పెషల్‌ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. కవితకు గత నెల 26న కోర్టు 14 రోజుల జ్యుడీషి యల్‌ కస్టడీ విధించింది. ఆ సమయం ముగియడంతో ఈడీ అధికారులు సోమవారం ఆమెను కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఈడీ తరపున అడ్వొకేట్‌…

Read More

శ్రీరాముని కల్యాణోత్సవ ప్రత్యక్షప్రసారానికి అనుమతివ్వండి

– ఈసీకి మంత్రి కొండా సురేఖ లేఖ ఏప్రిల్ 17న శ్రీరామనవమి సందర్భంగా భద్రాచల సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కోరారు. ఇప్పటికే కళ్యాణ మహోత్సవ ప్రత్యక్ష ప్రసారాలకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనుమతి నిరాకరించినందున మంత్రి సురేఖ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ కి ఈ మేరకు…

Read More